"కార్యాసాధనలో అలాంటివి తప్పవు కదా! సర్వం తెలిసిన యోగిశ్వరుడు జవాబిచ్చినట్టుగా చిద్విలాసంగా నవ్వుతో అన్నాడు రాజు.
"అయినా సుజాతకి యీ నిజం యీ విషయం __ తెలిస్తే అసహ్యంచుకుంటుంది. అవునా?
అవునన్నట్టుగా తలూపెడతను
"మనం ఇక కార్యరంగంలో దూకాలి"
"అలాగే! సమయం దగ్గర పడుతోంది"
"స్పీడఫ్ చేద్దాం! ఇప్పుడు యిటునుంచి నరుక్కోచచ్చాం! ఇక అటునుంచి నరుక్కురావాలి! అప్పుడే సుజాత మనస్సుకి తృప్తి __ శాంతి ఆమె జీవితంపాడవకూడదు . చదరంగంలో పావులాగా ఆమె ఉపయోగపడింది. కొన్నాళ్ళాపాటు మానసికంగా ఎంతో దుఃఖాన్ని భరించింది, కానీ మనం అందుకు తగినట్టుగా ఆమె మనస్సు సంతోషపడేట్టు చేయాలి __
అతను నాగారాజూ మాటలకి నవ్వేడు. అదోలా చూశాడు "నీలో దయాగుణం వుందంటే ఎవరు నమ్ముతారు పాము కాటేస్తుందే తప్ప కాచి రక్షించి పాలిస్తుందని చెబితే నవ్వుతారు అలా జరిగిందంటే ఎవరయినా నమ్ముతారా? అలా జరుగుతుందని ఎవరయినా అనుకుంటారా?" అన్నాడు.
ఆ మాటలకి నవ్వేడు నాగరాజు. యస్! నా పేరూ నాగుబాబు అనే అర్దాన్నిస్తుంది. కదూ! నీ వన్నమాట నిజమేలే! ఇదంతా చేసిన వాడిని ఎవరి మేలు కోరుతున్నానన్నా ఎవరూ నమ్మురు" అన్నాడు.
"రేపు జానికమ్మగారిని కలిస్తాను. ఆమెని మనవైపు మనిషిగా చేసుకోవాలి"
"ఆమె ఎలాగూ మన మనిషే!"
"అవుననుకో అయినా ముందుగా మన ప్లానేమిటో చెప్పుకోవాలి కదా!"
"ఊం అయితే సుజాత ఆఫీసుకి బయల్దేరేక వెళ్ళు __ అసలే జనికమ్మగారిది జాలిగుండె. పైగా ఆమె మానసికంగా దెబ్బతింది. ఈ విషయం నెమ్మది నెమ్మదిగా చెప్పు. గాబరాపెట్టొద్దు షాకయినా కష్టమే. కోపంతో బర్ట్స అయినా కష్టమే. నలుగురూ పోగవుతారు. ఏమిటేమిటంటారు. వాళ్ళ సానుభూతి అంతా అటే వుంటుంది. మనల్ని నాలుగు తననేస్తారు అంతే! మనం ఇన్నాళ్ళుగా యింత పకడ్భందిగా అల్లుకుంటూ వస్తొన్న ప్లానంతా సగంలో చేడిపోయి దెబ్బ తినేస్తుంది. మళ్ళీ అంతా తిరగతో డాలన్నా, పునర్మించాలన్నా చాలా కష్టం__"
"అలా జరగుదులే!" భరోసాగా అన్నట్టుగ నవ్వేడు. "కధ యింటర్వల్ లోకి వచ్చేసింది. మెలమెల్లగా క్లయిమాక్స్ ఎక్కిస్తాను. తమాషా చూద్దాం. ఆఖరికి విజయం మందే అందాం. కొట్టుకునే వాళ్ళు కొట్టుకున్నా, కోపగించుకునే వాళ్ళు కోపగించుకున్నా, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా మనం మాత్రం సేఫ్__"
"దట్స్ గుడ్ __ బై_"
"భై! భై!" అన్నాడు నవ్వుతో .
ఆ వ్యక్తి కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ వుండిపోయాడు నాగరాజు. గుండెల్లోంచి తన్నుకుంటూ వస్తోన్న వేడి నిట్టూర్పుని బలవంతంగా అపేడు.
అతనటు వెళ్ళిపోగానే నాగరాజు జానికమ్మగారి యింటికి మరలేడు.
* * * *
అతనల్లంత దూరంలో వుండగానే సవిత చూసింది. ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు మొలకెత్తింది.
"అమ్మా! గడ్డ పెరుగు మామయ్యేచ్చారు" అంది తన మామూలు ధోరణిలో.
నాగరాజుకీ నవ్వొచ్చింది. అతను మనుషుల్లోని సెన్సాఫ్ హ్యూమర్ బాగా గుర్తించగలడు.
"నమస్కారం బావగారూ!" అన్నాడు రాఘవయ్య గారిని చూస్తూనే.
"రావోయ్ రా! ఎలా వున్నావ్! కులాసానా? స్వంత బామ్మరుదులు దూరమైనా వేలు విడిచిన బావమరిదిని నువ్వే వేలు __ వారానికో సారయినా బావా అంటూ వస్తున్నావు. కబుర్లు చెబుతావు. యోగక్షేమాలు విచారిస్తావు. అదెంతకాదు" అన్నాడు అదో ధోరణీగా.
ఆ మాటలకి నవ్వేడు నాగరాజు.
అంతలో జానికమ్మగారు రయ్ మంటూ వచ్చింది ఫీల్డులోకి. ఆమెకి తన తమ్ముళ్ళని ఆయనలా అనటం బొత్తిగా గిట్టదు. "సొంత బామ్మర్దులు ఏం చేశారు మీకు? పేట్టి పూజించడానికి వాళ్ళకే లేదు యిహ మీకేం పెడతారు? దగ్గర్లో వుంటే ఏం కరచుక వస్తుందోనని మీరే యింత దూరం వచ్చేశారు!" అంది.
జానికమ్మగారు కోప్పడితే రాఘవయ్యగారికి ఒళ్ళు తెలియని ఆనందం. అయిన ఆ ఆనందాన్ని పెదాల్ని దాటి బయటకి ఎన్నడూ రానివ్వరు.
"పెట్టు పోతాలు ఎవరడి రోయ్! పలకరింపూ, ప్రేమా, ఆప్యాయతా బొత్తిగా మీ యింటా వంటా లేవంటున్నాను, అంతే!"
మనమెంతో అవతలి వాళ్ళూ అంత __ మనలో వున్నాయా ఆ అప్యాతలూ అనురాగాలూ _" దేప్పిందామె.
"నేను మాటాడవా వాళ్ళోస్తే __ ఏదీ వాళ్ళోచ్చిందెప్పుడు?"
"మనం ఎనాదయినా పిలిచినా పాపాన పోతేనా?"
"బావుందోయ్ ఇది? ఇంటిల్లడిని నన్ను వాళ్ళూ పిలిచి గౌరవించాలా? వాళ్ళని నేను పిలిచి సత్కారించాలా? ఇదెక్కడి న్యాయం ?" నవ్వుతూనేఅన్నారాయన.
ఆ మాటలకి జానికమ్మగారు ఉడుక్కున్నారు. "మీరన్నట్టు పెట్టుపోతలు గౌరవమర్యాదులు అన్నీ మామగారంటూ వుంటేనే __ చిన్న పిల్లలు వాళ్ళు, వాళ్ళకేం తెలుసు. తప్పు తాకూ తెలియని వయసు మారే పిలిచి వాళ్ళ బాగోగులు చూడాలి!" తప్పంతా ఆయనదే అన్నట్టుగా అందామె.
"సరే! సరే!" ఇంకేం అన్లేదు అయన.
"అక్కయ్యా!" నెమ్మదిగా పిలిచాడు నాగరాజు. అతనికి వాళ్ళిద్దరూ అలా చెడుగుడు అడినట్టుగా ఎఫెండవ కుండా మాటలు విసురుకుంటూ వుంటే భలే సరదాగా వుంటుంది. కానీ __ అతనికి యిప్పుడు యమ ఆకలిగా వుంది "అక్కయ్యా! మీ వాదలన్నీ సరేగానీ నాకు ఆకలి దంచేస్తోంది. వంట ఏంచేశావు?" అన్నాడు.
"గడ్డ పెరుగు ఆవకాయ" వెక్కిరించింది సవిత.
నవ్వొచ్చింది రాజుకి.
"ఏయ్" తమాషాగా కోపగించుకుంటూ చెయ్యేత్తేడు రాజు. మేనకోడలి తమాషా అతనికి గిలిగింతలూ వుంటుంది.
ఫక్కున నవ్వి పరిగెత్తింది సవిత.
