Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 21

     అయన తండ్రిగారు అయనమాట కాదనరు. అయన ప్రేమని త్రోసిపుచ్చరు, ఆమోద ముద్రవేస్తారు.
    అయన అంగీకారం మాకు లభించి తీరుతుంది.
    మీ ఆశీస్సులు లభిస్తాయి. _
    మీరు యీ ఉత్తరం అందగానే బయలు దేరిరండి సాంప్రదాయకంగా మీరు రెండు మాటలు వాళ్ళ నాన్న గారితో మాటాడి వెళ్ళండి.
    ఇక్కడ మధురప్రసాదు గారంటే __ అన్నట్టు అది నా కాబోయే మామగారి పేరు __ ఎంత వ్రాసినా అయన పేరు చెప్పకపోతే మీకేం తెలుస్తుంది చెప్పండి?__ అయన ఎంత గోపవరావు నిత్యం పేపరు చూసే మీకు తెలుసు.
    ఈ నగరంలో అయనలేని కార్యక్రమం లేదు. పేరో పోటోనో పత్రికలో కనిపించని రోజువుండదు.
    మీరు పిన్నితో సహాబయలుదేరండి. పిన్నికి ఈ శుభవార్త చెప్పండి. ఆవిడా ఎంతో సంతోషిస్తుంది తమ్ముడికి, చెల్లిలికినా ఆశీస్సులు __
                                                                                                         నమస్కారాలతో,      

                                                                                                        మీ కుమార్తె సుజాత.
     మళ్ళీ మళ్ళీ చదువుకుని కవరు అంటించింది.
    ఆటి౦డర్ ని పిలిచి కవరిచ్చి పోస్టు చేసి రమ్మంది.
    ఆనందంతో ఆఫీసంతా ఒక్కసారి కలయ చూసింది. అందరూ ఎవరిమట్టుకి వాళ్ళు జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారు.
    అదే సమయంలో అటుగా చూసిన సుధాకర్ ఏమిటన్నట్టుగా సైగ చేశాడు.
    సుజాత కళ్ళు కొమ్టిగా నవ్వేయి.
                           *    *    *    *   
    ప్రతిరోజుఉదయం పూట కలుసుకోగానే నవ్వుతూ ఆనందంగా పలుకరించుకునే ఆ కనులు యీ రోజు నవ్వుకొ లేదు.
    ఆనందంగా పలుకరించుకోలేదు.
    రెండు కళ్ళు ఎదురు చూశాయి పలకరింపు కోపం.
    మరో రెండు కళ్ళు ఎదురు చూశాయి పలుకరించకుండా పక్కకీ తప్పుకున్నాయి. ఆ కళ్ళపై వుండే కనుబొమలు ముడిపడ్డాయి.
    ఆ జత కళ్ళకి అనుగుణంగా కాళ్ళు తొందరించాయి. ఆ కాళ్ళ జతకి వున్నా చోట్లు కఠోర శబ్దం చేస్తూ వెళ్ళేయి.
    చప్పున నిరాశతో కుంగిపోయింది. సుజాత.
    ఆ రోజు ఎంతో ఆనందంతో వచ్చిందామె.
    తండ్రిని రమ్మని రాశానని చెప్పాలని తెగ ఉబలాటంతో వచ్చిందామె. నిన్నంతా ఆఫీసులో జరిగిన సడెన్ ఇన్ స్పెక్షన్స్ లో అతనికి ఆ "ఉత్తరం " విషయం చెప్పాతానికే కుదరలేదు. సాయంకాలం మామూలుగా అయిదింటికే సుజాత ఆఫీసునుంచి బయటపడినా కొత్తగా ప్రమోషన్ వచ్చిన సుధాకర్ ఆమె వెంటే బయట పడేందుకు వీల్లేకపోయింది. దాంతో సాయంకాలం కలుసుకునే అవకాశమే కుదరలేదు.
    అలాటి నిరుత్సాహాలు కొత్తకాదు. అలా ఎన్నో విషయాల్లో ఎన్ని పర్యాయాలో అనుకున్నది జరక్క ఎంతో నిరుత్సాహం పొందింది. ఆమె.
    కానీ యీ రోజు __ యీ రోజు
    ఎంత ఉత్సాహంతో వచ్చిందో అంతగా నీరు కారిపోయింది.
    నిరాశ నిండిన గుండెతో ఆఫీసులో అడుగు పెట్టింది.
    ఆఫీసులో పని రాద్దేగానే వుంది.
    అయినా అతన్నోమారు కలవాలి! మాటాడాలి!
    ఎదో సాకుతో ఓ సారి ఫిల్ తీసికెళ్ళింది. అతని దగ్గరగా వెళ్ళాలనీ అతనితో మాటాడాలనీ అదోతపన.
    "ఏమిటి అలా వున్నారు?" దగ్గరగా  వెళ్ళినా మామూలు చిరునవ్వులు కొంటి మాటలు లేకపోవటంతో తనే ప్రశ్నించింది, అభిమానం దెబ్బతిన్నా తమ యిద్దరి మధ్యా అభిమానాలేమిటి అనుకుంది.
    అతను మౌనాన్ని ఆశ్రయించాడు. జవాబు చెప్పలేదు. సీరియస్ గా వుండి పోయాడు. ముఖంలో ఎదో గాంభీర్యం. అతను కనులెత్తి చూసే ఆ కాళ్ళ వెనుక భావాన్ని చదవగల దామె. కనీ అతను సూటిగా చూళ్ళేదు.
    "ఏమయింది?" మళ్ళీ ప్రశ్నించింది. గుండెలో గుబులు ఉక్రోషం తన్నుకుని వస్తోన్న ఆవేశానికి గుండెల్లో సన్నని మంట. చెప్పటానికి రాని రోద! అయినా నిగ్రహించుకుంటున్నది.
    "లంచ్ అవర్లో మాటాడుకుందాం!" మామూలుగా అన్నాడు. ఆ కంఠంలో పరిచయంలేదు. ప్రేమ లేదు. ఆదరణ లేదు ఆప్యాయత లేదు. అసలు ముఖం వైపే చూళ్ళేదు. ఫైలు చూస్తూనే ఒక అపరిచితురాలితో మాటాడినట్టుగా మాటాడేడు.
    ఉస్సురుమంది సుజాత. గుండెలో గాయమయింది.
    "ఎంతయినా మగవాళ్ళు!" అనుకుంది. ఆ రెండు గంటలూ ఎలా గడపాలా అనుకుంటూ తన సేతుకి వచ్చింది.
    లంచ్ అవార్ దాకా ఒక్క ఫైలు కూడా చూళ్ళేదు. ఒక్క మత చదవలేదు. రాయలేదు. ఖాళీ పేపరు మీద ఏవేవో పిచ్చిగీతలు గీస్తూ కూచుంది. ఆ ప్రయత్నంగా తన పేరు రాసుకుంది. ప్రక్కన్నే అతని పేరు రాసింది. మళ్ళీ ఆ పేరు కొట్టేసింది.
    సరిగ్గా ఒంటిగంటకి మునిసిపల్ సైరస్ మ్రోగింది.
    ఉలిక్కిపడింది సుజాత. చప్పున లేచి నుంచుని చేతిలోని పేపరు కేసి చూసింది.
    సుధాకర్ __ సుధా __ సుజాత __ సుజాతా  సుధాకర్ __ సుధా __ సుజాత _
    ఏమిటి పిచ్చి అనుకుంది!
    చంద్ర బిమ్బాలుగా గీసిన తన మనస్సుని తనే మెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఆ పేర్ల చుట్టూ చంద్రబింబాలు .... రసరమ్యరేఖలు వలపు ప్రతిబింబాలు__
    ఒక్కక్కరే కాంటిన్ కి వెళ్ళిపోయారు.
    ఇద్దరే __ ఆ ఇద్దరే ఆఫీసు కంతటికీ మిగిలిపోయారు.
    సుధాకర్ నిశ్చలంగా రాయిలాగా నిశ్చేతన్యం ఆవహించిన మూర్తిలాగా కూర్చున్నాడు.
    కానీ సుజాత నిగ్రహించుకోలేక పోయింది. అంతదాకా నిగ్రహించుకున్నఆరాటం, ఆతురత ఆమెని యిక నిలువ నీయలేదు. పరుగులాటి నడకతో వెళ్ళింది. అతనితో పొట్టాడాలనీ అతని గుండెలపై  పిడికిళ్ళతో కుమ్మెయ్యాల్లన్నంత ఆవేశంతో వెళ్ళింది.
    కానీ అతను పరమ శాంతంగా వున్నాడు.
    "కూర్చో !" ఏ భావం ప్రకటించని గొంతుకతో అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS