ఆ ధోరణికి నవ్వేసింది. సుజాత.
"మీకేం! మీరిక్కడ హాయిగా వున్నారు. నవ్వుతున్నారు. అక్కడనే చేసి వచ్చిన వెట్టిచాకీరి చూస్తె తెలుసోచ్చేది మీకు!"
"వెట్టి చాకిరీ ఎందుకవుతుంది. లేండి! ఎకస్ట్రా జీతం డ్రా చేశారుగా! ఆ డబ్బుతో హయిగా ఓ మాంచి టు __ యిన్ __ పన్ లేదా మోపెడ్ కోనేయచ్చు. ఆనందిచవచ్చు అంతకి రెండితలుగా __"
సీరియస్ గా చూశాడు "డబ్బోక్కట్టేనా మీరు లెక్కించేది. జీవితంలో యింకేది వుండదా విలువైం ది. అదే నిజమయితే చెప్పండి. మీకు బ్రాకెట్ లో రోజూ వెయ్యో రెండు వేలో సంపాదించి పెడతాను. సుఖపతారేమో __ చూద్దాం" ఛాలెంజ్ గ్ గా అన్నాడతను.
నివ్వెరపోయింది సుజాత!
ఆశ్చర్యంతో నోరు తెరచింది!
"అంతగా ఆశ్చర్యపోకండి! నోట్లోకి దోమలుపోతాయి __"
చప్పున నోరు మూసుకుంది.
"చెప్పండి, మీకు డబ్బే కావాలా?"
"సారీ !"
"నిజం సుజాతగారూ! నే చెప్పేది సెంట్ పర్సెంట్ నిజం! యస్! నన్ను నమ్మండి! ఒక వేయి మీవి కావనుకుని యిలా పారెసేయ్యండి . నెల తిరిగే సరికల్లా పదివేలు యిచ్చే స్తాను. అలా నెలనెలా తీసుకొండి. ఎన్నెల్లకయినా సరే! త్వరలోనే మీరో లక్షాధికారైపోతారు. కదూ బంగళా, హొదా అన్నీ వచ్చేస్తాయి __"
చిన్నపిల్లలకి విషయాలని భూతద్దంలో చూపించి నట్టుగా అతను చెబుతోంటే ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఇది నిజమా! అయితే "అంతా" లక్షాధికారులై పోవచ్చే! దేశంలో యిక బీదా బిక్కీ వుండటానికే వీల్లేదే!
"జవాబివ్వరేం సుజాతా! అంతా ఫోర్స్ అనుకుంటూన్నారా! రుజువు చేసి చూపుతాను. మీరు నమ్మి లక్షాధికారులై పొతే ఆ తర్వత మన స్టాఫ్ నంతా లక్షాదిపతులని చేసేస్తాను __"
"సారీ __ నా కంత ఆశలేదు బాబూ! నన్నొదిలేయ్యండి. ఆ లక్షలు మీరే సంపాదించండి. జూదం వ్యసనం నాకు లేదు. ఐహేటిట్ __"
"దట్స్ గుడ్ __ పదిలేయ్యండి! మిమ్మల్ని ఫోర్సు చెయ్యదు నాకూ జూదం అంటే గిట్టదు. అందుకే నేనింకా లక్షాదికారిని కాలేదు. మామూలుగా వున్నాను. మీరు ధన వంతులైపొతే చూడాలన్న కాక్షంతో అన్నారు. దట్సాల్ __ వదిలెయ్యండి విషయాన్ని __ అన్నట్టు మీ బేబీ ఎలావుంది.?"
సుజాత ముఖంలో రంగులు మారేయి.
అయినా క్షణంలో తనని తాను నిగ్రహించుకుని చిరునవ్వుతో అతని ముఖ లోకి సూటిగా చూసి "ఫిన్!" అంది.
"ఏం పేరు పెట్టారు !" చాలా కాజువల్ గా అడిగాడు.
"మల్లేశ్వరీ __"
"గుడ్ __ కృష్ణ శాస్రీ గారి భక్తులన్నమాట! మరి యీ మేఘమాలకి ఎ నాగరాజు రావాలో __" కొంటిగా చూస్తూ అన్నాడు.
అతని కళ్ళల్లో చిలిపితనం వెక్కిరించినట్టు కనిపించింది.
"యు ఆర్ హియర్" అంది రొండర్ధాలు వచ్చేట్టుగా .
"అమ్మా! నువ్వూ మాటకారివై పోయావే" అనుకున్నాడు.
అంతలో శాస్త్రీ ఆఫీసరుగారు ఫైలు తెమ్మంటున్నారని రావటంతో నాగరాజు తన సెక్షన్ కి వెళ్ళిపోయాడు.
అయితే ఆ సాయంకాలం ఆఫీసు వదలగానే సుజాత వెంటపడ్డాడు మళ్ళీ.
"హలో! నేను ఆ యింటికే __ అదే ఆ త్రీమాన్ సర్కస్ కి __ వస్తున్నారు. పదండి! బస్సులో ఎందుకు! చాలా రద్దీ వుంటుంది. ఆలస్యం అవుతుంది. ఆటోలో వెళ్ళిపోదాం __" అంటూ ఆటోని కేకెయ్యబోయాడు నాగరాజు.
నా పర్స లో యీనాటి ఖర్చుగా బస టికెట్ కి యాభయ్ పైసలున్నాయి! అంతే!" అతన్ని వారిస్తూ నవ్వుతూ అంది సుజాత.
"డబ్బుకిఅలోచిస్తున్నారా! వాటేషేమ్! నగరాజంతటి మనిషి మీ పక్కన నుంచుని వుండగా మీతో డబ్బులు ఖర్చు పెట్టనిస్తడా పదండి. ఆటోలో వెళదాం!"
"వద్దులేండి! నేను అలా యితర్ల డబ్బుతో సుఖాల్ని కొనుక్కోను __" కఠినంగా అందామె.
తెల్లబోయాడు నాగరాజు.
"ఎంత! ఇంకో నిమిషానికో అరనిమిషాకో బస్ వచ్చేస్తుంది!" అని ఆమె అంటూ వుండగానే బస్ వచ్చేసింది.
"అదిగో బస్ వచ్చేసింది!" అని మరోమాటకి తావివ్వకుండా బస్సు ఎక్కేసింది. అతనూ ఆమె వెంటే బస్ ఎక్కేడు. అతని మనస్సులో ఎన్ని ఆలోచనలు దోర్లుతున్నాయో.
బస్టాపులో దిగాక ఆమె వెంటే నడిచాడు.
అయితే సుజాత మళ్ళీ మాటలు కలపలేదు.
గేటు ముందుకీ రాగానే "మీరు రిప్రేష్ కండి. నేను మా అక్కయ్యని పలుకరించి వస్తాను." అంటూ అతను జానికమ్మగారి యింటి వైపు కదిలేడు__
"నస" అనుకుంది సుజాత.
* * * *
ఓ రోజు సాయంకాలం __
అయిదు గంటల వేళ __
గాలి చల్ల చల్లగా వీస్తుంది. ఆఫీసుల్లో అలసిన వాళ్ళు. అలవని వాళ్ళూ అంతా "నిర్భంధం" లోంచి బయటపడ్డట్టుగ బయటపడుతున్నారు. పనిలేని వాళ్ళూ పనివున్న వాళ్ళూ ఆవేళకి సూర్యుడు చల్లబడటంతో ఇళ్ళ నుంచి బయటపడుతున్నారు.
ఆ సమయంలో రాజు పార్కు కౌంపౌండ్ అనుకుని ఓ కొత్త వ్యక్తితో ఏదో విషయం గురించి మాటాడుతున్నాడు
ఇద్దరి ముఖాలూ సీరియస్ గా వున్నాయి.
అయినా అనుకున్న పనిని సాదించామన్నట్టుగా వాళ్ళ ముఖాల్లో తృప్తికూడా బాగా కనిపిస్తోంది.
"అంతా మనం అనుకున్నట్లుగానే జరిగింది"
అవునన్నట్టుగా తలూపేడతను.
"మన రెండుత్తరాలూ బ్రహ్మాండంగా పనిచేశాయి."
"కానీ చాలా దారుణం " అతని ముఖంలో కొంత విచారం కొట్టచ్చినట్టుగా కనిపించింది. అది జాలివల్లకలిగింది.
