ఫోస్ట్ లో వచ్చాయని తెలుస్తోంది.
యెవరు పంపారని ఫ్రమ్ అడ్రసు చూచింది.
"శ్రేయెభిలాషి" అని ఉంది.
మెల్లగా ఆమె ముఖం ఎరుపు పులుముకుంది.
"సురేంద్రా!"
"ఎస్...."అన్నాడు.
ఆమె నమసు చివుక్కుమంది.
" ఎస్ స్వీటీ "అనే వాడు.ఆ ఫోటోలు చూస్తే ఎవరయినా ముఖం మాడుస్తారు.
"సురేంద్రా.... ప్లీజ్ ఒక్క విషయం వింటావా?"
"వినడానికేం అభ్యంతరం లేదు. నమ్మాలా వద్దా అని నేను నిశ్చయించుకుంటాను. నీకు అఫేర్స్ ఉండగా నా అఫేర్స్ గురించి అడుగు తావా?" అన్నాడు లేచి సిగరెట్టు, విసురుగా గిరాటువేసి.
"ఆ విషయమే చెబుతున్ను సురేంద్రా! మనము కాబోయే భార్యా భర్తలం. మనమధ్య రహస్యాలు , దాపరికాలు ఉండకూడదు." అన్నది.
" ఆ ఫోటోలో అతడిని ప్రేమించావా?"
" నాకు? "ప్రేమ" ఇలా వుంటుందని తెలియదు కాని అభిమానిచాను. అతని వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డాను"అన్నది.
"డోంట్ ట్వీస్ట్ ద థింగ్స్...."
"నేను ట్వీస్ట్ చేయటంలేదు.ఒకరోజు మాబాస్ నన్ను పిలిచారు. చూడు శ్వేతా! ఫలానా ఊరిలో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడ స్మగ్లర్స్ కు స్తావరం ఏర్పడింది. దానికి కారణం మధుమూర్తి అంటున్నారు. అతను ఒక్కడేనా.అతని కుటుంబ సభ్యులు భాగస్తులా కనుక్కోవాలి ఎందుకంటే అతని తమ్ముడు మద్రాస్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అది చదువుమీది ఇంటరెస్టు కాదు అతను అక్కడి వ్యాపారాలు చూచుకుంటాడు అంటారు."
"నేనేం చేయాలి సర్?"
"అదే విషయం చెప్పబోతున్నాను. ఆ మధుమూర్తి దగ్గరకు ఎవరూ వెళ్ళలేకపోతున్నారు"
"అదేం?"
"అతను అహంకారిట ,అకతన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం. అతనికి ఉమెన్ వీక్ నెస్ ఉందట. నువ్వయితే నే అతని రహస్యాలు ఛేదించగలవు" అన్నారు.
"ఆ ఊరు వెళ్ళాను ఆ ఇంటివారి చరిత్ర సేకరించటానికి ఆ అన్నాతమ్ములతో స్నేహం నటించాను."
"ఓన్లి యాక్టింగ్ అంటావు..." వెటకారం చేసాడు సురేంద్ర.
"నువ్వెంత వెటకారం చేసినా నిజం అంతే. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మధుమూర్తి తమ్ముడు సిద్దార్థ అతనికి వాళ్ళు చేసే వ్యాపారం తెలియదు. అతని చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని తమ అంతస్తుకు తగడని, వారు చంపించారు. అతను ఆ చంపిన వ్యక్తికోసం వెతుకున్నాడు. అలా ఇద్దరం స్నేహితులం అయ్యాము."
"స్నేహమేనంటావు?"
శ్వేతకు మండిపోయింది. ఛీ,యెంత చదివిన్నా,ఎన్ని దేశాలు తిరిగినా, తను ఏదయినా ,చెయ్యవచ్చు. ఎదుటివారు తనకోసం పవిత్రంగా ఉండాలనుకునే "మగ" అహంకరానికి ఆమెకు మండిపోయింది. తను అఫేర్స్ ఏర్పరుచుకోవచ్చునట. అది రైలు ప్రయాణంలాంటిదట. కాని తను వృత్తిపరం గాకూడా ఎవరితో చనువుగా ఉండకూడదట. ఇదెక్కడి న్యాయం?
"ఇతని విషయం నాతో ఎందుకు చెప్పలేదు?"
"ఎందుకు చెప్పాలి!" అని నిలదీసి అడుగుదాం అనుకుంది. కాని అడగలేకపోయింది. తన గురించి అందరికి తెలిసి పోయింది. అల్లరి పడటం అంతమంచిది కాదేమో!
"చెప్పాలనే అనుకున్నాను. యెలా చెప్పాలో తెలియక,ఈ అనుబంధాల గురించి, అఫేర్స్ గురించి, మీ అభిప్రాయం ఏమిటో కనుక్కుందాం. అనుకుంటుండగానే ఆరాత్రి మీరు ఫోన్ చేశారు. నేను అఫేర్స్ గురించి అడిగితే మీరు పర్సనల్ గా తీసుకుని, నాకు ఏర్పడిన అఫేర్స్ రైలు స్నేహం లాంటివి మరిచి పొమ్మన్నారు. దాంతో నిజంగా న మీ విశాల హృదయానికి జోహర్లు అర్పించాను......"
" ఓ ఐసీ...." అటు తిరిగిన వాడల్లా ఇటు తిరిగి , మెల్లగా వచ్చి ఆమె భుజాలు పట్టుకుని ఊపాడు.
