"ఓహో!శ్వేతగారా! రండి...... రండి.....ఖాదర్ గారు చెప్పారు. మీరే వస్తున్నారని-" అన్నాడు నవ్వుతూ. అతని ముఖంలో జీవకళ కనిపించింది.
"నేను గుర్తున్నందుకు సంతోషం......"
"మిమ్మల్ని మరిచిపోతేకదా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటారు."అన్నాడు.
"అందుకే ఉత్తరాలు రాశారు."
"మన దేశంలో స్త్ర్రీ , పురుషుల అనుబంధాన్ని, స్నేహబంధాన్ని అర్థం చేసుకునే స్థితికి ఎదగలేదు" అన్నాడు.
ఒక్కసారి ఆమెకు సురేంద్ర కళ్ళముందు మెదిలాడు.
"నిజమే సిద్దార్థగారూ!" అన్నది ,వచ్చి కూర్చుని.
"మీరు ట్రైనింగ్ కువెళ్ళారట కదా. నేనింకా వివాహమయి హనీమూన్ లో ఉన్నారనుకున్నాను." అన్నాడు.
ఆమె చెప్పబోయింది. సురేంద్రతో తెగతెంపులు చేసుకున్నానని, అప్పుడే ఖాదర్ తోపాటు మరో నల్గురు పోలీసు ఆఫీసర్లు వచ్చారు.
"అతను ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడుగాని, మనకు దొరకటంలేదు." అన్నాడు.
"ఇలాంటి వారు మొదట మంత్రులకు అభయ హస్తం ఉంటుంది. తొందరపడి ఒక్క అడుగు వేసినా మమ్మల్ని ట్రాన్శ్ ఫర్ చేస్తారు.ఈ పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాంటిది" అన్నాడు డి. ఎస్.సి.
ఒక షావుకారు చేతబడి భయానికే నేల కరుచుకుపోయాడు. నరాలు బిగుసుకు పోయాయిట" అన్నాడు.
"అన్ని ఆధారాలు దొరుకుతాయి. మీరేం కంగారు పడకండి. నా అనుభవాలన్నీ మిస్ శ్వేతచెబుతాను. ఆమెతో డిస్ కస్ చేసి యెలా ప్రొసీడవ్వాలో ఆలోచిద్దాం."
"మీరు మా డిపార్టుమెంట్ లో చేరకూడదూ?" అన్నాడు ఒక సిఐడి. నవ్వుతూ.
"మమ్మల్ని చూస్తే నే అందరూ భయపడతారు. మీలాంటివారు డిపార్ట్ మెంటు కంటే, బయట ఉండేమాకు సహకరించాలి" అన్నాడు మరో డి ఎస్ పి.
"నా దేముందండీ! ఈ మూఢాచారాలు, తాంత్రిక శక్తులు ట్రాష్ అనేనమ్మే వారిలో నేను ఒకడిని." అన్నాడు సిద్దార్థ.
స్వేత తన వివాహం విఫలం అయిన సంగతి చెప్పలేకపోయింది.!
ఇద్దరూ టీ త్రాగి టేప్ రికార్డరు ముందు కుర్చున్నారు.
"టేప్ అయిపోయింది మేడమ్ "అన్నాడు సిద్దార్థ.
"ఐసీ-" రికార్డర్ ఆఫ్ చేసిందామె.
"సిద్దార్థగారూ!మీరు అన్యధా భావించనంటే ఒక్క విషయం చెప్పాలి. ఎంత ప్రగతి సాధించినా పురుఘుడు తన ఆదిక్యతను మరిచి పోలేకపోతున్నాడు....."
"పొరపాటు పడుతున్నారు మేడమ్. పురుషుడే బానిసలా బ్రతుకున్నాడు ప్రతి ఇంట స్త్ర్రీదే పైచేయి. " అన్నాడు అప్పడే అక్కడికి వచ్చిన రాంబాబు.
"నమస్తే !మీరు వాదనకోసం అంటున్నారుగాని యెక్కడ స్త్ర్రీ ఆధిక్యత చూపండి! ఈ పెళ్ళి కొడుకు అందంగా లేదని ఏ స్త్ర్రీ అయినా వివాహ మంటపంలోనుండి లేచిపోయిందా? ఏ రోజుయినా వార్తాపత్రికలో స్త్ర్రీలు కలసి ఒక పురుషుడి పై ఆత్యచారం జరిపి రేప్ చేశరాన్న వార్త విన్నారా!"అన్నది.
"ఏమో మాయింట్లో మాత్రం మా అన్నయ్యలు జీతాలు తెచ్చి వదినల చేతులలో పోసి, "జీ హుజూర్" అంటుంటారు .యెప్పుడు చూచినా వాళ్ళ బంధువులే ఇంటినిండా ఉంటారు" అన్నాడు రాంబాబు.
"ఆదిభార్య ఆధిక్యతను గౌరవించి, ఇచ్చి గౌరవం కాదు. తమ భాత్యత వప్పించుకుందామని , జీతం ఆమెచేతిలో పెడితే అందులోనే అడ్ జస్టు అనవుతుందని తెలుసు." అన్నదామె.
"ఇప్పుడా సబ్ జెక్టుకు పులిస్టాప్ పెట్టండి. స్వేత గారూ ఆ బాలు గారి విషయాలు నాకు తెలిసినంతవరకు అన్నీ చెప్పాను. మీకేమయినా డౌట్స్ ఉంటే అడగండి"అన్నాడు.
"మరోసారి టేప్ వింటాను."
"అబ్బబ్బ! ఆ బాలుగాడికి, రాజుగాడికి చేతబడులు పిచ్చి అంటే, వాళ్ళవెంట పరుగులు పెట్టే పిచ్చి వీడికి పట్టుకుంది. వస్తాను." రాంబాబు వెళ్ళిపోయాడు.


