Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 22

    అతని ప్రవర్తన, అతని ధోరణి, అతని నిర్లిప్తత ఆమెకి కోపం తెప్పించాయి.
    అయినా నిగ్రహించుకుంది.
    "ఏమైంది సుధా!" మామూలుగా అడగాలనుకున్నా ఆమె కంఠంలో గాబరా ద్వనించింది.
    "ప్లీజ్! కూర్చో సుజాతా!" కఠినంగా అన్నాడు.
    అతని పలుకుతీరుకి కుర్చీలో కూలబడింది. "చెప్పు! ఏమిటి యీ సస్పెన్స్ ? ఎందుకిలా వున్నావు?" తన మనస్సుని నిగ్రహించుకుంటూ అడిగేసింది.
    అతనావైపు సూటిగా చూశాడు. తరతరాలుగా యుగయుగాలుగా పురుషాహంకారం స్రీ జనం పై చూసే ధోరణిలో చూశాడు.
    ఆ చూపులికి తెల్లబోయింది.సుజాత.
    చప్పున కఠినంగా అడిగాడు "ఆ పాప ఎవరు?"
    "ఏ పాప? అతనంత హఠాత్తుగా ప్రశ్నించగానే తెల్లబోయింది సుజాత.
    అతని ముఖం మరింత కఠినంగా మారిపోయింది.
    "అదే __ నీ పాపగా జానిమక్కగారి చేతుల్లో పెరుగుతోన్న బుజ్జిపాప __ నీ అందాల జాబిలీ కురిసిన నింగిలోని సిసిమల్లి వ్యంగ్యంగా అడిగాడు. అంతలో మళ్ళీ అడిగేడు చప్పున "చెప్పు __ ఎవరితో చేసిన ఫలితం అది?"
    ఆ మాటలకి శత శతఘ్నులు గుండెలో పెల్చునట్టయింది. ఆ దోరణికి మాటలకి ఆమె మనస్సు రాయిలా అయిపోయింది "సుధా!"  అంది నీరసంగా __ బేలగా, కోపంగా.
    "యస్ ! చెప్పు ! ఐ వాంట్ ట్రూత్!" ఒక పోలీసాఫీసరు అనుమానితుడిని కూడా అంతగా నిలదీసి ప్రశ్నించడు.
    ఆమె పెలవంగా నవ్వింది. ఆ నవ్వు మగజాతినే సవాలు చేసినట్టుగా వుంది. ఆ నవ్వు జాత్యం హంకరాన్నీ గేలిచేసినట్టుగా వుంది.
    "నీకు నిజం కావాలా?"
    "యస్! స్పీకవుట్  __"
    అతన్ని సూటిగా చూసింది. ఆ చూపులో జాలివుంది. ప్రేమ వుంది. అన్నిటికి మించి నిరాశవుంది. "సుధా! నిజం కావాలా నీకు? నిజం చెప్పు నిజం చెప్పు అంటూ నిలదేస్తున్నావే? నీకు నిజంగా నా మీద నా మాటమీద నమ్మకం వుందా! నేను నిజం చెబుతాననీ, చెప్పింది నిజేమనేనీ చోటు చేసుతావా సుధా!" ఆఖరున ఆ కంఠంలో ఆరాటం చోటు చేసుకుంది.
    "ఇంతదాకా వుంది!"
    అతనెంత నెమ్మదిగా అన్నా ఆ మాటలు ఆమె గుండెల్ని దూసుకెళ్ళాయి. "ఇప్పుడు లేదా?" అనిఅడిగింది సగంచచ్చి __
    "ఏమో!" ఎటో చూస్తూ అన్నాడు. "అది నువ్వు చెప్పే నిజంపై ఆధారపడి వుంటుంది. సుజా _ నమ్మడానికి అపనమ్మకానికి  మధ్యతరగతి చాలా పలచనిది. పొరలాగా వుంటుంది. అది _ అది _" అతను పూర్తీ చేయలేదు.
    సూటిగా తన ముఖంలోకి చూడకుండా అతనన్న మాటలు విని పకపక నవ్వింది సుజాత.
    ఆ నవ్వుకి తెల్లబోయాడతను.
    ఇంకా సుజాత అలాగే నవ్వుతూ వుండటంతో "ఏమిటా నవ్వు?" అని కఠినంగా అన్నాడు గద్దించినట్టుగా,
    "ఆఖరికి నవ్వూ మామూలు మగాడివే అనిపించుకున్నావ్ అవును కానీ సర్! తమరికి ఆ అనుమానం ఎందుకొచ్చిందో!" ఆమెకి అతనలా ప్రశ్నించేసరికి అతనిపై గౌరవం తగ్గిపోయింది.
    "ఆ పాప ఎవరు? ఆ విషయం అడిగితే ఏదో చెబుతావేం? అయితే నలుగు రనుకుంటున్నది నిజమేనా?"
    "ఏది నిజం? ఏది అబద్దం? నీకు నిజం తెలుసుకోవాలనుందా? అలా అయితే యిలా ప్రశ్నిస్తావా? ఆ ధోరణి వేరు? ఆ ప్రశ్నలూ వేరు. అయినా చెబుతున్నా విను __ ఆ పాప  నా పాప కాకపోయినా నా పాపే!"
    "నీ పాప కదా?"
    "మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నా పాప కాదు!" నిశ్చయంగా అంది, నిర్భంయంగా చెప్పింది, నిరుద్వేగంగా చెప్పింది.
    "మరి _ ఆ పాప ఎవరు?"
    "నాకు తెలియదు!" నిర్లక్ష్యంగా అంది.
    "తెలియకుండానే  కన్నావా?" కోపాగ్ని అనుమాన శిఖలతో ప్రజ్వరిల్లింది.
    చప్పున అతనలా అడిగేసరికి ఆమె తెల్లబోయిఅతని వైపు నిస్సహాయంగా చూసింది.
    అతని కళ్ళు కుంచించుకు పోయి నాసికాపుటాలు విశాలమయ్యాయి. నుదురు ముడుతలు పడింది. కంఠంలో కోపం కనిపించింది.
    "అందుకేనా ఆరునెలలు సెలవు పెట్టవు, అనారోగ్యం అన్నావ్. పిన్ని అన్నావ్! అంతా అబద్దమేనా! నా నుంచి అంత దాచిన దానిని ఆపాప నెందుకు తెచ్చావ్? ఏ అనాధ శరణాలయంలోనో వదిలేసి వుండచ్చే! అలా పెరగటం యిష్టం లేకపోతె ఏ చెరువుగట్టున్నో తుప్ప చాటున్నో గొంతుపిసికి చంపి వుండచ్చే __ లేదా ఎక్కడో ఏ రైల్లోనో బస్సులోనో ఆపాపని నివరపుచ్చి వదిలేసి వుండచ్చుగా!
    సుజాతా! ప్రేమ తప్పుకాదు. ప్రేమ కలాపాలూ తప్పుకాదు మీ దృష్టిలో __ కానీ గర్భవతి . అయితే ఆ పిల్లలని ఎలా వదిలించుకోవాలా అని చూస్తాను మీ ఆడవాళ్ళు. బరువూ బాధ్యతా తెలియని మగవాడి సరసన చేరటం మీ తప్పుకాదా! మీతో పాటే ఆ తప్పు చేసిన మగవాడిని నిలదీయలేరా మీరు! అంత చేత కాకపోయిన వాళ్ళు ఎందుకు ప్రేమించాలి!
    హద్దులు తెలియని మీ ప్రేమకి ఆ శిశువులు బలి కావాలా? లేక నా లాటి ప్రేమికులు బలికావలా__"
    "స్టాఫిట్!" అతని మాటలు పూర్తీ కాకుండానే అడ్డు తగిలింది. అపర కాళిలా గర్జించింది. "సుధాకర్! ప్లీజ్ స్టాపిట్ __ కంట్రోల్ యువర్ సేల్ప్! నన్ను శిశుహత్య చేయమంటున్నావా?" నువ్వు _ నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం వుందా?" ఆమె పెదాలు కోపంతో అవమానంతో అదురు తున్నాయి, చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
    అతను ప్రశాంతంగా జబాబిచ్చాడు "అవును సుజాతా" నేను మంషిని కాబట్టే ఆ మాట అంటున్నాను. నువ్వు యీ ఆఫీసులో చేరినప్పటి నుంచీ నాపై అనురాగాన్ని పెంచుకున్నావ్. నీ చూపులు నాకర్ధమవుతూనే వున్నాయి.
    అయినా ఆడవాళ్ళకి సహజంగా దూరంగా వుంటాన్నేను. అలాటి నన్ను నీ చూపులతో మాటలాతో మనిషిని నమ్మేట్టు చేశావు. నీ ఆకర్షణకి లోగేట్టు చేశావు. నీ ప్రేమని విశ్వసించెట్టుగా చేశావు. మన మధ్య ఆకర్షణ పెరిగింది. ప్రేమ పెరిగింది."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS