"ఈ పిల్ల తండ్రి ఎవరు? ఎక్కాడున్నాడో చెప్పు __"
సుజాత శిలా ప్రతిమిలా నుంచిని _ ఆ మాటలన్నీ తనని కాకా యింకేవర్నో నిందిస్తో అంటున్నట్లుగా వింటుంది. సమాధానం చెప్పలేదు.
"పలక వేమే మొద్దూ! చెప్పు! ఆతగాడేవడో చెప్పు! నే వెళ్ళి కళ్ళావెళ్ళాపడి లేదా బెదరించో బ్రతిమాలో తెచ్చిఆ మూడు మూళ్ళూ వేయిస్తాను," అన్నాడు గట్టిగా.
కేకలు వేసినట్టుగా అయన మాటాడుతోన్న ధోరణికి నవ్వొచ్చింది సుజాతకి. పకపక నవ్వింది సుజాత. నవ్వి నవ్వి ఒక క్షణం ఆగి " అన్యాయం నాన్నా!" అంది మృదువుగా.
"అది అన్యాయామా?"
"అది కాదు నాన్న అన్యాయం! నువ్వూ అందరిలాగా అనటం అన్యాయం అంటున్నాను. లోకం వేరు నాన్నా! కానీ కన్నతండ్రిని నువ్వు అలా అనటం ఘోరం నాన్నా!
అందరూ యీ అరునేల్లూ సెలవు పేట్టి యీ బిడ్డని కానివచ్చానుననుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకోవటానికి నా సెలవు ఒక కారణంగా కనిపిస్తోంది! కానీ నాన్నా! నీకు తెలియదా ఎందుకు యిన్నేల్లు సెలవు పెట్టావో! నువ్వూ అలాగే మాటాడాతావేం?
ఆ పిల్ల తండ్రి ఎవరో నాకు తెలియదు.
నువ్వు వింటానంటే ఏం జరిగిందో చెబుతాను __
చప్పున లేచారాయన.
"ఇహా ఏమీ చెప్పద్దు నువ్వు మరీ యింత దుస్థితిలో వున్నావనుకోలేదు __
కనీసం నీతో కాపురం చేసి ఆ బిడ్డకి తండ్రి అయిందేవరో కూడా తెలియనంత నీచంగా ప్రవర్తించావంటే నువ్వెంత విచ్చలవిడిగా ప్రవర్తించావో తెలుస్తోంది. చాలు నీ బుద్ధీ తెలిసిపోయింది. ఇంత నీచురాలు నా కూతురును కోవటం __నా కూతురుగా చెప్పుకోవటం నాకు అవమానం.
నీకు నా గుణం ఒక్కటీ రాలేదు _
అన్నీ ఆ దౌర్భాగ్యురాలి లక్షణాలే వచ్చాయి _
ఇక నీ గతి నీది __ నీ దారి నువ్వే వేగు __ వస్తా_"
అయన ప్రవర్తన చూసి "ఏమండీ!" అంటూ గాబరాగా పిలించింది జానికమ్మ.
వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయాడాయన . జానికమ్మ గారి వేపు చులకనగా చూశాడు. "ఇందులో నీ పాత్ర, నీ ప్రమేయం కూడా చాలా వున్నట్టుగా వుందే!" అన్న భావం కనిపించింది.
జానికమ్మగారు నిర్భయంగా ప్రశ్నించారు. "మీ కన్న కూతురిని మీరే మన్నించకపొతే ఎలా? అసలు ఆడపుట్టకే హీనం. మీరే మన్నించకపొతే ఎలా? అసలు అడపుట్టకే హీనం. ఏది జరిగినా యిలా అయిపోతాయి. మా బ్రతుకులు. అది మాకు ప్రకృతి విధించిన శాపం. సంఘం విధించే శిక్ష,. సమాజం చెప్పే తీర్పు ... కానీ కానీ బాగా ఆలోచించకండి__
మగవాడూ ఆడదీ కలిసే తప్పుచేసినా ఆ ఫలితం మేమే అనుభవించాలి! అది ప్రకృతి తనకి తాను విధించుకున్న శాపం!
అమ్మాయి తెలిసో తెలియకో తప్పు చేసింది. ఆమె ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేసింది, ఆ తప్పుకి బాధ్యులెవరు అన్నది కాదు యిప్పటి సమస్య.
ఆ తప్పుని కన్నతండ్రియిన మీరే క్షమించలేకపోతె ఎలా? ఆ తప్పుని మీరు గొప్ప మనసుతో క్షమించాలి.
తప్పు చేయటం మానవ సహజం. ఆ తప్పుని క్షమిచ్మ్హి జీవితాన్ని చక్కదిద్దటమే దైవత్యం ! అదీ మీలాటి పెద్దలు గ్రహించవలసింది. మీరూ యువకుల్లాగా ఆవేశపడితే ఎలా!
బాగా ఆలోచించండి!
దగా పడిన __ లేదా తప్పు చేసిన ప్రతి స్త్రీ చరిత్ర వెనుకాఓ కుర్రమైనా మగవాడి హస్తం వుంటుంది. ప్రేమించో, ప్రేమిస్తున్నట్టు నటించో, కాక్షించో, సున్నితమైనా స్త్రీ హృదయాన్ని కదిలించి, రగిలించి ఆతర్వాత ఆమెని ఆమె కర్మకి వదిలేసి వెళతాడు మగవాడు__
భూమాతలుగా క్షమామూర్తి అయిన స్త్రీ ఆ మగ వాడిని, సంతతినీ మాత్రమె కాదండీ __ యీ మగజాతినే క్షమిస్తుంది. తన బలహీనతకి తనని తాను నిందించుకుంటుంది.
అందుకే ఎప్పుడూ స్త్రీల జీవితాలు చర్విత చర్వణాలే అవుతాయి. ఎ యువతీ మరో యువతి కధవిని తన కధని మలచుకొదు. తనంతకి తను హీరోయిన్ గా తన కథ అదో విధమైన ప్రత్యెక మయినదిగ భావించి తన జీవితాన్ని తాను నాశనం చేసుకుంటుంది"
ఒక్కక్షణం జానికమ్మగారి వైపు చూశాడు సీతారామారావు అయిన గుండెలో దేనినట్టయింది. తను చూసిన, తనకి తెలిసిన ఎందరో పటితలు, భ్రష్టులు ఆ క్షణంలో అయన కళ్ళముందు మెదలినట్టయింది.
కానీ ఆయనలో జాలిపోడచూపలేదు.
మనస్సులో కఠినత్వం యింకా ముళ్ళు వేసుకుంది.
"అమ్మా! మీకూ తెలియదు ణా యిబ్బంది. ఈ పిల్ల ఎవరో యిమ్తవరకూ ణా భార్యకు సరిగ్గా తెలియదు. అదో విచిత్రమైన సంబంధం మాది. మా బంధువులకీ యీ సుజాత ఎవరో తెలియదు. . అసలు మ వూళ్ళో వాల్లెవ్వరికీ యీ సుజాత ఎవరో తెలియదు. అసలు మా ఊళ్ళో వాళ్ళేవ్వరికి యీమే నా కూతురిని తెలియదు.
శంమంతమణిని నేను ప్రేమించాను. ఆ ప్రేమించిన నేరానికి ఆమెని పెళ్ళి చేసున్నాను ఆఘోరమైన తప్పుకి పరిహారంగా యీమెని పెంచి యింతదాన్ని చేశాను. నిజానికి సుజాతని పెంచి పెద్ద చేశానంటే అది యీమేపై ప్రేమాభిమానాలతో కాదు __ ఆ శంతకమణిపై వున్న ప్రేమతో పెంచాను.
ఎలాగో పెంచాను, పెద్ద చేశాను . బుద్ధిగా మెలిగి చక్కగా పెళ్ళి చేస్తే యీ అధ్యాయం ముగిసి యీ భారం తీరిపోతూ దనుకున్నాను.
కానీ యింత శ్రమా బూడిదలోపోసిన పన్నీరై పోయింది ఇదీ దాని తల్లి లాగే చెడిపోయింది. ఇక్కడికే పోతాయి కన్నతల్లి బుధులు __ ఛీ ! ఛీ!"
మరో మాటకి తావివ్వకుండా చక చకా వెళ్ళిపోయాఅనిపించింది.
అయన ముఖంలో ఆ క్షణంలో కనిపించిన కోపం అసహ్యం చూశాక ఆ క్షణంలోనే అక్కడికక్కడే చనిపోవాలనిపించిందామెకి.
ఎక్కడ చూసినా దగా, మోసం పాలనచేస్తున్నట్టుగా అనిపించింది. కన్నతండ్రి లోకాన్ని మోసం చేశాడు. ఇన్నేళ్ళు తననీ మోసం చేశాడు __ ట! లోకానికి తానెవరో తెలీకుండా జాగ్రత్త పడ్డారు __ ఎంతదగా!
