Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 92

    "పుస్తకాలలో రాసి ఉంది. అంతమాత్రాన అది నమ్మి.ఆచరించాలని ఏం లేదు" అన్నాడు.

    "మరి గ్రంధాలు లైబ్రరీలో పెట్టుకోవటానికా! సమస్తశాస్త్ర్ర ములలోకెల్ల మంత్ర శాస్త్ర్రము శ్రేష్టమయినది"అన్నాడు.

    అతను తన శ్రావ్యమైన కంఠంతో శ్లోకం చదివాడు.

    విష్ణుర్వరిష్ఠో దేవానాం  వ్రాదానామముదధి స్తధా
    నదీ  నాంచయధాగంగా పర్వతానాం, హియాలపయః
    అశ్వత్థః  సర్వవృక్షాణాం రాజామంద్రాయధావరః
    దేవీ నాంచయధా దుర్గా వర్ణనాం బ్రాహ్మణోయధా
    తథా సమస్తశాస్త్ర్రాణాం తంత్రశాస్త్ర్ర మనత్తమం
    సర్వ కామ ప్రదం, పుణ్యం, తంత్రం వై వేన నమ్మితం"

    "ఒరేయ్ నాయనా! ఆపరా" రాంబాబు చెవులు మూసుకున్నాడు. తెలుగుక్లాసులో మాష్టారు పాఠాలు చెబుతుంటే అతను చేసే హంగామా గుర్తుకువచ్చి,ఇద్దరూ పక్కున నవ్వారు. పడీ,పడీ నవ్వారు రెండు నిమిషాల తర్వాత సిద్దార్థ ఆలోచనలో పడిపోయాడు.

    ఏమిట్రా!"

    "ఏం లేదురా!ఒక్క సారి ఇంటర్ చదివే విద్యార్ధులమయిపోతే ఎంత బావుండును అనిపిస్తుంది." అన్నాడు.
   
    ఆ మాటతోపాటు ముగ్గురూ ఒక్క క్షణం వాస్తవం వదిలి అవలౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోయారు.

    ఒకరికి తెలియకుండా ఒకరి టిఫిన్  డబ్బాలలోని ఆహార పదార్థాలు ఖాళీచేయటం ఒక హాబీ!

    అందరూ కలిసి,   రోడ్డుమీద కనిపించని అమ్మాయిలకు పేరు పెట్టుటంలో,ఒక థ్రిల్ అనుభవించేవారు.

    అందరూ కలిసి చెరువు గట్టున కూర్చుని, ఏ కధానాయిక సినిమా బావుంటుది, ఏ కధాయకుడి సినిమా చెత్తగా ఉంటుంది. అని చర్చించుకోవటంలో ఒక ఆనందం ఉండేది.   

    వేరు సెనగకాయలు, బఠాణీలు కొనుక్కుని వారిని ఏడ్పించి  డబ్బు లివ్వటంలో ఓ చక్కిలిగింత ఉండేది.

    " ఆ శ్లోకానికి ఆర్థంకూడా నువ్వేచెప్పు" అన్నాడు సిద్దార్థ.

    "ఒరేయ్ సింపుల్ గా చెప్పరా, గ్రామర్ వదిలెయ్యి." అన్నాడు రాంబాబు దిగులుగా.

    " దేవతల్లో విష్ణువువలె, హృదయములో  సముద్రమువలె, నదులలో గంగవలె, కొండలలో హిమవంతములె, చెట్లలో రావివలె, రాజులలో ఇంద్రునివలె, దేవతలలో దుర్గవలె, పర్ణములలో బ్రాహ్మణునివలె , సమస్తశాస్త్ర్రములో మంత్రశాస్త్ర్రాము గొప్పది." అన్నాడు బాలరాజు.   

    సిద్దార్థ అతన్ని కళ్ళు పెద్దవిచేసి చూచాడు. యెంత యెదిగి పోయాడు.అది మంచివైపు అయితే సంతోషించేవాడు.

    "దీనివల్ల ఒరిగేది ఏముంది?" 

    " మనిషిని ఎన్నో కోరికలుంటాయి కోరికలు తీరటానికి ఈ మంత్రశక్తి ఉపయోగపడుతుంది."

    "మంత్ర శక్తి వల్ల సాధించటం సాధ్యం అంటావా!"  రాంబాబు అడిగాడు.

    బాల రాజు పెద్దగా నవ్వాడు.

    అతని వాలకం చూస్తే కోపం వచ్చింది.

    "ఎందుకురా ఆ నవ్వు?" రాంబాబు అడిగాడు.

    "నీ అమాయకత్వం గాని, వాడి హంగులు చూచి కూడా సాధించావా అని అడగటం మూర్ఖత్వం" అన్నాడు సిద్దార్థ.
    రాంబాబు మాట్లాడలేదు.

    "నా శ్లోకాలు వినే  దిమ్మెత్తిపోయావు. దాదాపు డెబ్బయి,ఎనభై గ్రంధాలున్నాయి భైరవ, లలిత యోగ అంటఅవన్నీ చదువు. వేదం తరువాత మనుస్మృతులులాంటివి వస్తాయి.ఆ తరువాత శాస్త్ర్రంలో మంత్ర శాస్త్ర్రానికి  ప్రాముఖ్యత ఉన్నది."అన్నాడు

    "అలాగా-" అన్నాడు సిద్దార్థ శాంతంగా.

    "బాలుగాడి వలలో పడిపోతున్నాడు" అనుకున్నాడు రాంబాబు.

    "మీ కింకా చూడాలనిఉంటే రండి అక్కడ నా విద్యార్థులున్నారు." అన్నాడు బాలరాజు.

    "పద...." అన్నాడు సిద్దార్థ.

    "ఒక్క విషయం సిద్దూ! నిన్ను నాక్లాసుమేటు సిద్దార్థగా అభిమానించి అన్నీ చూపుతున్నాను. నీవు పోలీసులకు; బయటివారికి వెల్లడిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి" అన్నాడు హెచ్చరికగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS