వారం రోజులు తీపి తీపి కలలతో మధుర మధుర భావనల్లో గడిచాయి. గుండెల్లో మధు మాస యామినులు కోటి శరశ్చంద్ర చంద్రికా ధావళిమలని విరియించాయి.
అ రెండు జతల కళ్ళు సరిగ్గా పదినిమిషాలు తక్కువ పదికి కలుసుకుంటాయి. పలకరించుకుంటాయి. నవ్వుకుంటాయి లంచ్ అవర్ లో టేబుల్ కి అటూ యిటూ కూర్చుని మాటాడాకుంటాయి. ప్రేమని పూర్తిగా పంచేసుకుంటాయి.
సరిగ్గా అయిదూ ఐదుకి వీడ్కోలు చెప్పుకుంటాయి.
అప్పుడు చూడాలి ఆ కనులని!
తిరిగి రేపు కలిసేదాకా ఎలావేగాలి అన్నట్లుగా వుంటాయి. ఎందుకు మనకీ ఎడబాటు అన్న భావనతో నిండి వుంటాయ్.
ఆ కనులలో కోపం కూడా కనిపిస్తుంది. ఈ రాత్రిని ఎవరు కల్పించారు? ఎందుకు కల్పించారు అన్నంత కసివుంటుంది.
అయితే రేపు కలుసుకుందాం కదా! భయంలేదు. ఈ మాత్రం వియోగాన్ని భరించక తప్పదు. ఫరవాలేదు. రేపు కొత్త ఉత్సాహంతో కొత్త కోరికలతో కలుస్తాం కదా అన్న భావం వెళ్ళి విరుస్తుంది.
ఆ కనులు సంతోషంతో వీడ్కోలు పుచ్చుకుంటాయి అప్పుడు నవ్వుకుంటాయి. ఆనందంతో విరబూస్తాయి ఆ కను బొమ్మ.
సుజాత మనస్సు నిండా సుధాకర్ నిండిపోయాడు.
అక్కడ పాపతో, యిక్కడ అతని సాన్నిధ్యంలో ఆమెకి రోజులు వెన్నెల రాత్రుల్లా గడచి పోతున్నాయి.
ఉత్సాహం ! ఉఅత్సాహం ! ఉత్సాహం !
అంతా ఉత్సాహమే.
మూర్తీభవించిన ఉత్సాహామూర్తిలా వుంది సుజాత. ఆరునెలలు సెలవు మీద వెళ్ళివచ్చినా __ ఒక వేళ యిన్నాళ్ళూ అంతపనీ పెండింగ్ లో వుండిపోయినా ఆ పనిని అంతా ఆరురోజుల్లో పూర్తీ చేసి వుండేదన్నంత ఉత్సాహంగా పని చేసుకుంటూ పోతోందామె. సుధాకర్ వదిలేసినా పెండింగ్ పేపర్సుని ఎపనయినా వుంటే చప్పున పూర్తీ చేస్తోంది.
రామలింగయ్యగారికి చాల ఆనందంగా వుండి అసలే ఆయనకి బాగా పనిచేసే వాళ్ళంటే ఎంతో యిష్టం. దానికి తోడు సుజాత, వినయం, మంచితనం, ఒద్దిక, యింకా అభిమానాన్ని కలిగించాయి.
నశ్యం ఒక పట్టుపట్టి పీల్చారు. సుజాత అల్లంత దూరం నుంచి నమస్కారం చేయగానే.....
"రామ్మ! రా!" అన్నారు ఆప్యాయంగా.
సుధాకర్ యింకా రాలేదు. యిఇరోజు. తను ముందే వచ్చిందో. అతనాలస్యంగా వస్తున్నాడో....
వెరీగుడ్! అంతా నీలాగా పనిచేసే వాళ్ళుంటే మా బోటి వాళ్ళ పని చలా సులువుతల్లీ __ ఏముందీ పేపర్స్ ని ఒక్కసారి అలాగా చూసి సంతకం పడేసి ఆఫీసరుగారు వద్ద పంపెయ్యటమే కదా! కానీ ఎక్కడ చేస్తారమ్మా! చెయ్యరు.
మగాళ్ళేమో సినిమాలు గురించీ క్రికెట్ గురించి చర్చలు... ఆడవాళ్ళేమో సీరియల్స్ గురించి సింగారాలా గురించీ చర్చలు. దాంతో సగం కాలక్షేపం మిగతా సగంలో సగం లంచ్ బ్రేక్ కి తీ బ్రేక్ కి సరిపోతుంది. ఇహపనిచేసేది గంట గంటన్నరలో.
అబ్బో! అబ్బో! ఎంత మ్యాన్ పవర్ లాసవుతుందో ఒక్కరూ తెలుసుకోరే __ అదే తెలుసుకుంటే దేశం యిలా తగలడేదా? ఉహూ మనమూ అమెరికన్స్ తో సరిసమానంగా వుండే వాళ్ళం.
అక్కడికీ మన ఆఫీసులో ఫర్లేదునుకో..... ఏ రాజులో మహారాజులో తప్పితే అంతా డ్యూటీ మైండెడ్ గా వుంటారు.
ఇంతకీ చేపొచ్చే దేమిటంటే __ నేను తండ్రిలాంటి వాడిని సలహాలివ్వచ్చు.... తప్పుంటే చెప్పొచ్చు ... "అవునా?"
ప్రవాహం అడ్డుకట్టు తాగాలి పాసవుతావు ప్రమోషన్ వస్తుంది. మంచి ఆఫీసరునీ అవుతావు.ఇక నాలాటి వాళ్ళామా! మేమంతా యిలా రిటైరవ్వాల్సిందే__"
సుజాత ఏమీ అనలేదు.
"కాబట్టి __ కన్నాతండ్రిలాంటి వాడిని. మంచో చెడో నా ఆలోచన చెప్పాను, నువ్వు పరీక్షలు రాయాలి!"
తలూపి లేచివచ్చింది.
అంతలో కనులూ కలసుకున్నాయి.
ఆమెకి వెంటనే ఆ రోజు తను తన తండ్రిగారికి రాసిన ఉత్తరం గుర్తుకి వచ్చింది. వానిటీ బాగ్ లోంచి ఉత్తరం తీసింది.
మళ్ళీ ఒక్కసారి చదువుకుంది
చదువుతూ వుంటే ఆమె గుండెల్లో ఎన్నెన్నో భావాలు తారసాలాడాయి.
నాన్నగారూ!
ఇన్నేళ్ళూ మీరు నా పెళ్ళి గురించి ఏవేవో దిగుళ్ళు పడ్డారు ఎంతో అందోళన వెలిబుచ్చారు.
ఒకానొక స్థితిలో నాకు పెళ్ళే కాదేమోనానీ, నేను పెళ్ళి కాకుండా నిలిచి పోతానేమోనానీ, తద్వారా నా చెల్లెళ్ళ తమ్ముళ్ళ జీవితాలూ పాడవుతాయనీ మీరు భయపడ్డారు. నిరాశపడ్డారు. ఆ భయంతో, ఆ అందోళనతో ముఖ్యంగా ఆ ముందు చూపుతో నన్ను మన కుతుమ్బననికి దూరంగా వుంచుతూ వచ్చారు.
కానీ నాన్నగారూ! నా కన్నాతల్లి __ ఆ మహాసాధ్విమిమ్ము మనసారా ప్రేమించి, మీలో వున్నా సంగీత సరస్వతీ అభిమానించి మిమ్ము స్వీకరించింది, మీరూ ఆమెని అర్దాంగాలక్ష్మి స్వీకరించారు.
మీ పుణ్యదంపతుల దామ్పత్యసౌరభంగా నేను జన్మించారు. అంతటి యోగ్యురాలి కడుపునా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆడవాళ్ళం, తండ్రికంటే తల్లే మాకు చేరువ, అది అందరికీ తెలిసిన విషయమే.
ఆ పుణ్యత్మురాలి ఆత్మ సదా నాయోగా క్షేమాలే కోరుతూ వుండొచ్చు . నన్ను సర్వదా కాపాడుతూ వుండచ్చు. ఆమె ఆశీస్సులు ఎప్పుడూ నా చుటూ ఒక వ్రాజ్రకవచాన్ని నిర్మించి వుండచ్చు.
అందువల్లనే __ ఆమె అశేర్వచనాల ప్రభావం వల్లనే నేను ఓ భాగ్యవంతుడికి భార్యని కాబోతున్నాను.
అయన నన్ను ముందు అభిమానించారు. ఆ తర్వాత స్నేహితుడుగా ఆదరించారు. ఇప్పుడు ప్రేమికుడిగా ఆరాధిస్తూన్నారు. ఆయనకి నేను నేలమీద నడుస్తోన్న జాబిల్లిని నింగిలో మెరుస్తోన్న జాబిల్లిని ఆయనకి నేను దక్కటం. వలపు పండిన పంటగా భావిస్తున్నారు.
అయన తండ్రిగారు కోటేశ్వరుడు, ఆయనకి యిక్కడ ఎన్నో కంపెంనీల్లో పేర్లున్నాయి. ఫైనాన్స్ కార్పోరేషన్ లో వాటాలున్నాయి. సినిమా హాళ్ళల్లో భాగాలున్నాయి. ఒక మంచి లాడ్జింగ్ కూడా వుంది.
