Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 91

    "వీడికింత డబ్బెలా వచ్చింది?" అన్నాడు సిద్దార్థ.

    "వీడు చేతబడి చేస్తాడు , దాన్ని వీడి బంధువు బాగుచేస్తాడు వేలకు వేలు గుండుతారు. "అన్నాడు రాంబాబు!

    "అంత మూర్ఖులు యెవర్రా ! వీళ్ళ  మాటలు నమ్ముతారా!"

    "సిద్దూ! నేనొకటి చెప్పనా! ఈనాడు నువ్వుశాస్త్ర్రం , విజ్ఞానం, అంటూ ఎంత చెప్పినా వాళ్ళ బుర్రకు ఎక్కదు."అన్నాడు రాంబాబు

    "దీవి కంతకు అవిద్యే కారణం అంటాను." 

    "విద్యావంతులు ఏం తక్కువ తిన్నారు. 'బాబాలు' 'అమ్మలు' అంటూ పరగెడతారు. ఈ నాడు బ్రతుకాలంటే పని చెయ్యనక్కర్లేదురా. హాయిగా ఓ కుటీరం నిర్మించుకుని, నల్గురి శిషుల్ని చేర్చుకుని , నాల్గుమాటలు చెప్పగల్గితే అదే చాలు." అన్నాడు.

    "అవును నిరుదోగ్యలు తమ ఉద్యోగాల కోసం అవతరాలు  ఎత్తుతున్నారేమో." అన్నాడు.

     అరగంట  నిలబడినా, గేటు తీయడానికి యెవరూ రాలేదు. గేటుకు లోపలినుండి తాళం ఉంది.

    "యెట్లా వెళ్ళేది."

    " చేతులు నొప్పి పుట్టేవరకు కొట్టేరు.యెవరూ రాలేదు.

    గోడ దూకితే ట్రెస్ పాస్ అవుతుంది.

    వారు ఆలోచిస్తుండగానే లోపలినుండి, ఒకవ్యక్తి గడ్డంతో, పైజమా లాల్చి వేసుకుని భుజాల చుట్టూ శాలువా కప్పుకుని, వెంట ఇద్దరు మనుష్యులు రాగావచ్చాడు.

    "వస్తాం బాబుగారూ...." వాళ్ళు మనస్కరించారు. లోపలినుండి ఓ కుర్రావాడు పరుగు, పరుగున వచ్చి తాళం తీసాడూు. వాళ్ళు వెళ్ళి పోయారు. బాలరాజు వీళ్ళిద్దరిని చూచాడు.

    "  అరే మీరా.... రండి.... రండి....." ఆహ్వానించాడు.

    ఇద్దరు అతని వేనుకే లోపలికి వెళ్ళారు.

    అతని  ఇల్లు, హంగామా చూచాక మతిపోయింది. తను చెప్పింది సాధించగలిగాడు.

    "ఏమిటిసిద్దూ అలా చూస్తూన్నావ్!"

    " నీ ఆర్భాటన్ని,ఐశ్వర్యాన్ని...."అన్నాడు.

    మహాజ్ఞానిలా, యోగిలా నవ్వాడు  అతను శాలువా సవరించుకున్నాడు.

    " రండి కూర్చోండి" ఆహ్వానించాడు.

    ఇద్దరూ కూర్చున్నారు.

    "కాఫీ,టీ ఏం తీసుకుంటారు?"

    " నీ ఇష్టం ఏదిచ్చినా తీసుకుంటాము." అన్నాడు సిద్దార్థ.

    బాలరాజు చెప్పక పూర్వమే , కాఫీ వచ్చింది. ఇద్దరూ తీసుకున్నారు.

    "ఏమిట్రా ఇలా వచ్చేవు?"

    "నిన్ను చూచిపోదామని వచ్చాను."

    " యెదుకురా అబద్ధం ఆడతావు! నా మంత్రశక్తులను గురించి తెలుసుకుందామని వచ్చావు కదూ! మంత్ర శక్తులున్నాయి. నీకు నాకు తెలియని ఓ అలౌకిక ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. పురుషార్థాలయిన ధర్మర్థ, కామమోక్షాలను సాధించటానికి, లౌకిక,అలౌకిక మార్గాలు చాలా ఉన్నాయిరా. తపస్సు ఒక సాధనే కాని అది అందిరికి సాధ్యం కాదు. అందుకే దగ్గర మార్గమే మంత్రశక్తి."

    " సిద్దార్థ జవాబు చెప్పలేదు, నవ్వేశాడు.

    "నా మాటలకు నవ్వు వస్తుందా!"

    "నువ్వుతోపాటు జాలి కల్గుతోంది. .అందమయిన చందమామ దేవతల కోవలో చేర్చిన మీ నమ్మకాలను చిత్తుచేస్తూ , మానవుడు చంద్రమండలం  ఒక గ్రహమని , దానిపైకి వెళ్ళివస్తుంటే, ఇంకా ఈ నమ్మకాలేమిట్రా!"

    "అదే ప్రకృతిలోని రహస్యం. విభిన్నమయిన రెండు కార్యాలు ఎప్పుడూ తలపడుతూ ఉంటాయి. అది నా లైబ్రరరీ! అక్కడ, దేశ విదేశాల నుండి మాంత్రిక శక్తులను సంబందించిన పుస్తకాలు తెప్పించారు" అన్నాడు యెదుట కనిపించే చిన్న గది చూపిస్తూ దానిలో అందమైన షెల్ఫ్ లున్నాయి. వాటిలో ఎఱ్ఱబౌండు పుస్తకాలు అమర్చిఉన్నాయి.

    "ప్రతి పుస్తకం ఓ విజ్ఞాన ఖనిరా. మొలికలు, హోమద్రవ్యాలు, మంత్రపీఠం, తర్పణ వస్తువులు, వాటిని ఉపయోగించే విదానాలు అన్నీ ఉన్నాయి."అన్నాడు.

    సిద్దార్థ లేచి వెళ్ళి కొన్ని గ్రంధాలు తిరగవేసాడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS