జానికమ్మగారు మనస్సులో అనందం వెల్లి విరిసింది.
* * * *
జానికమ్మగారు భర్త వెళ్ళగానే, పిల్లలని బళ్ళకి పంపేసి మల్లేశ్వరీని నిద్రపుచ్చి చాపపై నడుంవాల్చింది. ఆ వరం పత్రిక చేతికి తీసుకుని తిరగేస్తూ వుందిపోయింది. కొద్ది సేపయ్యాక కళ్ళు అలసి పోయినట్లుగా పత్రుకని ప్రక్కకి పెట్టేసి కళ్ళు మూసుకుంది.
నిద్రరావటంలేదు. మనస్సు మూగపోయినట్లుగా వుంది. గాలి స్తంభింస్తే ఆకులూ కదలకుండా నిలిచిపోయినట్లుగా వుందామే. మనస్సు.
"అత్తయ్యా!"
నిద్రపట్టీపట్టట్టుగా ఒక విధమైన ట్రాన్సిట్ లో వున్నట్టున్న జానికమ్మగారికి ఆ పిలుపు వినిపించలేదు.
"అత్తయ్యా!"
ప్రశాంతంగా వున్న చెరువులో నీటిబెడ్డ పడితే చేరువంత కడలిపోయినట్లుగా ఆమె చప్పున స్పృహలోకి వచ్చి కళ్ళు తెరచింది.
వరండాలో పడుతున్న ఎండ పోడక కొద్దిగా కళ్ళు మసకలుగా కనిపించాయి.
"ఎవరూ?" అంది వ్యక్తిని చప్పున గుర్తించలేక.
అతను ఆ చాపమీదే కూర్చున్నాడు. మెల్లగా "నేనత్తయ్యా! కళ్యాణ్ ని" అన్నాడు. ఆ ఒక్కమాటే తన పూర్తీ పరిచయం తెలుపుతున్నాట్టుగా.
ఆ మూడక్షరాలూ ఆమెపై మంత్రంలా పనిచేశాయి.
చప్పున లేచి కూర్చుంది
"ఎవరూ కల్యాణా?" అన్నట్టుగా చూసి పైకే అనేసింది నమ్మేలేనట్టుగా
మరోమారు పరిశీలనగా చూసింది.
పదేళ్ళ క్రిందట పదిహేనేళ్ళు వయస్సులో దేశాలు పట్టి పోయాడతను. జానికమ్మగారు ఆడబిడ్డ సౌందర్య కొడుకు కళ్యాణ్.
ఆ రూపురేఖలు కొద్దిగా విస్తృతమయినా అసలు పోలికలు అలానే గుర్తుగా లీలగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ముక్కు ఆ కళ్ళు _ ఆ గొంతుపై మచ్చ.
అవును వీడు కల్యాణే! అనుకుంది.
"కళ్యాణ్!" అంటూ పిలిచింది సంబరంగా. ఆమెకి అన్నేళ్ళ తర్వాత అతడిని చూడటం ఎంతో సంబరంగా వుంది.
"నేను ముందుగా నర్సాపురం వెళ్ళా అత్తయ్యా! మీ రెవరూ అక్కడలేరు. మావయ్యకి ట్రాన్స్ ఫర్ అయిందని తెలిసింది విచారించగ విచారించగా ఆఖరికి తెలిసింది. మీరు వూళ్ళూళ్ళు మారి యిక్కడున్నారని. మీరు ట్రాన్స్ ఫార్స్ మీద ఎన్నేన్ని వూళ్ళు తిరిగారో అన్నీ తిరిగోచ్చాను.
"నాకు మీరు ఆస్తంతా అమ్మేసి యిక్కడ యిళ్ళు కట్టుకున్నారని చెప్పారు. ముందస్తుగా ఆఫీసుకే వేళదామను కున్నాను. అయినా మామయ్య గుర్తుపడతారో లేదో అనుకుంటూ ఆఫీసుకే వెళ్ళి యీ అడ్రసు సంపాదించాను. ఆఫీసులో మావయ్యని కలుసుకోలేదు. కానీ దూరంనుంచి చూశాను. ఆయనలో వృద్దాప్యం బాగా కనిపిస్తూ వుంది" అన్నాడు.
"అవును కళ్యాణ్ ఆ సంఘటన జరిగేక మేం మళ్ళీ వూరెళ్ళి అందరికీ ముఖం చూపించలేకపోయాము ఆస్తంతా మా చిన మరిదికి అమ్మేసి వచ్చాం. అ సంఘటన గుర్తుకు రాగానే ఆమె ముఖం అదోలా అయింది.
"ఏం జరిగిందత్తయ్యా!"
అతని ప్రశ్నకి వెంటనే సమాధానం యివ్వాలేదామే.
అతని ప్రశ్నకి వెంటనే సమాధానం యివ్వాలేదామే.
ఏదో ఆలోచిస్తూ వుండిపోయింది. జానికమ్మగారు
కళ్యాణ్ మళ్ళీ రెట్టించలేదు.
అత్తగారి ముఖాన్నీ పరిశీలనగా చూస్తూ వుండి పోయాడు.
"పద కళ్యాణ్! భోంచేద్దువుగానీ! ఎప్పుడనగా తిన్నావో ఏమో! నామతి కూల! ఊరకే కబుర్లు చెబుతూ కూర్చున్నాను" అంది నోచుకుంటూ తర్వాత వడ్డించడానికి లేవబోయింది.
"నువ్వేం శ్రమపడకత్తయ్యా! నేను పదకోండి౦టికే హొటల్లో భోజనం చేసి వచ్చాను!" అన్నాడు.
నమ్మలేనట్ట్లుగా చూసిందామె.
"ఒట్టత్తయ్యా! నీ దగ్గర అబద్హం అడతానా! భోజనం చేసే వచ్చాను. అయినా నాకు రోజూ పది పదిన్నరకే భోజనం చేసే అలవాటు అంచేతే ఆ వేళకి భోజనం చేశాను " అన్నాడు మళ్ళీ.
"ఇక్కడి కోస్తూ హొటల్లో భోంచేసి వచావా! అదేం పని? పిడికెడు అన్నం పెట్టలేమనుకున్నావా?" నిష్టూరంగా అందామె.
"నో! నో! అదేం లేదత్తయ్యా! అలా అనుకుంటానా?" అన్నాడు నొచ్చుకుంటూ.
"పోనీలే! కాస్త ద్రిమ్కయినా కలిపిస్తాను. ఏమ్దన పడివచ్చావు" అని లేచి వెళ్ళి పళ్ళరసం కలుపుకుని వచ్చింది. అతనికో గ్లాసు యిచ్చి తనో గ్లాసు తీసుకుని తాగేసింది.
"ఊం అంతా ఆఫీసులకి వెళ్ళిపోయారా అత్తయ్యా?"
"మీ మావయ్య ఆఫీసుకి వెళ్ళేరు సవిత కాలేజీకి వెళ్ళింది. చంద్రమణి స్కూలుకి వెళ్ళింది __"
"మరి కవిత__"
అతని నోటంట కవిత పేరు వినగానే ఆమె ముఖంలో విషాదచ్చాయులు తాండవ మాడేయి __ అంత వరకూ కళకళ లాడుతున్నముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీటి పొరలు ఏర్పడ్డాయి. అతని కేసి దిగులుగా చూసింది.
"మేం యీ ఊ కి ట్రాన్స్ ఫర్ కాకముందు కవిత గుంటూర్లో బి. ఏ. చదువుతూ ఉంది. దాన్ని గ్రాడ్యుయేట్స్ ని చెయ్యాలనీ, నీకిచ్చి పెళ్ళి చేయాలనీ మొదటి నుంచీ అనుకున్నదే! నువ్వేమో చెప్పోపెట్టకుండా దేశాలు పుట్టుక పోయావు అయితేనేం మీ మావయ్యకీ నాకు నీ మీద సంపూర్ణ విశ్వాసం నువ్వు ఏనాటికైనా ప్రయోజకుడివై, మంచి ఉద్యోగం సంపాదించుకుని నలుగురిలో దర్జాగా తిరగ్గల హొదాతో వస్తానని అనుకుంటూ ఉన్నాను.
"ఈ రోజుల్లో ఆస్తులు శాశ్వతముకాదు. ఐశ్వర్యం అసలే కాదు. ఒక్క చదువూ, దాని వల్ల సంపాదించుకోన గలిగితే మంచి ఉద్యోగం యివి మాత్రమె మనకు భద్రతా. అందుకే కవితని గ్రాడ్యుయేట్ చేసి ఎక్కడైనా ఉద్యోగంలో ఇరికించాలని అనుకున్నాం. మేము అప్పుడు పనిచేసే ఊళ్ళో కాలేజిలేదు. అందుకే అంతదూరమైనామీ మామగారికి తెలిసిన వాళ్ళున్నారని వాళ్ళింట్లో విడిచి గుంటూరులో బి. ఎస్పీ లో చేర్పించాము."
