Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 97


    "యు ఆర్ కరెక్టు...."

    "థ్యాంక్యూ...." అవి తీసుకుని పర్స్ లో వేసుకుంది.

    "షాపింగ్ అర్థరాత్రి వరకు తెమలదు అనుకున్నాను."

    ఆమె ఇంటికి రాగానే తండ్రి ఎదురు వ్చచాడు.

    "మీ అంచనాలు యెప్పుడూ తప్పుతూనే ఉంటాయిడాడీ!" అన్నది కాస్త కోపంగా.

    "వీళ్ళిద్దరు దేనికో ఘర్షణ పడ్డారల్లే వుంది. ఈ కాలం పిల్ల అంత. వ్యక్తిత్వం అంటూ లేనిపోనివి సృష్టించకుంటారు." అనుకుంటూ వెళ్ళిపోయాడు.

    ఆమె గదిలోకి వచ్చి, ఆ ఫోటోలు పరీక్షగా చూచింది. ప్రతి ఫోటోలో గంభీరంగా ,హుందాగావున్నాడు సిద్దార్థ. ఎవడోగాని,వాడు తనమీద కసితో తీసినా మంచి యాంగిల్స్ లో తీసాడు అనుకుంది.

    అతను మాటలో అనుమానం కాని, మాటలో అశ్లీలతగాని ఏనాడు చూడలేరు, వినలేదు.

    ఆ కళ్ళల్లో ఎంత ఆరాధన!

     ఆ చూపుల్లో ఎంత నిజాయితీ!

    సిద్దార్థ ఆలోచనవలే ఆమెను అణువణువునా పులకింప జేశాయి.

    ఆ ఫోటోలు గుండెలమీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది.

    ఈ దేశంలో  స్త్ర్రీలు, పెళ్ళిళ్ళు నిరాకరించే స్థితి రావాలి. పురుషుడికి  పవిత్రత కావాలి. స్త్ర్రీలు మాత్రం పూజ చేస్తూ పవిత్రంగా వీరినే జపిస్తూ లిట.

    యెంత దారుణమైన అలోచన! పవిత్రత, నిజాయితీ, నీతి అందరికి ఒకటిగానే ఉండాలి.

    అతన్ని నమ్మక వదిలేసే ధైర్యం స్త్ర్రీకి రావాలి! ఆర్ధికంగా అతనికి సమాన   హోదాలో ఉంది.తను తనే ముందంజ వేయాలి. మామూలు స్త్ర్రీలు ఏం చేస్తారు?

    వాళ్ళు తన చదువుకు సహాయం చేశారు. ఆ కృతజ్ఞత  ఉండాలి. కాని ఇది కృతజ్ఞత  అనుకోవటం  అర్థంలేని విషయము . సురేంద్ర, కుంటి, గుడ్డి కాదు, అతనికి కాళ్ళు కడిగి  నెత్తిన నీళ్ళు చల్లుకుని మరీ పిల్లనిస్తారు.

    తల్లితండ్రులు గొడవ చేస్తారు. వాళ్ళకు లాభించేది ఏం  లేదు. జీవితాంతం అనుమానాలతో ,అవమానాలతో  బ్రతికేకంటే ఒకేసారి తెగతెంపులు చేసుకోవటం అందరికీ మంచిది.

    రాత్రి పదిగంటలవరకు ఆలోచిస్తూనే ఉంది.

    బయటినుండి అప్పుడే వచ్చిన  వనమాలి కూతుర్ని పిలిచాడు.

     " నువ్వు భోజనము చెయ్యాల్సింది." అన్నాడు.

    "తొందరేం! చేస్తాను."అన్నది లేచి పోటోలు ప్రక్కన పెడుతూ.

    " ఇన్విటేషన్ కార్డ్స్ సెలెక్ట్ చెయ్యండమ్మా!" అన్నాడు.

    "ఈ దేశంలో అన్నీ మగవాడి ఇష్ట ప్రకారం జరుగుతాయి కదా! సురేంద్రను అడగలేక పోయావా నాన్నా!" అన్నది.

     అది వెటకారమో, నిజమో తెలియక  ఆయన నీళ్ళు  మింగాడు.

    "నిన్ను ఆడపిల్ల అని చులకనగా చూస్తే ఈ డిపార్టమెంట్ లో చేర్పిస్తానా బేబీ... ఓ మరిచేపోయాను. నువ్వు లేనప్పుడు నీ బాస్ ఫోన్ చేశాడమ్మా. అతను ఏదో కేసు విషయాలు మాట్లాడాలి అన్నాడు"అని చెప్పాడు.

    " అతనంటే మీ ఆలోచన ఏమయిందండీ! పెళ్ళి అని సెలపు పెట్టిన పిల్లయెలా పనులు చేస్తుంది" అన్నది తల్లి.

    "అబ్బ  ఏమిటే నీ కంగారు!  వస్తుందని చెప్పానా!" అన్నా రాయన.

    "డ్యూటీ ఈజ్ ఫస్ట్ డాడీ...." త్వరగావెళ్ళి ఆమె పోలీస్ ఎక్చేంజ్ కి ఫోన్ చేసి బాస్ అడ్రస్ అడిగింది.

    "గుడ్ ఈవినింగ్ సర్! నన్ను గుర్తుచేశారట."

    ".............."

    "థాంక్యూ సర్! ఇన్విటేషన్ ఇస్తానుకదా అని చెప్పలేదు.అసలు విషయం ఏమిటి సర్?"

    "............"

    " మరేం పరవాలేదు, చెప్పండి....."

    "అలాగ్ ...... రేపు ఉదయం వస్తాను," అన్నది ఫోన్ పెట్టేసి.

    తల్లి తండ్రులకు తన నిర్ణయం యెలా చెప్పాలా అని క్షణం ఆలోచించింది. వారిముందే సురేంద్రకు ఫోన్ చేస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది. అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS