Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 24

    పాపం!
    ఇదిప్రేమా?
    ఇదే ప్రేమయితే ప్రేమ యీ రోజుల్లో అడుగడుగునా "కనిపిస్తోంది. కాస్త అందచందాలున్న ఏ అమ్మాయిని చూసినా ప్రతి యువకుడిలోనూ యీ ప్రేమ పుట్టుకోస్తోంది!" అనుకుంది.
    అంతలో బస్సు వచ్చేసింది.
    అది దిగీ ఆగగనే ఎక్కేసింది నేరుగా యింటికి వచ్చింది. ఇంటికి రాగానే తలారా స్నానం చేసింది. ఆ వేళప్పుడు.
    భారమంతా దిగిపోయినట్టుగా శరీరమూ మనస్సు తేలికపడింది.
    "ఇదిగావునమ్మా తల్లీ! ఈ రోజు ఎందుకో ఒకటే ఏడ్పు. ఎవరి దృష్టి సోకిందో ఏమో! చేతుల్లో నివటంలేదు. పాలుపట్టినా నిద్రపోలేదు, ఒకటే పోరు__"
    జానికమ్మగారు వస్తూనే అందించింది మల్లేశ్వరీని.
    మల్లీశ్వరి సుజాత చేతుల్లోకి రాగానే చిత్రంగా నవ్వి కేరింతలు కొట్టింది, ఏడ్పు మానేసింది.
    ఆ పిల్ల పలకరింపుగా నవ్వుతో, త్రుళ్ళి త్రుళ్ళి కేరింతలు కొడుతూ ఆపుకోలేక గాఢ౦గా ముద్దుపెట్టుకుంది.సుజాత.
    అది చూసిన జానికమ్మగారి ముఖం కళ కళ లాడింది. ఆమె ఫక్కున నవ్వేసింది.
    "ఈ పూటకి మల్లిని వుంచుకోతల్లీ !" అంది.
    పాపని చేతుల్లోంచి ఎగరేసి పట్టుకుంది.
    మల్లేశ్వరి కేరింతలు కొట్టింది.
    ఉదయం నుంచీ జరిగిన మనస్సులోని సంఘర్షణ అంతా ఆ పాప స్పర్శకి, అపాప నవ్వుకి , కేరింతలకి జ్వరం దిగిపోయినట్టు మనస్సులోంచి మాయమైపోయింది.
    "అలాగే పిన్నీ!" అంది.
    మళ్ళీ ఒక క్షణం ఆగి "ఇక నుంచి మల్లి రాత్రిళ్ళు నావద్దే పడుకుంటుందిలే పిన్నీ! నీకు కష్టమని కాదు. నాకూ ఎలాగో వుంది. కాస్త తోడుగా కాలక్షేపంగా వుంటుంది!" అంది.
    "నిక్షేపంగా వుంచుకో తల్లీ! నేను కాదంటానా! కానీ అలా నువ్వు అలవాటు చేతే ఆఫీసుకి వెళ్ళినపుడు యీ పిల్లని పట్టుకోవటం కష్ట మవుతుంది. మాలిమి తప్పితే పిల్లలు దూరమై పోతారు. అందుచేత రాత్రు పదిగంటలకు వచ్చి తీసికేళతాలే! ఆ తర్వాత నువ్వయినా నిద్రపోతావు. మల్లేశ్వరీ నిద్రపోతూ వుంటుంది" అంది జానికమ్మ.
    "అలాగే పిన్నిగారూ! నిజమే _ మీరు చెప్పినట్టు పాప నాకే అలవాటు పడితే కష్టం!" అంది సుజాత.
    "వస్తానమ్మా ! ఏమే చంకనెక్కి కేరింతలు కొడుతున్నావా! ఉదయం నించీ నా వద్ద ఏం తక్కువై౦దే భడవా! సుజాత చేతుల్లోకి రాగానే నవ్వుతున్నావా" పాప బుగ్గలు సులిమింది జానికమ్మగారు.
    మల్లేశ్వరి మళ్ళీ కేరింతలు కొట్టింది.
    జానికమ్మగారు గడప దాటబోయాడు.
    అంతలో సుజాత తండ్రి సీతరామరావుగారు వచ్చారు. ప్రయాణం చేసిన అలసటవల్లో __ మరెందువల్లో అయన ముఖంలో ప్రశాంతతలేదు.
    "నమస్కారమండీ! ఇప్పుడేనా రావటం! అంతా బావున్నారా? మీ ఆవిడకి ఎలా వుంది?" అంది జానికమ్మ  గారు పలకరింపుగా.
    "ఈ ట్రెయిన్ కి వచ్చారా నాన్నగారూ?"
    "ఊం" అని సమాధానం యిచ్చరాయన ముఖావంగా,
    "లోపలి రండి నాన్నా! కాళ్ళు కడుక్కుందురు గానీ అలా కూర్చోండి ఏమిటలా వున్నారు? బాగా అలసిపోయారు. పిన్నీ! కాస్తాగు . దీన్ని పట్టుకో __ నాన్నకి కాఫీ కాచి యిస్తాను!" అంటూ మల్లీశ్వరిని జనికమ్మగారికి అందివ్వబోయింది సుజాత.
    "సుజాత! నాకు యిప్పుడు కాఫీగీఫి అక్కర్లేదు. కాళ్ళు కడుక్కోవటం అదీ ఏమీ వద్దు నాకేం అలసటగా లేదు. బాగానే వున్నాను!"
    "నాన్నా!" ఆయనలా కఠినంగా అనేసరికి తెల్లబోయిందామె.
    "సుజాతా! ఆ పాప ఎవరు?
    ఆ ప్రశ్నకి యిద్దరూ తెల్లపోయారు.
    జనికమ్మగారు అంతా అయోమయంగా అనిపించింది.
    "నాన్నా!"
    నిజం చెప్పు! ఎవడా దుర్మార్గుడు? ఎవరికీ కన్నా వీ బిడ్డని దుర్మార్గ్టురాలా! ఎంతకు తెగించావే! పెళ్ళి కాకుండానే తల్లి వయ్యావా! ఇంత ఆప్రతిష్ట ఎంత అవమానం ! ఛీ ఛీ!"
    "నాన్నా! అంతకుమైక్మ్హి అమెనోట మాటరాలేదు.
    ఆమె మనస్సు శిల అయిపోయింది.
    ప్రేమగా పెంచిన తండ్రి యిలా కఠినంగా నిర్దాక్షిణ్యంగా శిలవేసినట్టుగా నిలేసి అడుగుతూ వుంటే ఆమె మొద్దుబారిపోయింది.
    హూం నాన్న! ఇంకా గుర్తున్నాడా నీకు? అనాన్నే నీకు గుర్తుంటే యిలా ప్రవర్తిస్తావా?"
    ఆ కఠిన వాక్కులకి ఆమె నిర్విణురాలైపోయింది.
    "నీ తల్లినుంచి నీకు రూపం మాత్రమే వచ్చినందనకున్నాను గుణమూ వచ్చింది.
    అదీ నీలాగే ప్రవర్తించింది.
    పుట్టినకులం నీచమే అయినా చదువుకున్నది సంస్కారం అలవర్చుకున్నది కదా అని దాని గుణం తెలియక చేరువయ్యాను.
    అ చేరువ స్నేహామై ఏకమయ్యేట్టుగా చేసింది.
     పెళ్ళికకాముందే తల్లి అయింది.
     నా తొందరపాటుకి ఫలితం అనుకుని పెళ్ళిచేసుకున్నాను.
    మరి __ తనలో తన జన్మలో _ తన జీవితంలో ఏరహస్యం యిమిడి వున్నదో నిన్ను __ నెలలయినా పూర్తిగా నిండని పసిపిల్లని భయమో ఏదో వుండింది. నీక వేవీ లేవు.
    నీ మర్యాద మంట కలిసింది ఎలాగూ.
    నా మర్యాదుకూడా మట్టిలో పాతేశావుకదే!
    చెప్పు!
    ఎవడువాడు?  ఆ దుర్మార్గుడు ఎవడు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS