సురేంద్రకు ఫోన్ చేసింది.
" హల్లో నేను ఆంటి శ్వేతని.సురేంద్ర కివ్వండి ఫోన్ .... హాల్లో నేను సురేంద్రా! శ్వేతను నేనొక. నిర్ణయానికి వచ్చాను. మనము స్నేహితుల్లా మిగిలిపోవటం ఇద్దరికి మంచిది-"
"............."
" సారీ అక్కరలేదు భవిష్యత్తులో మనమధ్య ఈ ఇఘ్ఘా ఒక అడ్డుగోడ కావచ్చు. అయినా ఒక్క విషయం ఇంతవరకు నీతో ఫ్రాంక్ గా చెప్పలేకపోయాను. అయిలవ్ సిద్దార్థ-అయిలైక్ హిమ్-అయి ఆడ్మయర్ హిమ్...."
"......"
"ఎక్సయింట్ కావద్దు సురేంద్రా! మనము జీవితాంతం ఒకరితో ఒకరం తల్లిదండ్రులు చేసుకు్న వాగ్ధానాలకు కట్టుబడి ఉండాల్సిన పని లేదు" అన్నది.
"శ్వేతా-" వనమాలి ఆమె చేతిలోని ఫోన్ లాక్కున్నాడు.
"హాల్లో సురేంద్రా....... హాల్లో! శ్వేతన ఏదయినా దయ్యంలాంటిది ఆవహించిందో ఏమో, మధ్యహ్నం నుండి గదిలోనుండి బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చి ఈ ఫోన్ చేస్తుంది. రేపు మాట్లాడుకుందాం" అని ఫోన్ పెట్టేశాడు.
"డాడీ-" శ్వేత చివ్వున లేచింది.
"బేబీ....." అతను కోపంగా చూచాడు.
"చూడమ్మా! నువ్వేది కావాలన్నా వద్దు. అనలేదు. ప్రమాదభరిత మయినది, పోలీసు ఉద్యోగం , మగవాళ్ళు చేసేది, చేస్తానని పట్టుపట్టావు. కాదనలేదు. పెళ్ళి విషయంలో-"
శ్వేత ఆవేదనగా నవ్వింది.
"నా తండ్రి అందరిలాంటివాడు కాదని ఓ గర్వం ఉండేది డాడీ. అచ్చం సగటు తండ్రిలా గే చేస్తున్నావు. ఆయనగారి అఫేర్స్ అట రైలు ప్రయాణంలో స్నేహాలని వదిలివేయాలట. నాకేమయినా ఉంటే అదినేను నిజాయితీగా అంగీకరించాలట."
"అతను మగాడే. అతనికి నీకు పంతం ఏమిటి!" అన్నది తల్లి.
"నీవు భయపడితే అర్థం ఉన్నదమ్మా. మగాడిపై ఆర్థికంగా ఆధారపడ్డావు. నాకా అవసరం లేదు. జీవితాంతం అతను అనుమానంగా ,అవమానంగా చూస్తుంటే బావుంటుందా!" అన్నది.
జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది.
ఇద్దరూ సీరియస్ గా విన్నారు. అయనా వారికి అదితప్పు అనిపించలేదు.
"ఈ సమాజంలో పురుషుడు ఆమాత్రం స్వేచ్ఛ కోరుకుంటాడు. నేనువచ్చి అతనితో మాట్లాడుతాను" అన్నాడువనమాలి.
" వద్దు డాడీ! ఈ విషయంలో నన్ను బలవంతపెట్టకు......" అంటుండగానే వాకిట్లో జీపు అగింది.
"మిస్ శ్వేతా-"అంటూ సి.ఐడి. డిపార్ట్ మెంటుకు చెందిన ఓ అధికారి దిగాడు.
"నమ్మకాలు ,ముఢాచారం అంటూ సిద్దార్థ వెంటాడుతున్నాడని అతనిపై నే మంత్రశక్తి ప్రయోగిస్తున్నారు. అతనిచ్చిన ఇన్ ఫర్ మేషన్ సూపర్ ఫిషల్ గా ఉంది ఆ 'బాలు' అనబడ్ బాలరాజు స్థావరం అక్కడి కార్యకాలాపాలు కనుక్కోవాలంటే నీవల్లే అవుతుంది"అన్నాడు
"నేను రేపు వస్తాను సర్....."
"అలాగే ఎలా వెళ్ళాలన్నది నేను చెబుతాను.అక్కడ జరిగే కార్యకలాపాలు వివరాలు సిద్దార్థ నీకు వివరంగా చెబుతాడు" అన్నాడాయన.
"థాంక్యూ సర్." అతను వెళ్ళిపోయాడు.
"ఏమిటమ్మా ఇది'"
" ఒకసరి చెప్పను నాన్నా. వారికేదో రుణపడి ఉన్నాం. ఈ పెళ్ళి జరుగాలనుకోవటం అర్దంలేని విషయం , అతనికి కన్ను ఒంకరా, కాలు ఒంకరా! నేను చెబుతాను" అన్నది.
"ఈ కాలపు పిల్లలు..." విసుక్కుందామె.
అలా రెండు గంటలు వాదించుకుని, యెవరిదారిన వారు నిదురపోయారు.
26
సిద్దార్థ చెప్పిన విషయాలు ,టక, టక టేప్ చేస్తుందిశ్వేత.ఆమె బురఖా వేసుకుని కరీమ్ చాచా ఇంటికి వచ్చింది. అక్కడనుండి సిద్దార్థను చూచింది.
