Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 32

    "ఎక్కడికి! సాయం కాలానికి మీ మావయ్య వస్తారు అంతా వస్తారు నువ్విక ఇక్కడే ఉండిపో!" అంది ప్రేమగా.
    "లేదత్తయ్యా! నేను ఎక్కువగా కెంపులు వెళుతూ ఉండాలి. ఈ రోజు మూడింటికి మద్రాసు వెళుతున్నాను. తిరుగోచ్చాక వస్తాను!" అంటూలేచాడు.
    సరే బాబు నీ ఇష్టం ! ఇంత కంటే బలవంతం చేయగలమా!" అందామె.
    కళ్యాణ్ వెళ్ళిపోయాడు.
                                                                    13
    తర్వాత నాలుగైదు రోజులు గడచిపోయాయి. జానికమ్మగారికి కొంత సంతోషంగానే ఉంది. కవిత చహారా తెలసీ తెలియనట్టుగా ఉంది. సుజాత సమస్య కూడా కొంత తెరిసిన పడ్డట్టయింది. దేవుడు దయతెలిస్తే సుజాత పెళ్ళయి పోతుంది. రాజు ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టపడుతున్నాడు. తన సంగతి తెలిసినా వాడు ఒప్పుకోవడం చాలా గొప్పగా ఉంది ఆమెకి.
    కానే ఆమె సందేహమల్లా సుజాతని గురించే . ఆపిల్ల ఒప్పుకుంటుందా అనే అనుమానం ఇంకా వదల్లేదు. సుజాతకి ఎంతటి స్వాభిమానము, స్వాతిశయం, పట్టుదలా ఉన్నాయో ఆమెకి బాగా తెలుసు.  ఏమాత్రం అవమానం జరిగినా సహించకోలేదు. కన్న తండ్రినే క్షణలపై  దూరం చేసుకో గలదు. అంతటి అభిమానివతి అమె.
    ఆ రోజు నాగరాజు తల్లిగారు చంద్రసేనమ్మగారు వచ్చారు జానికమ్మగారుఇంటికి. ఆవిడ భర్త నాగరాజు చిన్న తనములోనే సవ్యసించి హిమాలయానికి వెళ్ళిపోయాడు. ఆవిడకి నాగరాజు ఒక్కడే కొడుకు. అయన చాల మంచి వాడని, ఆవిడే పరమగయ్యాళనీ, అందుకే సన్యాసుల్లో కలసి పోయరనీ లోకులు అనుకుంటారు.
    "కానీ గిట్టని వాళ్ళే అల అనుకోవాలి! మా కోడలు బంగారపు పిల్ల, వాడొట్టి వెధవ సన్నాసి, పిరికి సన్నాసి __ అప్పులు చేసి తీర్చలేక దేశాలు పట్టుక పోయాడు. బోలెడంత ఆస్తి తగలేశాడు. చేతకానమ్మ బోర్ల పోసుకుందని వెధవైనాడు  పొతే మా కోడలిని అంటే న్యాయమేముంది!" అంటుంది, స్వరూప నాగరాజు నాయనమ్మ, చంద్రసేన ఆత్తగారు అయిన సుభద్రమ్మగారు.
    అవడింకా బ్రతికే ఉంది. ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆవిడకి కనుచూపు తగ్గలేదు. పళ్ళూడిపోలేదు. నడుము వంగలేదు. నడిచేరార్ధ్యం తగ్గలేదు. ఇప్పటికీ ఆవిడే వంట చేస్తుంది. మనవడంటే ఆవిడకి ఆరోప్రాణం నగరాజుకీ నాయనమ్మ అంటే గురి.
    భర్త సన్నాసుల్లో కలిశాడు. ఉన్నదో పోయాడో తెలియదు. అంచేత చంద్రసేనమ్మ నిత్య సువాసిని.
    ఆవిడ సుజాతను చూసుకునేందుకు వచ్చింది. వెంట నాగరాజు వస్తానంటే వద్దంది.
    "రా పిన్నీ!" అంటూ ఆహ్వానించింది ఆప్యాయంగా జానికమ్మ. ప్రేమతో కూడిన పిలుపుకి ఆమె ఉప్పొంగిపోయింది.
    కాఫీ కలిపి తెచ్చిస్తే తాగేసి "జానికీ! నీ చేతి కాఫీరుచి ఇంకా తగ్గిపోలేదే! కాఫీగింజల్లో ఈత పిచ్చాలు కలిపే స్తొన్నా నీ ఇంటి కాఫీ రుచిగా ఉందంటే అది నీ పాడిచలవ! ఇదో ఈ కాఫీ కోసం రోజూ వచ్చి పోదామనే ఉంటుంది. కానీ ఆ చివరనుంచి ఈ చివరిదాకా వచ్చి పోవాలంటే ప్రాణం కడగట్టుతుంది!"
    "పోనీలే రోజు రాలేకపొతే వారానికొక సారైనా రారాదా అమ్మమ్మ" అంది సవిత.
    "ఎక్కడోస్తానే తల్లి నరల్లా వునారు. మీరు రానేరారు" అందామె.
    "మా కంటె కాలేజి __ చదువు __ బోలెడంత పని"
    "అవునవును సినిమాలు చట్టు బండలూ __ వెధవ పత్రికలూ చదవడాలూ__"
    "నీకు యింటి పనేంవుంది. అమ్మమ్మా! తాతయ్య చేస్తుమ్డిగా వంట, నీకు లేస్తే కీళ్ళ నొప్పులు __ కూచుంటే కాళ్ళ నొప్పులు. నువ్వేం చేస్తావు. వంట పేరు పెడుతూ, గంటకోసారి కాఫీ తాగుతూ"
    "సవితా!" గద్దించింది జానికమ్మ.
    "పోన్లే! చిన్న పిల్ల అదనకపోతే యింకెవరంటారు. దీన్ని నా కోడలుగా చేసుకుందామనుకుంటే__"
    "నీ కోడలిగానా! గోవిందో! గోవింద! నీ కోడరికం వద్దు అమ్మమ్మా! అయిగా నన్నిలా అమ్మమ్మ మనవరాలిగానే వుందనీ __ నీకు గేదెపాల చిక్కని కాఫీ, మావయ్యకి గడ్డ పెరుగు __ ఆవకాయ అన్నం నేనెక్కడ తెచ్చేది కట్నంలోనో, ఆడపడుచు లాంఛనంగానో గేదేని అడిగేస్తారు మీరు!"
    ఫక్కున నవ్వేసింది. ఆమె __ మనవరాలి మాటలు ముద్దుగా అనిపించాయి. ఈ మాటలు వినియోగం పోయిందే సవితా! మీ మావయ్య ఇక్కడ వుందటగా __ ఆ సుజాతని చూసి యిష్టపడ్డాడు. మీ అమ్మ ఛీ పో అనకుండా సరే అందిట. నన్ను వెళ్ళి చూసి రమ్మంటే వచ్చాను. ఆ దేవుడి దయవల్ల వాడి నెత్తిన నాలుగాక్షింతలు పడితే __"
    ఆమె మాటలు పూర్తీకాకముందే "పెళ్ళి చూపులకి వచ్చావా అమ్మమ్మా! పద! పద! నేనూ వస్తా" అంది సవిత.
    "సవితా!" గద్దించింది. జానికమ్మగారు .
    "ఏమమ్మా!"
    ఇలాటి పెద్ద పెద్ద విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. నేనూ అమ్మమ్మా వెళ్ళొస్తా౦. నువ్వు జాగ్రత్త! ఇంకాసేపటిలో మీ నాన్న గారోస్తారు. కాఫీ కలపి యివ్వు" అంది.
    సవిత ముఖం ముడుచుకుంది.
    ఇద్దరూ వెళ్ళేసరికి సుజాత మల్లేశ్వరి పాలు పడుతూ కూర్చునుంది.
    "రండి ! రండి! అంటూ ఆహ్వానించింది చిరునవ్వుతో.
    "ఈమె మా పిన్నిగారు! అంటే నాగరాజు తల్లిగారు!"
    "ఎవరూ ? మా ఆఫీసులో సెక్షన్ ఆఫీసరు నాగరాజు గారా?"
    "అవునమ్మాయ్! అంది చంద్రసేనమ్మగారు. ఆవిడకి సుజాతను చూడగానే కడుపు నిండిపోయినట్లుగా వుంది.
    బంగారపు బొమ్మలా వుందనుకుంది. కొడుకు సెలక్షన్ బ్రహ్మాండం అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS