Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 90


    "అది నేను ఊహించి చెప్పలేను. ఆ మంత్రగాళ్ళను పట్టి బంధించటంలో సహకరిస్తే ఆ విషయాలు తెలుస్తాయి"అన్నాడు.

    "ఏమో !మాకు భయం..."

    " అదిగో !అదే మనిషిలో ఉన్న భయమే పెద్ద దయ్యం. ఆ భయాన్ని దూరం  నెట్టండి ఏ కార్యక్రమమయినా క్రమ పద్దతిలో చేయాలి సిద్దార్థ వంటి యువకులు మీకు సహకరిస్తారు.మరొక్కసారి మీ నీటి బావులను  పరీక్ష చేయిస్తాను."అన్నాడు.
   
    అందరూ చప్పట్లు కొట్టారు.

    మొదటిరోజు, మందు తీసుకోవటానికి నిరాకరించిన వారంతా ఆస్పత్రికివెళ్ళారు. సర్పంచి, కలెక్టరుకు టీపార్టీ ఇచ్చాడు

    "కలక్టరుగారూ! బాలరాజు విషయం ఏమాలోచించారు?"

    "అతను రంగంలోకి రాలేదు. ఏ ఆధారంతో వెళ్దాం అంటారు!"అన్నాడు ఆయన  టీ సిప్ చేస్తూ.

    "నా క్లాసుమేటు స్నేహితుడు అలా వెళ్దాం."

    "బావుందిగాని నేను రావటం సమంజసంగా ఉండదు. మీరు  వెళ్ళండి"అన్నాడు.

    అతడిని సాగనంపారు అందరూ.

    "నా మాట విను బాబూ! ఆ బాలరాజు ఇంటికి వెళ్ళినవారు రక్తం కక్కుకు చచ్చిపోతున్నారట."

    'నీళ్ళు కలుషితం యెవరు చేసారో విన్నాక కూడా మీరు అలాంటి విషయాలను నమ్ముతున్నారంటే విచారంగా ఉంది."అన్నాడు.

    అతను కాసేపు భరత్ తో ఆడుకుని, తండ్రిని చూడాలని వెళ్ళాడు. ఆయన లేచి తిరగకల్గుతున్నాడు.

    "రాధిక రాలేదా అమ్మా?"

    "ఫైనలియర్ పరీక్షలు! రావటం, వెళ్ళటం నలిగిపోతుందనిక్కడే హాస్టల్లో గెస్టుగా ఉంటున్నది "అన్నదితల్లి.

    "మంచిపని చేసావ్. రాధిక నాకు పరాయిదా, మనిషి గా పుట్టినాక ప్రక్కవాడి సమస్యకు స్పందించలేకపోతే యెలా!"అన్నాడు.

    ఆమె భోజనం పెట్టింది.

    "ఇంకా ఎన్నాళ్ళురా అమ్మ, నాన్నలపై కోపం!"

    "నాకు నేనుగా వెళ్ళలే్దు. నాన్న పొమ్మన్నారు,ఆయనరమ్మంటే  తప్పక వస్తాను." అన్నాడు.

    "ఆయనకు మనసులో ఉన్నది కాని. నువ్వు ఏమంటావో అని అనలేకపోతున్నారు."

    "అననీ. అదికాక ఇప్పుడు నన్ను రమ్మంటే భరత్ కు ఆశ్రయం ఇవ్వాలి."

    "భరత్ యెవరు?"

    "అదే అన్నయ్య కొడుకు."

    " సిద్దూ..." ఆమె ముఖాన రంగులు మారిపోయాయి.

    అనుభూతలకన్నా,అనుభంధాలకన్నా , ప్రాణంలేని స్పందనలేని బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు మధుమూర్తి ఒకే ఉద్దేశంతో ఇద్దరు స్త్ర్రీలతో కాపురం చేస్తాడు.

    ఒకరు చట్ట సమ్మతంగా వారసులు. మరొకరు చట్టానికి వ్యతిరేకులు. అతను గంభీరంగా మారిపోయాడు.

    "మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానురా." అన్నదామె ఆవేదనగా.   

    " నాన్నగారికి నచ్చచెప్పరాదూ!" అన్నాడు.

    "నాకంత ధైర్యం ఉంటే బావుండేదిరా నాయనా"అన్నది ఆమె నిట్టూర్చి, అతను నవ్వాడు.

    "పెద్ద చెట్టు  నీడలో మొక్కలు  ఎదగవు.ఇదొకరకంగా మంచికే  అయిందమ్మా. ప్రపంచం తెలుస్తుంది. యెంతదూరం వెళ్ళాను?" అని ఓదార్చాడు.అతని దృష్టీ అంతా బాలరాజు పైనే కేంద్రీకృతం అయిఉండి    

   
                                                                       24


     రెండు రోజుల తరువాత రాంబాబును తీసుకుని, బాలరాజు ఇంటికి వెళ్ళాడు.

    ఊరవతల పోరంబోకు , కంచె,బిదలకు ప్రభుత్వం వారుఇచ్చారు.అదిసాగు చెయ్యలేక ,ఊరిమీద పాలమ్ముకుని బ్రతికే జంగయ్యకు పూట గడవటమే గగనమని అందరికి తెలుసు, మరలాంటిదిఆ స్థలంలో చక్కని బంగళా కట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS