అతని మాటలని మధ్యలోనే తుంచేసింది.
"అది తప్పా! నిన్ను ప్రేమించటం తప్పయిపోయిందా? మనమధ్య ఆకర్షణ ప్రేమగా పరిణితి చెందటం తప్పా? ఇవన్నీ నీ దృష్టిలో తప్పులయిపోయాయి _ కానీ నన్ను ఘోరంగా అనుమానించడం నీ దృష్టిలో తప్పేకాదు __ అవమానించటం అంతకంటే తప్పుకాదు __ ఓహొహొ! ఏం మగవాళ్ళు! ఏం నీతి!"
ఆమె వ్యంగ్యం నసాళానికి అంటింది. "అవును మగవాడినే! అందుకే మీ ఆడవారి చేతిలోదగా పడ్డాను__"
"ఏం మోసపోయావ్ ! నువ్వేం నష్టపోయావ్?"
"ఇంకా ఆమాట అడుగుతున్నావా? రోషంగా అడిగింది. ఆమె కళ్ళు నిప్పురవ్వల్లా వెలుగుతున్నాయి కింది పెదవి కంపించింది.
"ఎందుకా? నీ కింకా నీ స్థితి తెలియటం లేదూ? ఐ పిటీయు సుజాతా?"
"నాకు నీ జాలి అక్కర్లేదు __"
"కానీ ప్రేమకావాలి __ నాతో పెళ్ళికావాలి__ సిగ్గులేదూ?"
"పడే పడే ఆ మాట అనకు. నాకు నువ్వంటే అసహ్యం పుడుతోంది. చెప్పు నేనేం తప్పుచేశానని సిగ్గుపడాలి" నిలదీసినట్టు అడిగింది.
"ఎందుకా? పెళ్ళి కాకుండానే తల్లి వైనందుకు ఆ పిల్లకి తల్లెవరో తండ్రివరో కూడా చెప్పుకొలేక పోతున్నందుకు __ పైగా యింకా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నందుకు ." విషంగా నవ్వుతో అన్నాడు.
"ఇక చాలించండి" అసహ్య పుట్టిపడే గొంతుకతో అంది.
"ఏం? ఎందుకు చాలించాలి? నిజం వింటూ వుంటే నిష్టూరంగా ద్వనింస్తోందా? నిప్పులాటి అ నిజాన్ని భరించలేక పోతున్నావా, భరించలేక భయపడి పారిపోయినా నిజం దాగదు సుజాతా!"
"నిజం! నిజం! ఏమిటా నిజం?" కోపంగా ప్రశ్నించింది.
"నువ్వు తల్లివి కావటం నిజం __"
నివ్వెర పోయిందామే.
"నీ మాత్రుత్వపు నిజాన్ని దాచటం నిజం__"
నిర్ఘాంత పోయిందామే.
"నీ మాతృత్వపు నిజాన్ని దాచటం నిజం __"
నిర్ఘాంత పొయిందామె.
"నీ పుట్టు పూర్వోత్తరాలు దాచటమూ నిజం __"
"నా పుట్టు పూర్వోత్తరాలా?" తెల్లబోయిందామె.
"అం నీ పుట్టుక హీనం కాదూ?"
"సుధాకర్ !" గద్దించింది సుజాత.
"ఊరకే అరవకు!" నోర్మూయ్ అన్నట్టుగా గద్దించాడు,
నిస్స్తే జితురాలైందామె.
"నీ తల్లి వేశ్య __ భోగంది __ నిన్ను కని నలుగురికీ ముఖం చూపలేక పోయింది. తనలాగే తనువమ్ముకుని బ్రతకమని చెప్పలేక నీ తండ్రిపాలిటి పడేసి ఎటో పోయింది. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నీకూ తెలియదు. అవునా?"
ఆమె సమాధానం చెప్పలేకపోతోంది. నోరుపెగలటం లేదు.
"నీ తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నీ పిన్నికి నీ పుట్టుక గురించి తెలియకుండా జాగర్త పడ్డాడు. కన్న ప్రేమతో నీకు ఊహ తెలిసేదాకా నిన్ను పెంచి అ తరవాత హాస్టల్లో పడేసి చదివించారు అంతేనా? ఇది నిజం కాదా చెప్పు __"
నిర్ఘాంతపోయిన సుజాత నోరు విప్పలేక పోతోంది.
"నీ పుట్టుకే హీనం __ నువ్వెలా పుట్టావో నువ్వూ అలాగే తల్లి వయ్యావు. అక్కడికి పోతాయి ఆ నికృష్టపు బుద్ధులు __ తల్లి మంచిదయితే కదా బిడ్డలు మంచి వాళ్ళయ్యేది __"
ఒక్కో మాట గుండెల మీద కట్టిలా దిగితోంది.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
ఏమీ చెప్పలేక పోతోంది.
ఎంతో గొప్పగా ఉదాత్తంగా ఊహించుకున్న తన కన్నతల్లిని __ ఆ మాత్రుమూర్తిని __ దేవతా స్రీలాటిఆ పవిత్ర మూర్తిని __ అతనలా హీనాతి హీనంగా నిందిస్తోవుంటే ఆమె మనస్సు చిల్లులు పడిపోతోంది.
చిత్రహింస అనిభవిసోన్నట్ట్లుగా వుంది.
అవమానం హేళన దుఃఖం భరించలేకపోతోంది.
అవన్నీ అబద్దాలే అని చెప్పలేకపోతోంది __ యదార్ధం తెలిస్తే కదా వాళ్ళకి తను అబద్దం అని వాదించినా నమ్ముతారా?
దయచేసి యికపై నువ్వు, నాతో, మనప్రేమ పెళ్ళి, స్నేహం విషయాలు ముచ్చటించకు __" ఖరాఖండిగా అన్నాడతను.
ఆమె ముఖాన కత్తి వేటుకి నెత్తురు చుక్కలేకుండా పోయింది.
"అన్నీ మరచిపోతాను __ నువ్వూ నీ బిడ్డా సుఖంగా వుండండి. ఆ బిడ్డకి కన్నతండ్రి ఎవరో కనుక్కుని జేవితక్యన్ని సుఖమయం చేసుకో __ అగ్నిలాటి ఆ నిజాన్ని దాచి యితర్లని క్షోభపెట్టకు _"
"సుధాకర్" పెల్లుబకుతున్న కన్నీటిని ఆపుకుంటూ "నన్ను అన్నయినా అనుఫర్లేదు _ కానీ నా తల్లిని నిందించకు __" అని చెప్పాబోయింది.
కానీ అతనా అవకాశం యివ్వనేలేదు.
"ఇకచాలు _ మాటాడేందుకేంలేదు" కఠినంగా శాసించినట్లుగా అన్నాడు.
తెల్లబోయింది. సుజాత.
"ఇదా యితని నిజస్వరూపం? ఇంత కఠినుడా? ఇంత మూర్ఖుఢా? అనుకుంది.
ఇక అతనిలో మరో మాటయినా మాటాడేందుకి యిష్టపడలేదు _
చకచకా తన సీటు వద్దకి వెళ్ళింది.
ఇప్పుడు ఆలోచన తప్ప ఆవేదనలేదామే మనసులో . సాయంకాలం దాకా ఎలాగో గడిపెసింది.
ఆఫీసు వదిలీ వదలగానే చకచకా నడుస్తూ బస స్టాఫ్ వద్దకి వచ్చేసింది. ఆ ప్రయత్నంగా అటుకేసి చూసింది.
ఎదుటి బస స్టాఫ్ లో నుంచున్న సుధాకర్ క్క్ష్హప్పున ముఖం తిప్పుకున్నాడు. అ అరక్షణంలోనే అతని ముఖంలో రంగులు మారేయి.
సుజాతకి నవ్వోచ్చింది.
"ఇదా ప్రేమ!" అనుకుంది.
"తను ప్రేమించానని బదులుగా తనని అభిమానించి ప్రేమించాడట! బదులుకు __ బదులు __ ఇదేమ ఉపకారమా? పత్యుపకారమా? మరి అంతప్రేమ్మ తన పుట్టుక తెలిసి, తన పాప రహస్యం తెలియకపోయేసరికి మంచులా కరిగి పోయిందట.
