Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 31

    కొద్ది సేపాగిందామె. కూతురి జ్ఞాపకాలు తాలుకాలు గుండెకోత కోస్తున్నాయి. దాంతో గతస్మృతుల తాలూకు బాధాచిహ్నాలు మనస్సుని వేధించాయి.
    కళ్యాణ్ ఆతురతతో వింటున్నాడు.
    "అక్కడే మేం పొరపాటు పడ్డంరా కల్యాణ్! దాని భవిష్యత్తుని ఊహించి అక్కడ చేర్పించామే కానీ  తల్లిదండ్రులకు దూరంగా  పెరిగే ఆడపిల్లకి భద్రతా తక్కువనీ, ఇతరుల ఇళ్ళల్లో వదిలేస్తే వాళ్ళ పూచీ పూర్తిగా ఉండదనీ తెలుసుకోలేక వదిలేస్తే వాళ్ళ పూచీ పూర్తిగా ఉండదనీ తెలుసుకోక పోయామురా.
    "అందమైన అమ్మాయిల చుట్టూ మగపిల్లలు తితగతం ఎప్పుడూ వుండేదే! ప్రేమనీ అనురాగమనీ కల్లబొల్లి కబుర్లు చెప్పటమూ సహజమే! దానికీ అమ్మాయిల ప్రలోభ పడటమూ మామూలేరా.
    "అందరిలాగే  కవిత ఒకబ్బాయి వ్యామొహంలో పడింది. ముందుగా ఆ అబ్బాయి వ్యామోహంలో పడింది. ముందుగా ఆ అబ్బాయే తన వ్యామోహంలో పడి తన చుట్టూ తిరుగుతూన్నాడని ఊహించింది తప్ప. తనే ఆ అబ్బాయి వలలో పడిపోయానని అనుకున్నది. కాదు. అది గ్రహిమ్చేసరికి జరగవలసింది జరిగిపోయింది.
    "ఆ అబ్బాయి ఎవరో మాకింత వరకూ తెలియదు. కవితను ప్రశ్నించే అవకాశమూ మాకు దక్కలేదు. అతనితో తిరుగుతుందని తెలిసి చౌదరిగారు కానీ, అయన భార్యకానీ,  ఆఖరికి వాళ్ళమ్మాయి కానీ, మనకవిత క్లాస్ మేట్ విరాజకానీ ఒక్క మాటైనా మనతో అని ఉంటే కధయింతదాకా వచ్చేదికాదు.
    "అతను మన కవిత వాళ్ళమ్మాయి అనుకొని తిరిగే డంటారు కొందరు. అంత ధనవంతుల అమ్మాయికాదని మామూలు మధ్య తరగతి కుటుంభీకుల తెలిసిన క్షణం నుంఛీ అతను కవితతో మాటలు తగ్గించెడట. ఏం చదువుతూ ఉండేవాడో ఎవరికీ తెలియదు. అతనేక్కడో వెళ్ళిపోయాడట!
    "అప్పటికే కవిత నెల తప్పిందన్నారు. అది ఆ భగవంతుడికే తెలియాలి. ఒకరోజు కవిత చీర, రవిక, వాచీ విజయవాడలో కృష్ణ ఒడ్డున కనిపించాయన్నారు. దా౦తో అది చనిపోయిందని నిర్దారణ చేసుకుని, నిరాశ చేసుకున్నాం! దిగులుతో అవమానంతో బ్రతుకున్నాం!"
    కూతురి కథ పూర్తీ చేసేసరికి ఆమె కంటినీరు  తిరిగింది.
    కళ్యాణ్ కూడా చాల బాధ పడ్డాడు.
    ఇద్దరి మధ్యనిశ్శబ్దం సమరం చేసింది.
    "నువ్విన్నాళ్ళు ఎక్కడున్నావ్ కళ్యాణ్?"
    దానికి అతడు నవ్వేశాడు. "నేను బి.ఐ. చదువుతానంటే నాన్న తనతో కాదన్నాడు. టీచర్ ట్రైనింగ్ కి వెళ్ళమన్నాడు. మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా బ్రతకటం ఇష్టం లేకపోయింది. అందుకే పారిపోయాను!"
    "ఎక్కడికి వెళ్ళావు!"
    "చెడి చెన్నపట్నం చేరమనట్టుగా నేను నేరుగా మద్రాసు వెళ్ళాను. నా అదృష్టం బావుందత్తయ్యా. నాతోపాటు ఓ తెలుగాయన వచ్చాడు. ఆయనకి సినీఫీల్డుతో పరిచయం ఉంది. ఫైనాన్షియల్ అన్నమాట.
    "నన్ను మాటల్లో పెట్టేసి నాకథంతా విన్నాడు. మద్రాసులో దిగగానే తనింటికి తీసుకెళ్ళి సిటీ అంతా చూపించాడు. స్టూడియోలుఅన్నీ తోప్పేడు రికార్డింగ్, ఘాంటింగ్ అన్నీ చూసేను. బి.ఇ. చదువుతానన్నాను.
    "చాలా రోజులు నన్ను పరీక్షించేడు. వీలయితే ఊరకి పంపించెయ్యాలని నా అడ్రసూ, నాన్నగారి అడ్రసూ నోట్ చెసుకున్నాడు. ఆఖరికి చదువుమీది నా వ్యామోహం అర్ధమై నాకు చదువుకునే అవకాశం కల్పించాడు. ఎంతో శ్రమపడి అక్కడే ఇంజినీరింగ్ సీటు ఇప్పించాడు.
    తర్వాత అయిన మీకు ఉత్తరాలు రాయమని చెప్పాడు. నేను ససేమిరా అన్నాను. ఇంజనీరునై, ఉద్యోగం సంపాదించుకునే దాక మా ఇంటి ముఖం చూడనాన్నను. ఇంట్లో కష్టాలు, బాధలు, యిబ్బందులు చెప్పెను. అయన విని సరే అన్నాడు.
    "నా చదువు పూర్తయినా, ఉద్యోగం దొరికేసరికి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పడిక ఇక్కడే ఉంటున్నాను. నిన్ననే ఈ ఊళ్ళో ట్రాన్స్ ఫార్ మీద జాయిని అదృష్టం అలా కలిసొచ్చింది"
    కళ్యాణ్ విషయం వినగానే ఆవిడకు సంతోషమైంది. "ఊరెళ్ళి వచ్చావా!" అంది.
    "ఆ వెళ్ళి అందర్నీ చూసోచ్చాను."
    "పోనీలే బాబూ! మీ నాన్నకి యీ వయస్సులో తోడ్పడెందుకే భగవంతుడు నిన్నింతటి వాడిని చేశాడు."
    "భగవంతుడు ఎప్పటికీ గొప్పవాడే అత్తయ్యా! అతనా తలచుకుంటే ఏమైనాచేయగలడు! ఆఖరికి చనిపొయిందనుకున్న కవితను కూడా బ్రతికించి తెగలడు."
    ఆశగా చూసిందామె! కవిత పేరు చెపితే చాలు నాగస్వరం విన్న నాగుపాములా అవుతుందామె. "కళ్యాణ్! కవిత విషయం ఏమైనా విన్నావట్రా?" అంది ఆశగా.
    "ఎక్కడ అత్తయ్యా! చనిపోయిందన్నావుగా!"
    లేదురా బాబూ! వాళ్ళంతా అన్నా నాకేమీ కవిత బ్రతికే ఉంటుందని నమ్మకం ఉంది. దానిది అంత పిరికి గుండె కాదురా బాబు!"
    ఒకవేళ బ్రతికినా ఎక్కడుందో మనం కనుక్కోగలమా! కనుకున్నా వెళ్ళి తీసుకొనివచ్చి ఇంట్లో, పెట్టుకోగాలమా ! పోడు లోకలు కాకుల్లా అనే మాటలు విని మనం ఊరుకో లేము కదా! కన్న బిడ్డనైనా, కట్టుకున్న భార్యనైనా లోకం కోసం వదిలేసి దేశం కదా మనది!"
    అతని మాటల్లో ఏదో వ్యంగం! ఏదో ఆశ! ఏదోదారి కనిపించినట్టయింది. ఆమెకి. "కళ్యాణ్! నా కూతురు ఎక్కడ ఉందో వెతికి పెట్టునాయనా! నీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డ కనిపిస్తేచాలు నాకు. లోకాన్నే లెక్కచేయను!" అంది ఆవేశంగా.
    "ఉన్న ఊరోదలి ఆస్తి అమ్ముకుని ఇంత దూరము వచ్చేశాము మీరు! ఆ విషయంలోనే కదా! ఇప్పుడికి_"
    "అప్పటి మాట వేరు. ఇప్పటి మాట వేరు నాయనా! మనుషులం మారుతూ ఉంటాం కదా!"
    సరే అత్తయ్యా! ఉద్యోగరిత్యా నేను తిరుగుతూ ఉంటాను కదా! ఎక్కడైనా తటస్థపడితే వెంటేసుకుని తీసుకొని వస్తాను" అన్నాడు.
    ఆ మాత్రం హామీకే ఆమెకి అందలం ఎక్కినట్టుగా అయింది. మరికొద్ది సేపు ఆకబురూ ఈకబురూ అయ్యాక అతను "వస్తానత్తయ్యా" అంటూ లేచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS