"ఇంతకీ వ్యక్తత్వం ఉన్న మనిషి! చాలా మొండి ధైర్యం!"
తలూపెడతను కొద్ది సేపయ్యాక సెలవు తీసుకున్నాడు.
కళ్యాణ్ సాలోచనగా వెళ్ళిపోయాడు తన రూమ్ కి.
* * * *
దాదాపు తొమ్మిది గంటల సమయంలో యింటికి చేరాడు నాగరాజు. అతని కెందుకో మనసు పాడైపోయినట్టుగా అనిపించింది. కారణం ఏమీ లేదు. ఒక్కోసారి ఎవరి కయినా నిష్కారణంగా మనసులో చికాకు పుడుతుంది. ఎంత ప్రయత్నించినా మనస్సు కుదుటికిరాదు. ఏదో సంఘటనొ, విషయమో నూరి వస్తేగానీ ఆ చికాకు తగ్గదు.
ఎన్నడూ లేంది. అతనికి విస్కీ తాగాలనిపించింది ఆఖరికి బ్రాందినో, బీరో పుచ్చుకోవాలనిపించింది. కాళ్ళు అప్రయత్నంగా అటుకేసి దారి తీశాయి. మనస్సు నిద్రపోఎతట్టుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
బార్ ముందుకీ రాగానే కాళ్ళు ఠక్కున సంకేలు వేసి నట్టుగా ఆగిపోయాయి. బార్ కేసి తలెత్తి చూశాడు. "గాంధీ వైన్స్" అన్న బోర్డు నియాన్ లైట్ల వెలుతుర్లో దేదీప్య మౌనంగా వెలుగుతోంది.
"హుం ఏం దేశం ఇది! గాంధి వున్స్, నెహ్రూ క్షారశాల, శంకర్ విలాస్ మిలతీరి హొటల్ __ ఇవా పేర్లు? ఇదా జాతికి చైతన్యం తెచ్చిన మహా మనుషుల కిచ్చే గౌరవం? ప్రజలకి యిందులో న్యూన్యత తెలియటం లేదా?' ప్రభుత్వానికి దే౦ అవసరంలేదా? అన్నిటికి టైటిల్స్ రిజస్ట్రేషన్ చేసి నట్టుగా వీటికీ చేస్తారే! అప్పుడు అభ్యంతరం పెట్టకూడదా? ప్రభుత్వానికీ మాత్రం తెలియదా?" అనుకున్నాడు.
మనసులో చికాకు మరి కాస్త పెరిగి కోపంగా మారిపోయింది. అనాలోచితనంగా తీసుకున్న నిర్ణయాన్ని తొలగించుకుని ఆ క్షణంలో తనలో ఏర్పడిన బలహీనతని తిట్టుకుంటూ యింటి ముఖం పట్టెడు. మనస్సు చికాకుకి మార్గం కారణం దొరికిందిగా!
"ఏం నాయానా! తొమ్మిదైనా యిల్లు జ్ఞాపకానికి రాలేదా?' అడిగింది నాయనమ్మ.
సమాధానం యివ్వకుండా లోపలి నడిచాడు. ఆవిడ పడక వరందాలోనే! వాగోచ్చినా వంగడోచ్చినా ఆదేస్థానం రేపు చచ్చినా అక్కడే చస్తుందేమో ముసలావిడ! అనుకున్నడతను.
"బావుందిరా నీ బలాదూరు తిరగటం ! సాయంకాలం అయిదింటికి ఆఫీసు వదిలితే కొంపకి చేరేది ఇప్పుడా?"
"అమ్మా! ఊరకే అరవకు!"
"ఏమిట్రా విసుగు? ఎందుకా కోపం? ఇప్పుడేవరేం అన్నారనీ? నేలాగా వెధవ పనులు ఎవరూ చేయలేదిక్కడ!"
"ఏంటమ్మా అది! ఎక్కడెక్కడో తిరిగి యింటికి వస్తే యిదా నువ్విచ్చే స్వాగతం! కొంచెం మనస్సుకి విశ్రాంతి యివ్వు!"
అందుకేరా బాబూ! త్వరగా పెళ్ళి చేసుకోరా నాయనా అంది. నువ్వేమో దేశాన్నీ , స్త్రీ జనాన్ని వుద్దరిస్తోన్నట్టుగా ఆ పతివ్రతని ఏమ్చుకున్నావు!" హేళనగా అంది.
చురుగ్గా చూశాడు నాగరాజు "నువ్వు సుజాతయింటికి వెళ్ళొచ్చవా? అక్కయ్య నీతోపాటే వచ్చిందా?" అడిగాడు శాంతంగా.
"అహం సుబ్బరంగా యిద్దరంకలిసే వెళ్ళాం. ఆ మహాతల్లి మంగళారతులు ఎత్తి పంపింది!"
కనుబొమలు ముడివేశాడతాను.
"అయినా నీ కిదేం బుద్దిరా? పెళ్ళి కాకుండా పిల్ల తల్లయి, ఆ పిల్లని తగుదనమ్మా అని పెంచుకుంటోన్న పిల్లని ఏమ్చుకున్నావ్? దేశంలో యింకెక్కడా నీకు నచ్చిన అమ్మాయిలే లేరా?"
"అమ్మా!" శాంతంగా పిలిచాడు. నువ్వు సుజాతతో ఆ విషయం అడిగివా"
"అడక్క __ కళ్ళేదురుగా రబ్బరు బంతిలా పాపా కనిపిస్తోంవుంటే ఎలా అడక్కుండా వుండగలను . తండ్రికి దూరంగా ఈ నగరంలో ఒక్కటే ఎందుకుంటుందో అర్దమైంది ఈ నిర్వాకానికేనేమో!"
"నువ్వు చాలా తప్పు చేశావమ్మా! సుజాత చాలా గొప్ప వ్యక్తి !"
"ఏమిటి !పెళ్ళి కాకుండానే పిల్ల తల్లి అయింది, గొప్పవ్యక్తి __ నేను పనికిమాలిన డాన్నీనూనా, బావుంది నే సంబంధం!"
అతనేం అన్లేదు! హుం ఎవరికెంత ప్రాప్తమో అంతే! నువ్వు ఆమెకు అత్తవయ్యే అర్హత కోల్పోయావు! అనుకున్నాడు.
"భోజనానికి పద!"
"ఆకలిగా లేదమ్మా!" అన్నాడు బెడ్ పై వాలిపోతూ. నిజానికి అంతదాకా బళ్ళతో తినాలని వున్న ఆకలంతా చచ్చిపోయింది.
"ఇప్పుడు నేనేం చేశానురా బాబూ! అయినా నాపై కోపం తిండిపై చూపితే ఎలాగా? అన్నం పరబ్రహ్మ స్వరూపంరా నాయానా! దాన్ని కాదంటే కావాలనుకున్నప్పుడు దొరకదు! రా! తిందువుగాని!"
"వద్దమ్మా ఎప్పుడో ఎవరికీ పెట్టి వుండను. నాకు ఈ పూట లేకుండా పోతోంది. ఇప్పుడు నువ్వే అన్నావుగా, ఎప్పుడో వద్దని తిరస్కరించి వుంటాను!"
"మాటకి మాట! అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలోచ్చాక బిడ్డలా ? అంతా నారాత!" అనుకుంటూ పడుకుంది ఆమె.
ఆ పూట చాలా రాత్రిదాకా నిద్రపోలేదు నాగరాజు.
* * * *
మరుసటి రోజు వుదయం ఆమె ఆఫీసు గేటులో అడుగు పెడుతూ వుండగానే "గుడ్ మార్నింగ్ !" అన్నాడు రాజు.
"గుడ్ మార్నింగ్ !" అంది సుజాత అలవాటుగా.
"ఒక్క నిమిషం మాటాడతారా?"
నవ్వేసింది సుజాత "మీ ప్రశ్నకి నా నవ్వుకి ఒక్క నిమిషం సరిపోయింది!"
అతనూ నవ్వేడు ఆ మాట విరుపుకి
"చెప్పండి? ఇది మన జాతీయలేండి. ఒక్కమాట అంటూ పావుగంట మాటాడతాం. ఒక్క విషయం చెబుతాం. ఒక్కడుగు అలా వెళ్ళోద్దాం అంటూ కోలిమీటరు వెళతాం!" అంది సుజాత.
