Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 33

    సుజాత మల్లేశ్వరి పాలు పట్టడం పూర్తీకగానే జానికమ్మగారు ఎత్తుకున్నారు. ఆవిడని చూడగానే కేరింతలు కొట్టిందా పిల్ల.                        
    "మీ అమ్మగారు ఎక్కడమ్మా?"
    లేరండీ! నా చిన్నతనంలోనే పోయారు!" అంది సుజాత ఆమె గొంతు ఆ కాస్తాకే గాద్గాదిక మయింది.
    "నాన్నగారెక్కడమ్మా?"
    మా వూళ్ళో ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పని చేస్తున్నారు పిన్నీ, పిల్లలూ అక్కడే వున్నారు!"
    "ఇక్కడ నువ్వూ __మీ అన్నయ్య వాళ్ళుంటున్నారా?"
    "నా కన్నయ్యలు లేరండీ!"
    "ఒక్కత్తివే వుంటున్నావా?"
    "భలేవారే జానికమ్మ పిన్ని గారింట్లో వుంటే ఒంటరిగా వున్నట్టుందా౦డి! సొంత తల్లిల చూసుకుంటారావిడ!"
    ఆ మాటలు ఆమెకి త్రుప్తినే కలిగించాయి. "ఇంత మంచిపిల్ల కాబట్టే జానికమ్మ మా అబ్బాయికి సూచించింది నిన్ను!"
    సుజాత తెల్లబోయింది.
    "మరయితే యీ పిల్ల ఎవరు?"
    ఉలికిపడింది సుజాత. కానికమ్మగారూ తెల్లబోయారు ఆశ్చర్యంతో. అయితే క్షణంలో తేరుకుని. "రాజు నీతో ఏం చెప్పలేదా పిన్నీ?" అని అడిగింది.
    "చెప్పడమ్మా! ఈ పిల్ల సంగతులన్నీ చెప్పాడు. కానీ యీ చంటి పిల్ల ఎవరో నాకే అర్ధం కావడంలేదు?"
    అది సుజాత కన్నబిడ్డే ! వాడికి యీ విషయం తెలుసు. అయినా గొప్ప మనస్సుతో, విశాల భావంతో . తల్లినీ, పిల్లనీ, స్వీకరించేందుకు యిష్టపడ్డాడు. ఈనాటి యువతరమే గొప్పది. గొప్పగా మెచ్చుకోతగ్గది. ఎవరో దుష్టుడు చేసిన అన్యాయానికి సుజాత జీవితాంతం బాధపడాలా? వీల్లేదు అన్నాడు!"
    ఆ మాటలకి లేచి నుంచుంది. "ఇలాంటి చెడినదాన్ని కోడలుగా తెచ్చుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. నా కొడుక్కి మతిపోయినా నాకు మతిపోలేదు. ఈ పెళ్ళి జరిగేందుకు వీల్లేదు. అంతగా వాడు పట్టుబడితే తల్లిని వదులుకుంటాడు!"
    ఏమండీ ! కోపంగా అరిచింది సుజాత.
    "నిన్ననలేదమ్మా! నా కొడుకుని అనుకుంటూన్నను!"
    "మీ యిష్టం! మీ అబ్బాయిని లక్ష అనుకోండి. తిట్టుకొండి. దండించండి. పెళ్ళి చేస్తారో మానతారో మీ యిష్టం. కానీ నన్ను మీ యిష్టం వచ్చినట్టుగా అనే హక్కు ఎవరిచ్చారు?"
    "ఇదిగో అమ్మాయ్__"
    "మాటాడకండి. పెళ్ళి చూపులకి మిమ్మల్ని బొట్టుపేట్టి పిలిచారా ఎవరైనా? మీ అబ్బాయి ఇష్టపడితే చాలా? నేను యిష్టపడనక్కర్లేదా?"
    అబ్బా! ఇంతటి రంభ దొరకదని మావాడే వారించాడు చెడిపోయిన__"
    ఆపండి! ఇమోసారి ఆ మాటంటే మర్యాద దక్కదు. ఎవరు చెప్పారండీ మీకు నేను చేదిపోయానని? పళ్ళురాలగొడతాను రమ్మనండిటు!"
    "సుజాతా!"
    "ఊరుకోండి పిన్నిగారూ! మీకు తెలియదు. అందరికీ భయపడి తలవంచితే మనల్ని మొత్తేస్తారు. ఎక్కడి కక్కడ తిరగబడాలి అంతే!"
    "ఏంటమ్మా నీ తలబిరుసు _ పెళ్ళి కాకుండానే ఎవడికో బిడ్డనికాని, తగుదనమ్మా అంటూ ఆ బిడ్డని పెంచుకుంటూ పైగా నన్నే చివాట్లేస్తావా?"
    "ఏమండీ ! ఏమంటున్నారు? ఈ బిడ్డ నా బిడ్డా?" ఆశ్చర్యంగా అడిగింది.
    "మరెవరి బిడ్డ? నా బిడ్డా?" హేళనగా అంది.
    "మీకు చెప్పినా అర్ధంకాదు. ఈ పసిపిల్ల ఎలా నా చేతుల్లోకి వచ్చిందో __ ఎందుకో నేనే పేంచుతున్నానో మీకు తెలియదు!"
    "అయితే ఆ పిల్ల నీ కూతురు కాదా!"
    ఆశ్చర్యంగా అడిగిన జానికమ్మగారువైపు చూసి "కాదు పిన్నిగారూ? అదంతా ఓ విచిత్ర సంఘటన __ మళ్ళీ మీకు చెబుతాను. మెరినా నమ్మితే చాలు!" అంది.
    చంద్రసేనమ్మ లేచింది "వస్తానేజానీ __" అంది. ఆవిడకి ఎలాగో వుంది.
    సుజాత మౌనంగా వుండిపోయింది. ఆవిడ వెళ్ళి పోయింది. తర్వాత కొద్ది సేపటికి పాపని తీసుకుని వెళ్ళి పోయింది ఆమె.
                                                                   14
    "ఏమైంది?"
    "సెంట్ పర్సెంట్ సక్సెస్!"
    "కవిత విషయం ఎత్తేవా?"
    "ఎక్కడుందోనని అల్లలాడి పోతోంది. నాకు తెలియదు. తెలియగానే తీసుకొస్తాను అన్నాను. అ మాటకే ఆవిడ పొంగి పోయింది.?"
    "ఇంకేం చెప్పావు?"
    "అంతే! మరేం మాటాళ్ళేదు!"
    "సరే! అలావుంచు. సమయం చూసి చెబుదా౦. వీడి విషయమేమిటి?"
    పెళ్ళి ప్రయత్నలల్లో వున్నాడు రాస్కెల్! అమ్మాయిల బ్రతుకులంటే అట బొమ్మల కంటే హీనం అనుకున్నాడు.
    "కానీ! కానీ! సూటిగా చూసి దెబ్బకొడితే కాని పేళ్ళవదు. చూద్దాం. ఆ విషయం లేకపోతె ఇదీ కుదరుతుంది!"
    "అదే నా ఆశ !"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS