Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 93


    "అ ఫెన్స్ , డి ఫెన్స్గేమ్స్ నువ్వే ఆడుతూ నాకు చెప్పటంఅర్థలేని విషయం" అన్నాడు సిద్దార్థ.

    " నిన్ను నేను గౌరవిస్తాను. అందుకే  హెచ్చరిక .నా స్నేహితుడు ప్రియమిత్రుడు నాచేతిలో మరణించటం ఇష్టంలేదు."అన్నాడు.

    ముగ్గురూ,మెట్లు దిగి భుగృహంలా ఉన్న ఇంటి క్రింది భాగంలోకి వెళ్ళారు.

    అక్కడ ఓపాతికమంది యువకుల వరకున్నారువారు కల్లు, నాటుసారా,ఫారిన్ విస్కీ త్రాగుతున్నారు.

    "సురా- చెప్పండయా!" అంటూ ఓ యువకుడు అరిచాడు.

    "ఇదిగో నాకు రాధా...." అంటుండగానే మరో యువకుడు అందుకున్నాడు.

    సురా గంగా సురా సింధు! సురాదేవి సరస్వతీ.

    సురా గోదావరీ,   రేవాసురై పరమం పదం.

    " వీళ్ళంతా యెవరు!"

    "నా విద్యార్థులు!"

    "అంతగా త్రాగారే?"

    " దానికి అర్థం అతను శ్లోకంలో చెప్పాడు...."

    "నాకు అర్థం కాలేదు."

    "సుర  అంటే మద్యము , దాని ప్రశస్తి చెప్పాం. సురాపానము చేయనిదే మంత్రశక్తి పొందటానికి తగరు  అని అర్థం." అన్నాడు

    " మంత్రశక్తి సాధించాలంటే త్రాగాలా!"

    "అవును . సురాపానము చేయని వాడు దైవత్వం పొందలేడు.ఈ మత్రగాళ్ళల్లో రెండురకాల వారున్నారు. దీక్షా, ఉపవాసాలతో నేర్చుకునే వారు- మరొక రకం వారు సురాపానము, మాంసభక్షణము చేసి, మగువలగూడి దీక్ష సాగిస్తారు."అన్నాడు.

    సిద్దార్థ వింటున్నాడు.

    "అలనాడు క్షీరసాగర మధనం సాగించి ,అదొక పవిత్రమయిన క్రతువు క్రింద భావించి , రాక్షసులను మోసగించి ,మోహినీ కృపవల్ల అమృతం  సేవించిన వారు దక్షుణా చారులయ్యారు. సురసేవించినవారు వామాచారారులు అయ్యారు"

    "ఈ రకమయిన దీక్ష సాగించిన వారు రాక్షసులని అర్థం కదా." అన్నాడు రాంబాబు.

    "అంటరానివారు, అట్టడుగున ఉన్నవాడని ఇప్పుడు వెసినట్టే వారిపై ఓ ముద్ర  వేసారు. రాక్షసుల మనుషులు కారా!" అన్నాడు కోపంగా బాలు.

    సిద్దార్థ పరీక్షగాచూచాడు.

    ఆ త్రాగేవారిలో స్త్ర్రీలు కూడా ఉన్నారు. వారు  లుంగీ పంచెల్లా ధరించిన  బట్టలవల్ల , గుర్తించలేకపోయాడు. వారిని దాటి వెళ్ళగానే పెద్ద హాలు దాంట్లో పెద్దవిగ్రహము ఉన్నాయి.

    "ఇన్ని హంగులు వీడు ఎప్పుడు సమకూర్చుకున్నాడు!" అని ఆశ్చర్యపోవటం సిద్దార్థ వంతు అయింది.

    "చండిక- పరమేశ్వరుడి అర్థభాగం...."అన్నాడు బాలు.

    "మీరు త్రాగి పూజ చేస్తారా!"

    "మద్యమాంసాలు సేవించి, చడికను సేవించాలి అది రూలు. మద్యము పడనినాడు గంజాయి, భంగు సేవించాలి , మత్తు మగువ పొత్తులేని పూజ వ్యర్థము." అతనిమాట పూర్తికాకముందే ,త్రాగి శ్లోకాలు వల్లిస్తున్న స్త్ర్రీ పురుషులు, చండిక విగ్రహము ముందు ఒకరిని,ఒకరు పెనవేసుకుపోయి,ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోసాగారు.

    "మైధునం లేనిదే పూజ పరిసమాప్తి కాదు." అన్నాడు.

    " ఓహో!ఇలాంటి మంత్రతం త్రాలను ఆధారం చేసుకునే రజనీష్ ఆశ్రమము వెలిసిందన్న మాట" అన్నాడు అప్రయత్నంగా సిద్దార్థ.

    "నీ సిద్దాంతాలు, తార్కికాలు కట్టిపెట్టు సిద్దూ! వెళ్దాం పద, నాకేదో వికారంగా ఉంది." అన్నాడు రాంబాబు.

    నిజమే సిద్దార్థకు ఒక రకమైన వికారం కల్గింది. పాతికేళ్ళు వచ్చి, సెక్స్ అనుభవం కలుగలేదా అని అశ్చర్యపోతే అది వేరే విషయం.

    "స్వేచ్ఛగా స్త్ర్రీ పురుషులు కలిసి ఆనందించటమే భైరవపూజ అంటూరు...." ఇంకా ఏదో చెప్పబోయాడు బాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS