"నాకు ఒక్క నిజం చెప్పు."
"అతడని ప్రేమించావా లేదా అనే కదా!"
"కాదు అతనికి, నీకు శారీరక సంబంధాలు ఏర్పడ్డాయా?"
ఆ ప్రశ్న వింటూనే ఆమె ముఖంలోకి రక్తం చివ్వున వచ్చింది..
ఆమె చిగురుటాకులా వణికిపోయింది.
"ప్లీజ్ చెప్పు శ్వేతా! మౌనం అంగీకారంగా తీసుకొమ్మంటావా!"
"స్టాపిట్..... స్టాపిట్...." అరిచింది.
"ఏం యెందుకు?" అతను విజయగర్వంతో చూచాడు.
"మేమిద్దరం ఒక ఉద్దేశంతో;ఒక ధ్యేయంతో ముందుకు సాగాం. ఎప్పుడూ వేరేవిధంగా ప్రవర్తించలేదు. అతనిలోని అర్థగుణం ,నిజాయితీని నేను అభిమానించాను. అలాగే నాలోని ఆత్మవిశ్వాసము, ధైర్యం అతనికి నచ్చాయి."
"అంత దగ్గరగా వెళ్ళాక...."
"ఏం జరుగలేదు.ఒక్కసారి అతను నాది నటన తెలియకతను పాసయ్యానని, ఒక ముద్దు అడిగాడు...." ఆఖరుపదం అంటుంటే ఆమెకు తెలియకుండానే ఆమె బుగ్గల్లో గులాబీలు పూచాయి.
అది చూచి అతని హృదయం భగ్గుమన్నది.
"చూడు శ్వేతా! అంతా నిజంచెబితే...."
"అంతా నిజమే చెప్పాను. అతను తన ప్రేమ వెళ్ళడించినవాడు నాపెళ్ళి నిశ్చయం అయిందని చెప్పాను.అతను తన ప్రేమ వెళ్ళడించినవాడు నా పెళ్ళి నిశ్చయం అయిందని చెప్పాను. అతను వొక్కరోజు బాధపడి, ఆ తరువాత , స్నేహంగా వీడ్కోలు ఇచ్చాడు."
"మళ్ళీ అతను రాలేదుకదూ!"
"రాలేదు.అసలు నేను హైద్రాబాద్ లో లేను కదా! అదీ కాక అతను నటనకు హర్ట్ అయ్యాడు."అన్నది.
"ఈ ఫోటోలు తీసి పంపవలసిన అవసరం యెవరికి ఉన్నది?"
"అది మా డిపార్టుమెంటువారిపనే అక్కడి పెద్దలు ఇచ్చిన డబ్బుకు, పార్టీలకు ఆశపడి, అసలు విషయాలను బయటికి రాకుండా చేశారు. నేను వెళ్తూనే ,మొత్తం స్టాప్ ను మార్పించాను."ఖాదర్" అని వొక ముస్లిమ్ సబ్ ఇన్ స్పెక్టరు వచ్చాక విషయాలు బయటికి రాకుండా చేశారు. నేను వెళ్తూనే, మొత్తం స్టాప్ కు మార్పించాను."ఖాదర్"అని వొక ముస్లిమ్ సబ్ ఇన్ స్పెక్టరు వచ్చాక విషయాలు బయటికి వచ్చాయి." అన్నది.
"మీ ఇద్దరి మధ్య కేవలం స్నేహం అని నమ్మమంటావు!"
"నువ్వు మొదటే చెప్పావు, చెప్పటమే నా వంతని. నమ్మటం! మానటము నీ ఇష్టం అని...."అన్నది.
" అది మా డిపార్టుమెంటువారిపనే అక్కడి పెద్దలు ఇచ్చిన డబ్బుకు, పార్టీలకు ఆశపడి,అసలు విషయాలు బయటికి రాకుండా చేశారు. నేను వెళ్తూనే, మొత్తం స్టాప్ ను మార్పించాను."ఖాదర్" అని వొక ముస్లిమ్ సబ్ ఇన్ స్పెక్టరు వచ్చాక విషయాలు బయటికి వ్చచాయి." అన్నది.
"ఈ విషయంలో నేను ఆలోచించుకోవాలి శ్వేతా! మీరు ఇన్ని రోజులు కలిసి వుండి, ఇంత సన్నిహింతగావుండి దగ్గరగా రాలేదంటే నాకు....."
" నమ్మకం కలుగటం లేదు అవునా!అయితే వొక్క విషయం చెప్పు, నీ అఫేర్స్ రైలు స్నేహం అని మరిచిపొమ్మన్నావు. మరి నా స్నేహాలు అలాగే మరిచిపోకూడదా?"
"శ్వేతా!"
"అవును సురేంద్రా!"
"స్త్ర్రీ, పురుషుల స్నేహాలు వొక్కటేనా?"
"అనుభూతులు,అనుబంధాలు,అభిమానాలు అన్నీ వొక్కటే!"
"కాదు.... ఈ విషయం నేను ఆలోచించుకోవాలి."అన్నాడు.
"నీ ఇష్టం..." ఆమె వచ్చినంత వేగంగా వెనుతిరిగింది. ఆమె ఈ మధ్య వెస్సా కొనుక్కున్నది. తన వెహికల్ తీసుకుని బయలుదేరింది.
"కోపం వచ్చిందా శ్వేతా! వివాహం కాంప్రమైజ్ పద్దతిలో జరుగవద్దు."
