Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 35

    "మీలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ వుంది!"
    "అందుకే యింకా బ్రతికి వున్నాను. లేకపోతె ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దాన్ని."
    "మిమ్మల్ని అభినందిస్తున్నాను"
    "ఎందుకు?" తెల్లబోయింది సుజాత
    "యదార్ధంగా మాతాడుతున్నందుకూ __ ఆత్మహత్య చేసుకోనందుకూ!"
    పక పక నవ్విందామె.
    నన్ను క్షమించండి. మా అమ్మగారి తరుపున క్షమాపణ వేడుకుంటున్నాను. ఆవిడ అల ప్రవర్తించివుండకూడదు. మీ యోగ్యత మీ గుణ గుణాలు తెలియకుండా మాటాడింది. రియల్లీ అయాం ఎక్స్ ట్రీమ్లీ సారి!"
    మీరు ఆ విషయం మాటాడుతున్నారా? ఇంకా మరేమిటో అనుకున్నాను. భలేవారే! నేనెప్పుడో మరచిపోయాను ఆ విషయాన్ని. చెప్పారుగా, నాలో సెన్సాఫ్ హ్యూమర్ వుందని అందుకే బ్రతికేస్తున్నాను!"
    నివ్వెరపోయాడు నాగరాజు.
    అయినా నాగరాజుగారూ! నాకేందుకో పెళ్ళిమీద యింట్రస్ట్  తగ్గిపోతూవుందండి! ఆ బంగారు బొమ్మని   నాలాగా నిండు వ్యక్తిత్వంతో పెంచాలనిపిస్తోంది. జెవితాన్నంతా త్యాగం చేసయినా ఆ పిల్లని మంచి యోగ్యురాలిగా బుద్ధిమంతురాలిగా చేసి, బాగా చదివించాలనివుంది. నిజంగా ఆ పిల్లన నా బిడ్డే అయితే __ అదే నా జీవిత ధ్యేయం కాదూ?
    ఏతల్లి కన్నబిడ్డయితేనేం  రాజుగారూ! నా చేతుల్లోకి వచ్చిపడింది మనకి బజార్లో వజ్రం దిరికిందనుకోండి. ఎవరిదోనని నిర్లక్ష్యం చేస్తామా? మురికిగుంటలో కలువ పూసిందనుకోండి __ తుంచి అందుకోమా? వేలకి వేలు ఖరీదు చేసే బంగారునగ పెంటపోగులో కనిపిస్తే ఛీ ఛీ అనుకుంటామా? తీసి కళ్ళ కద్దుకొమూ?
    "ఆ పిల్ల పుటుక ఎలాటిదయితేనేం రాజుగారూ? పెంపకంలో బంగారు కమ్మెచ్చు తీర్చినట్టు తీర్చలేనూ! నాకు ధ్యోగం వుంది. బాదర చేస్తాను ఇంకా నాకు పెళ్ళెందుకు కండీ?"
    ఆమె కమతంలో గద్గాదకని గమనించేడతను . అతని దృష్టిలో ఆమె వ్యక్తిత్వం హిమలాయోన్నతంగా పెరిగిపోయింది. హేట్స్ ఆఫ్ అనుకున్నాడు. "సుజాతగారూ, నేను మీ ప్రెండ్ నని చెప్పుకుందుకి గర్వపడుతున్నాను!" అన్నాడు.
    ఆ కంఠంలోని సిన్సియారిటీ గమనించిందామె. "థాంక్స్!" అంది.
    "ఏమ్మా?" బయటే వున్నారు. ఇంకా ఆఫీసు తెరవలేదా? అంటూ వచ్చాడు రామలింగయ్యగారు.
    "నమస్కారమండీ ."
    "నమస్కారం, గుడ్ మార్నింగ్! పదండి వెళదాం ఏమయ్యా రాజూ! అచ్చం వందపైసలు ఆంద్రడివి. చదువు కున్నవాడివి. సుబ్బరంగా నమస్కారం అసలేవుటయ్యా! ఏం మనుషులో ఏమా! ఏదో మేమంటే __ ప్రీ ఇండిపెండెంటు మనుషులం, మాకింకా ఆ బ్రిటిషు వాసనా, ఆ పద్దతులూ, ఆ ఇంగ్లీషు మోజు తగ్గలేదనుకో మీ కేమ్మయ్యా!  స్వేచ్చా వాయువులు పెలిస్తూ పుట్టారు అం"
    నాగరాజు ఏమీ సమాధానం చెప్పలేదు. తన సెక్షన్ లోకి వెళ్ళిపోయాడు. సుజాత ముసిముసిగా నవ్వింది. రామలింగయ్యగారు తన సీట్లోకి వెళ్ళిపోయారు.
                                     15
    రోజులు భారంగా దొర్లిపోతున్నాయి. సుజాతికి మల్లీశ్వరితో బాగా ప్రొద్దుపోతున్నది. ఇప్పుడా పిల్ల బోర్లపడుతోంది. ముందుకీ ప్రాకుతుంది పేరుతో పిలిఅతే తల తిప్పుతుంది. బోసినవ్వు నవ్వుతుంది. కితకితలు పెడితే నవ్వుతుంది.
    ఆ రోజు సాయంకాలం ఆఫీసునుంచి తిరిగొచ్చాక సాయంకాలం ఏడింటి దాకా పాపని ఆడిస్తూ నిద్రపుచ్చింది. తలుపు వేసుకోబోతూ కౌంపౌండ్ గెట్ వైపు చూసింది. ఎవరో వ్యక్తి జానికమ్మగారి యింటినుంచి తల వంచుకుని గబగబా అంగాలువేస్తూ గేటు వైపుగా వస్తోన్నాడు. కౌంపౌండ్ మధ్యలో వున్న నియాన్ లైట్ వెలుతురూ మందంగా ప్రసరిస్తోంది.
    ఆ మందపు వెలుతుర్లో అతని నడక ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. స్పష్టంగా కనిపిస్తోన్న ఆ మనిషి పీలికలు ఏవేవో గుర్తుకి తెస్తున్నాయి. మనస్సుకి అందకుండా పోతున్నాయి. ఎవరో తరుముతున్నట్టుగా వడి వడిగా నడుస్తూన్నాడా వ్యక్తి.
    అతన్ని బాగా చూడాలని యిమ్కాస్త ముందుకీ వచ్చింది. ఎదో స్మృతిపథంలో మెరిసినట్లయి తలుపులు చేరవేసి గబగబా గేటు వైపు నడవసాగింది.
    కౌంపౌండ్ లో ఎవరూలేరు! జానికమ్మగారి వరండాలో సవిత కాలేజీ పాఠాలు చదువుకుంటోంది.
    ఆ వ్యక్తి గేటు దాటినా నిమిషానికి సుజాత గేటువద్దకి వచ్చింది. అంతలో అతనెవరో ఆమెకి గుర్తు చిక్కెడు.
    "ఏమండీ !" అంటూ పిలిచింది మెల్లిగా.
    ఆ పిలుపు వినిపించినట్టుగా గబగబా నడుస్తున్నాడు.
    "ఏమండీ!" మిమ్మల్నే! ఆగండి!" అంది గట్టిగా అటూ ఇటూ చూసి ఎవరూలేక పోవటంతో.
    చప్పున అతను వెనుదిరిగి చూశాడు, సుజాతని చూసి ఆగిపోయి తల వంచుకుని నిలుచున్నాడు.
    సుజాత సంతోషంతో, సంభ్రమంతో, కోపంతో "ఎందుకండీ పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళి పోతున్నారు!" అంది.
    అతను ఎదో చెప్పబోయాడు.
    మీరింకే౦ చెప్పకండి. మీరు నన్ను అప్పుడే చూసి వుంటారు అందుకే తప్పించుకుని వెళుతున్నారు. చెప్పండి! ఎందుకలా వెళ్ళిపోయారు ఆ రోజు. రైలు ఎక్కి పాపని నా ప్రాణానికి వదిలేసి పోయారు. మీరేమో _ బరువుని తగ్గించుకున్నారు. కానీ నేను ఎంతెంత నరకయాతన అనుభవించాను? ఎందరెందరి కోపానికి గురయ్యారు? ఎన్ని అవమానాల్ని ఎదుర్కొన్నాను. మైగాడ్! ఆ శిక్ష శత్రువులకి కూడా వొద్దురా భగవంతుడా అనిపించింది! అయినా నింగిలోని సిరిమల్లిలాటి జాబిలిని కడలి పొంగిపోయినట్టుగా  ఆ పాప ముఖం చూస్తె చాలు పరిపూర్ణ అనందం కలుగుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS