అలాటి తండ్రికి సంజాయిషీ యిచ్చుకొనక్కర్లేదని పించింది. అందుకే ఆయన్ని ప్రయత్నం చేయలేదు. నిర్లిప్తంగా చూస్తుండి పోయింది.
జానికమ్మగారు కూడా నివ్వెరపోయి చూస్తోంది.
"పిన్నీ !" బేలగా పిలిచింది సుజాత. ఆ పిలుపుకి ఆమె కరిగిపోయి ఆప్యాయత వర్షించింది. కనులతోటే.
"పిన్నీ! నువ్వయినా నన్ను నమ్ము. ఎ నాటికో యీ మిష్టరీ విడిపోతుంది. అపుడు నా నిర్దోషిత్వం రుజువవుతుంది. అప్పటికి నేను అందరికీ దూరమై పోవచ్చు. కానీ నా నిజాయితీ నిష్కల్మషత్వం మీ కయినా తెలుస్తాయి __" అంది బేలగా.
"పిచ్చితల్లీ! కాలమే అన్నింటినీ పరిష్కరిస్తుంది. నువ్వేం దిగులు పడకు" ఓదార్పుగా ప్రేమగా తలనిమురుతూ అంది జానికమ్మగారు. కన్న తల్లి ప్రేమ వాత్సల్యం ఆప్యాయత కనిపించాయి ఆ ఓదార్పులో ఆమె ఒడిలో పసిబిడ్డలా ఒదిగి పోయింది సుజాత.
* * * *
మనస్సంతా జడమయమైపోయింది.
ఎందులోనూ ఉత్సాహం లేదు. ఎందులోనూ యింటరెస్ట్ లేదు. నిర్లిప్తంగా ఒక బాధ్యతలాగ ఒక డ్యూటీలాగా నిరుత్సాహంగా జీవితం గడుస్తోంది.
ఆఫీసుకి యధాప్రకారంగా వెళ్ళి వస్తోంది సుజాత. అక్కడ ఎ విధమైన థ్రిల్ లేదు.
ఇంట్లో కాలక్షేపమల్లా పాపే! సిరిమల్లితో ఆడుకుంటూ వుంటే లోకం తెలియదు. కాలం తెలియదు బాధలు తెలియవు. బరువులు తెలియవు మనస్సులోని క్షోభగుర్తురాదు. పడిన అవమానాలు గుర్తుకి రావు.
ఆఫీసులో సుధాకర్ అంటీ అంటకుండా ప్రవర్తిస్తోన్నాడు. ఆఫీసు వ్యవహారానికి సంబందించినంతవరకు ఎంత మాటాడాలో అంతే మాటాడుతున్నాడు. ఒక అపరిచిత వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తింస్తున్నాడు.
అతన్లో మునపటి అత్మీయుత, ఆ చిలిపితనం మచ్చు కయినాలేవు. పరమ గంభీరంగా వుంటున్నాడు. స్టేటస్ ని ప్రదర్శిస్తున్నాడు.
అయితే సుజాత కూడా దానికి తగ్గట్టే మెలుగుతోంది.
అయితే ఆమెకి అర్ధం కానిడల్లా మనుషులు యింత త్వరగా యింత ఘోరంగా ఎలా మారిపోతారా అనేదే! ఆమెకి సుధాకర్ ని చూస్తే ఒక్కోసారి విపరీతమైన జాలి, మరోసారి విపరీతమైన కోపం కలుగుతున్నాయి. కానీ అతనంటే అసహ్యం కలగటం లేదు. కన్న తండ్రే అలా ప్రవర్తించదు ఇతనేంత! మగవాళ్ళంతా యింతే కాబోలు అనుకుంది.
అంతలో అతనికి పై ఆఫీసులో ట్రెయినింగ్ అయ్యేందుకు అర్దర్సు ప్రమోషన్ వచ్చిన ప్రతి వ్యక్తికీ ఆట్రయినింగ్ తప్పదు.
ఆరువారాల ట్రెయినింగ్ వెళ్ళిపోయాడు సుధాకర్. వెళ్ళే ముందు కానీ, వెళ్ళేరోజు కానీ, ఆఖరి సమయంలో వెళ్ళిపోయేటప్పుడు కానీ అతను తనతో ఏదైనా మాటాడతాడేమోనని ఎదురు చూసింది సుజాత అది ఆమెలోని ఆఖరి బలహీనత. ఎంతటి క్రూరత్వాన్నయినా క్షమించాగలిగే స్త్రీత్వంలో స్త్రీ జాతిలోని గోప్పగుణం అది.
కానీ సుధాకర్ లో ఆ ఆరాటం లేదు. సుజాత నిరాశపడలేదు. ఒక విధమైన శాంతితో నిట్టూర్చింది. ఆమెకి ఆ నిప్పుల సుడిగుండం నుంచి కాస్త తెరిపిన పడ్డట్టయింది.
నిజానికి సుజాత మనస్సులో ఎ మూలనో కూడా ఏ కొద్ది మాత్రమయినా ప్రేమ అనేది మామూలుగా మేలగాలంటే ఎబ్బెట్టుగా వుంది.
అతను మనస్సు మార్చుకునో, సుజాత మాటలు సమ్మో మరోవిధంగా ప్రవర్తించి వుంటే ఏమయ్యేదో కానీ అతనిలో ఆ చలనం లేకపోవటం ఆమెకి పెద్ద గడిచినట్టు అనిపించింది.
ఓ అపరిచితుడిలో లాగా ప్రవర్తించాలంటే ఆమెకి చేతనంలేదు ఇరుకున పడ్డట్టున్న ఆ పరిస్థితుల్లో అతని డెప్యుటేషన్ ఆమెకి పెద్ద రిలీఫ్ అనిపించింది.
కొన్నాళ్ళు అలా అతను వెళ్ళొస్తే __ యీలోగా కాలం ఏదయినా తీర్పు చెబితే __ యీ ఎబ్బెరికం పోతుంది. అనిపించింది. పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుంది, మళ్ళీ వచ్చేసరికి అన్నీ చక్కబడ్డట్టుఅవుతాయి అనుకుంది.
ఈ సంవత్సర కాలంలోనూ గడిచినదంతా ఒక కలలాగా అనిపించింది ఆమెకి. అందులోనూ మంచీ చెడూ కళలు రెండూ కలగలుపుగా వచ్చినట్లయింది.
సుధాకర్ వెళ్ళిపోయిన వారం రోజులకి మరో ఆఫీసుకి డేప్యుటేషన్ పై వెళ్ళిన నాగరాజు తిరిగొచ్చాడు.
అతనికి ఆఫీసంతా కొత్తగా అనిపించింది. పరిస్థితులన్నీ ఒక్కసారిగా అతనికి అనుకూలంగా మారిపోయినట్లు అనిపించింది.
సుధాకర్ సీటు ఖాళీగా వుండటం అతనికో శుభశకనం లాగా అనిపించింది తన ట్రయల్స్ తనే బెస్ట్ విషేన్ చెప్పుకున్నాడు సంతోషంతో.
ఒంటరిగా, దెబ్బతిన్న లేడీలా వున్న సుజాతని చూడగానే అతని మనస్సు రెపరెప లాడింది. ఇన్నిరోజులూ ఆమెని చూడకుండా గడిపిన కాలమంతా నిరీక్షనగా అనిపించింది.
ఇన్నాళ్ళ వియోగాన్ని __ విరహంగా మార్పుకోవాలనిపించింది. ఒక్క అదాటున వెళ్ళి ఆమెని ప్రేమగా అప్యాయంగా పలుకరించి, ఆమె ఓంతరితనాన్ని దూరం చేయాలనిపించింది. ఆమె మనస్సుకి తగిలిన గాయం __ అలాటి దేదయినా వుంటే __ దాన్ని బాగు చేసెయ్యలన్నంత ఉత్సాహం వచ్చింది.
"హలో బాగున్నారా?"
ఆమె సీటు వద్దకి వచ్చి టేబిల్ పై వంగి చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించాడు. ఆ పలకరింపులు ఎంతో ఆత్మీయత ఎంతో ఆప్యాయత తొంగి చూసింది.
"ఫైన్ ! మీరెలా వున్నారు? ఆ వూళ్ళో ఎలా గడిపారు. కులాసాగా గడచిపోయిందా!" తనూ నవ్వుతోనే జవాబిచ్చి, తిరిగి ప్రశ్నించింది
"బోర్! యమాబోర్ _ ఎంత వర్క్ పెండింగ్ వుండినదని వాడెవడో సెలవు పేట్టి వెళ్ళాడు కదా! అంతకు ముందు రెండు మూడు నెలలు బొత్తిగా పేపర్స్ ముఖం చూసినట్టే లేదు. మరి ఆఫీసరు ఎలా వూరుకుని వున్నదో ఏమో! ఆ వర్కంతా నా నెత్తిన రుద్దేడు ఆఫీసరు. ఏం చేస్తాను లాగించేశాను. చూడండి సుజాతా! ఇంత చేసీ ఆ ఫైల్సన్నీ యమ అర్జంటుని! మరి వాటినెలా పేండింగ్ లో పెట్టేడో ఆ మహానుభావుడు"
