Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 94


    "బాలూ! చాలు, వెళ్దాం పద." అన్నాడు సిద్దార్థ వెనుతిరిగుతూ.
 
    ముగ్గురూ హోల్లోకి వచ్చారు.

    బాలు  నవ్వాడు చిద్విలాసంగా.

    " అంత కలవర వడతావేంరా! డబ్బు అర్జించటం అన్నది ఒక్కటే తపన! దాన్ని సాధించే మార్గాలు వేరు, వేరుగావచ్చి, మీ అన్న డైరెక్టుగా మా నాన్న ను , ఆ శ్రీనివాస్ ను మర్డర్ చేయించి, చట్టం చేతులలో చిక్కుకున్నాడు. మమ్మల్ని ఏ చట్టం  ఏన్యాయం శిక్షించదు. అర్థం అయిందా!" అన్నాడు.

    బాలు అన్నదానికి ఏం జవాబు చెప్పలేదు.

    "మేం మంత్రం వేస్తుంటే ఆ వ్యక్తి యెలా బాధ పడతాడో చూపించేవారం కాని, ఇప్పుడుకాదు,ధైర్యం ఉంటే అమావాస్యనాడుస్మశాన వాటి కకురా." అన్నాడు.

    "సిద్దూ!వెళ్దాం పదరా! నాకేదో  వణుకు వచ్చినట్టు అవుతుంది." రాంబాబు సిద్దార్థను లాగాడు.

    సిద్దార్థ లేచాడు.

    "నా హెచ్చరిక గుర్తుందికద" అన్నాడు బాలు.

    సిద్దార్థ నవ్వి...జవాబు చెప్పక చెయ్యూపాడు.

    "ఒరేయ్ నాయినా చెప్పరా... చెప్పు హెచ్చరిక గుర్తుంది నీ జోలికి రామని చెప్పు...." జ్వరం వచ్చినాడిలా వణికి పోసాగాడు.రాంబాబు

    "ఛ!నీలాంటి పిరికి వారున్నారనే వారి మత్రాలు తంత్రాలు సాగుతున్నాయి"అన్నాడు.

    "మంత్రశక్తులున్నాయని నమ్మటం లేదా!"

    "లేదు."

    " మరి బాలు హంగూ-"

    " చెబుతాను పదా-" ఇద్దరూ మేన్ రోడ్డు పైకి వచ్చారు. అప్పుడు తేలికగా ఊపిరి పీల్చాడు రాంబాబు

    "అబ్బ!నా ప్రాణం పోతున్నట్టుందిరా."

    "అదే అలుసుగా తీసుకుని వాళ్ళు వనల్ని ఆడిస్తున్నారు." అన్నాడు సిద్దార్థ అలోచనలు పరి, విధాలుగా పోతున్నాయి. వాళ్ళు చంపదలచిన వ్యక్తిని బలహీనపరుస్తున్నారో తెలుసుకోవాలి అదే అతని ధ్యేయం అతను దృఢనిశ్చయంతో ఇంటిదారి పట్టాడు.


                                                                     25


    సురేంద్ర ఫోటోలవంక పరిశీలనగా చూచాడు. ఒక యువతి  యువకుడు అతి సన్నిహితంగా కూర్చున్నదోఫోటో.ఒకరి చేతిలో, మరొకరి చేయి ఉంది. ఏం గుర్తుకు వచ్చిందో ఇద్దరూ నవ్వుతున్నారు.  ఆయువకుడి పళ్ళు టూత్ ఫేస్ట్ అడ్వటైజ్ మెంట్ కు నిల్చున్నట్టున్నాయి. మరో ఫోటోలో అతని భుజంపై ఆమె తలవాల్చింది.   

     ఆ యువతి శ్వేత అని గుర్తించే సరికి అతని హృదయం భగ్గుమన్నది.

    అలాగే కూర్చుని సిగరెట్టు వెలిగించాడు.

    అరగంట అలాగే కూర్చున్నాడు. చూచిన ఫోటోలే, మళ్ళీ,మళ్ళీ చూడసాగేడు.

    "హాయ్ సురేంద్రా!" శ్వేత వచ్చింది.

    అతను ఎప్పటిలా లేవలేదు. సంతోషంగా ఎదురు రాలేదు.

    "ఏమిటి? షాపింగ్, షాపింగ్ అని ఫోన్ చేసి ఇంత నిశ్చితంగా తీరికగా కూర్చున్నావు?"

    అతను నవ్వులోఅదే నిష్కపటం, స్వచ్చత కనిపించింది.

    "కొత్తగా కనిపిస్తున్నానా?"

    "నో..." అన్నాడు పొడిగా.

    అప్పుడు అతని చేతిలోని బ్రౌన్ కవరు చూచింది శ్వేత.

    "ఏమిటిది!" అన్నది.

    అతను ఆమెకు మౌనంగా అందించాడు

    "అబ్బ!ఇన్ని సిగరెట్లు తగలెయ్యకపోతేనేం? కొంపంతా కంపేఅంటూ కవరు అందుకుని , ఫోటోలు తీసింది.

    ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది.

    యెక్కడివి అని అడగబోయి; మాట మింగేసింది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS