"ఏం వ్రాశార్రా? రెట్టించిన కోపంతో అరిచారు రంగనాధం.
"భర్తతో కాపురం చేసే భార్యకూ ఏవిట్రాస్తారు?....ఎందుకు నాన్నా ఆవేశపడతారు.....ఆమె మనవాళ్ళతో స్వేచ్చగా తిరుగుతుంది. మాట్లాడుతుంది. నా మాట నూటికి నూరుపాళ్ళూ నెగ్గుతుంది. ఆమె కులట అంటాను. అలా ఋజువు చేసి ఆమె నడవడి అనుమానాస్పదమైనదని చాలా మంది చేత చెప్పిస్తాను. నేనే విడాకులిచ్చి మళ్ళీ మళ్ళీ చేసుకుని హాయిగా బ్రతుకుతాను.....హబ్బ. నన్ను బ్రతక నీయండి నాన్నా?.....దాన్ని వదిలించుకుని.... ఒంటరిగా హాయిగా గాలి పీల్చాలని ఉంద...... ఏమున్నా ఏం లేక పోయిన బ్రతుకులో....అది నాకు వదిలిపోతే చాలు..... ఏను మరి భార్యగా తనను భరించలేను...... నాన్నా భరించలేను" బాధగా తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు.
నాలుగు క్షణాల మౌనం తర్వాత...." నెల తప్పిందో... లేదో.... ఏం పాడో డాక్టరుకు చూపిస్తానుండు ఆమెను" మెరుపులో ఏదో ఉపాయం తట్టిన రంగనాధం నెమ్మదిగా అని కొడుకు జవాబు అంగీకారం వినకుండానే తన గది కెళ్ళిపోయారు.
* * *
ఉదయం కాఫీ తెహ్చ్సిన జానకమ్మను..... నా న్నేరీ? అడిగాడు శ్రీనివాసరావు.
"అక్కయ్య గారింటి కెళ్ళానని చెప్పమన్నాడు"
"ఓ చెప్పమన్నారా? అంటూ అదోలా నవ్వి, "కోడలి దగ్గరి కెళ్ళుంటార్లే......వెళ్ళనీ...మోజు పడి చేశారుగా ఆఖరిసారి చూసి మాట్లాడి వస్తారు" అన్నాడు శ్రీనివాసరావు.
"బాబూ నిజంగా ఆ అమ్మాయి అంత అప్రతిష్ట పని చేసిందంటావా?"
తల్లి ప్రశ్నకి సమాధానం చెప్పబోతూ తలెత్తిన శ్రీనివారావు "రా శాంతా......అమ్మ ఇంట్లోనే ఉంది? అన్నాడు చనువుగా.
బిడియంగా లోపలికొస్తూ "ఎందుకో రమ్మన్నారట...." అంది శాంత జానకమ్మ వైపు చూస్తూ.
"నా తల్లీ.... వచ్చావు. అప్పడాలు నాలుగు చేద్దామని పిండి కలిపాను. నిన్న మధ్యాహ్నం ఆరకపోతాయా అని ఇంతలో కోడలు రావడం......"
"ఇచ్చెయ్యండత్తయ్యా ఇంటికి తీసుకు వెళ్ళి అమ్మా నేనూ కూడా వత్తుతాం. ఎండపెట్టి తెచ్చి ఇస్తాను."
"అబ్బాయి ఉన్నాడని కాబోలు మొహమాటం. మనలో మనకి అలాటి బిడియాలేమిటమ్మా రా కూర్చో" అంటూ పీట వాల్చింది జానకమ్మ.
ఓరగా బొద్దుగా పచ్చగా ఉన్న ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్న శ్రీనివాసరావు ఒక్కసారి బరువుగా కనురెప్పలెత్తి ఆమె అతనివైపు చూడగానే చప్పున చూపులు తిప్పుకున్నాడు.
అతని అందాన్ని చూసిన ఆమె చలించింది క్షణం మరొక్కసారి చూడాలని మెల్లగా తఃలెత్తి అటువైపు చూసింది. అతనప్పటికే వెళ్ళి పోయాడు.
* * *
నీర్సంగా సర్వం కోల్పోయిన పేదలా దీనంగా ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న రమ. "అమ్మాయ్" అన్న రంగనాధం పిలుపు విని ఉలిక్కిపడి లేచి నిల్చుంది. ఆమె హృదయంలో ఏదో ఆశావీచిక కదిలింది. మోడె పోయిందనుకున్న తన జీవితం చిగిర్చి పుష్పించి ఫలించి శోభించినట్టు ఆమె వదనంలో ఆనంద లేఖలు విరిశాయి. గబగబా చీర చెంగుతో మొహం తుడుచుకుంది "రండి మామగారూ" అంది.
తాను కూర్చుంటూ, "కూర్చో అమ్మా" అన్నాడు రంగనాధం. అతని ఎదురుగా మంచం పట్టిమీద కూచుంది రమ.
కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్దం. ప్రవాహంలా ఉరకబోయే ఎన్నో మాటల కానకట్టగా సంబాషణ సారాంశం ఎలా ఉంటుందో అన్న దిగులుతో మౌనం రాజ్యం చేసింది.
"మరేం అనుకోకు... అబ్బాయి అంటున్న మాట." అంటూ తడబాటుగా కోడలివైపు చూశారు రంగనాధం.
"ఏమిటా మాట?.....కటువుగా ధ్వనించింది రమ గొంతు.
"తల్లీ, తండ్రీ, తోబుట్టువులూ ఎవ్వరూ లేని నీకు నే తండ్రి లాటి వాణ్ణి తల్లీ....వాణ్ణి ఒప్పించలేను నువ్వన్నా నేను చెప్పినమాటవిని ఎవరన్నా డాక్టర్ని సంప్రదించి అది లేదనిపించుకుంటే కాని...." అంటూ రమవైపు చూశారు రంగనాధం.
నిరసనగా నవ్వింది రమ......"ఇదా మీరిచ్చే సలహా, క్షమించండి. మరొకసారి దయచేసి ఆ మాట అనకండి పెళ్ళయ్యాక నాకు ఏమైనా తృప్తి సంతోషం కలిగిందంటే కారణం...నాకు పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలు. మీ అబ్బాయి కాదన్నా మీరు కాదన్నా..... ధర్మ విరుద్ధమైనది కాదు నా బిడ్డ నాకు తెల్సు. భగవంతునికి తెల్సు..... బహుశ మీ అబ్బాయికీ నిజం తెల్సు కాని నన్ను విడిచి పెట్టాలనే సంకల్పం ఇలాటి ఘోరమైన మాట అనిపించింది పోన్లెండి ఆయన ఇష్టమే నా ఇష్టం దక్షిణ ఉత్తర ధృవాలకున్నంత దూరం మా యిద్దరి అభిరుచులకీ ఒకర్ని ఒకరు అనుకరిస్తూ బ్రతకలేం. నరక సదృశమైన మా దాంపత్యం విచ్చిన్నమైనందువల్ల ఏ ఒక్కరం నష్టపోం..... మళ్ళీ మంచి అమ్మాయిని. ఆయనకు నచ్చిన అందమైన అమ్మాయివి.....పతివ్రతలా ఆయన మాట అక్షరాలా పాటించే సాధ్విని పెళ్ళి చేసుకు హాయిగా బ్రతకమనండి. ఏనాడూ పూలకీ చీరలకీ. విని మాలకీ డబ్బడగని ఈ భార్యను....ఈ భార్యతో అనుబందాన్ని మరచిపొమ్మనండి నా మీదపగ తీర్చుకున్నారు కనుక పరమాన్నం తినమనండి. "అంటూ చప్పున కళ్ళు మూసుకున్న ఆమె కనుకొలకుల నుంచి బొట బొటా నీళ్ళు కారాయి.
కళ్ళు వత్తుకు లేచి నుంచుంటూ. "క్షణ క్షణం నన్ను కాల్చుకుతినే ఆ భర్ర్హతో కాపురం కోసం నా రక్తం మాంసం జీవితంలో జీవం.......అబ్బ.....నేను వినలేను అలా ఊహించలేను నా జీవనాధారం ఉద్యోగముంది. నా కానందాన్నివ్వటానికి ఓ బిడ్డ పుడుతుంది చాలు తృప్తిగా హాయిగా జెవెఇథమ్ గడపగలను విడాకులు వ్రాసి పంపిస్తానని చెప్పండి ఆయన కోరిన విధంగా వ్రాసి ఇస్తానని చెప్పండి నా జీవితాన్ని. నా హృదయంలో నిప్పులుపోసి నన్ను.....నన్ను.....అన్యాయమైన మాటలని లోకంలో విడిచిపెట్టారు మీ అబ్బాయి. మీ రన్నా న్యాయంమాట్లాడేరా? ఎందుకు నేను భ్రూణహత్య చెయ్యాలి......చెప్పండి శవాలు.....మీకు కొడుకు మీదాకొడుకు మాటమీదా నమ్మకముండవచ్చు. కాని అతని భార్యగా మీ ఇంటి కోడలిగా నా తరఫున ఏమైనా ఆలోచించారా? దిక్కులేని దాన్నని నాకెవ్వరూ నా తరఫున మీతో తగవులు తెచ్చేవారు లేరని నిందమోసి ఇంటి నుంచి తరిమేస్తారా?"
"నన్నేం చెయ్యమన్నావమ్మా? ఎన్నో విధాల మందలించాను వాణ్ణి ఏడ్చాను ఇంటి పరువు బజారున పెట్టొద్దని.....అందుకే నామాట విని...."
"మామగారూ" నిప్పులు కురిసే కళ్ళతో తీక్షణంగా చూస్తూ.
"పుట్టి బుద్దెరిగి నేనెప్పుడూ తప్పుడు పనులు చెయ్యలేదు, నామీద కసి తన బిడ్డమీద తీర్చు కుంటున్నారని తెలియదాయనకు! నా మీద మాత్రం అంత పగ పెంచుకోవలసిన అనవసర మేముంది? ఆయన ఇష్టప్రకారం తిరిగలేక పోయాను నిజమే నా స్వభావమది. ఆయనకు నచ్చని చీరలు కట్టాననీ, ఉద్యోగం మానలేదనీ, నేను మోయలేని నిందమోసి ఘోరంగా విడాకులు వ్రాసి ఇమ్మంటారా? అంతకన్నా.......మీరు మీరంతా కలసి నన్ను చంపెయ్యరాదూ?" దుఃఖంతో గొంతు వణుకుతూంటే నిర్విరామంగా కళ్ళు వర్షిస్తూంటే అంది రమ ఉన్మాదినిలా.
జాలిగా బాధగా ఆమెవైపు చూస్తూ ఏమిటో నాకు ఆయువు మూడింది కాదు ప్చ్.......మీ ఖర్మ...." అంటూ లేచి నిల్చున్నారు రంగనాధం.
"ఇదే సలహా మరొకసారి ఇవ్వక్కర్లేదు. వెళ్ళండి. కొడుక్కి సంబందం చూడండి. బాగా కట్నం తీసుకోండి.....కాని.....కాని ఆమె కళ్ళల్లో దుమ్ముకొట్టి మరొక ఆడదాన్ని అన్యాయం చెయ్యొద్దని మీ అబ్బాయికి చెప్పండి" రోషంగా అని వంట ఇంట్లోకి తప్పుకుంది రమ.
చరచరా వీధిలోకి నడిచాను రంగనాధం బాధగా నిట్టూరుస్తూ.
* * *
భర్తకు విడాకులిచ్చిన రమ లోకానికి లోకువయింది. వ్యంగ్యోక్తులూ, హాస్యాలూ, వార చూపులూ నిర్లక్ష్యంగా రోజులు దొర్లిస్తూన్న రమకు ప్రమోషనుమీద మరొక ఊరు ట్రాన్స్ఫరు చేస్తూ ఆర్డర్సు వచ్చాయి.
ప్రమోషను లేకున్నా ఆమెకు ఆ పరిసరాలు, తను తన భర్తా, కాపురం విడాకులూ, తెలిసిన ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోతూంది ట్రాన్స్ఫరొక దివ్య వరంగా బావించింది.
క్రొత్త ఊరు కొత్త మనుష్యులూ, ఆమెను పరిచయం చేసుకున్న వ్యక్తులు, "మీ వారెక్కడ ఉన్నారు ప్రశ్న, "మిలిట్రీ"లో రమ జవాబు.
ఆమె జీవితం అలా అయినందుకు సానుభూతి. ధైర్య వచనాలూ, ప్రమోషనూ వచ్చి నందుకు అభినందనలూ మిత్రులందరి దగ్గరి నుంచీ రమకు ఉత్తరాలు వచ్చాయి.
నెలలు నిండి రమ సెలవులో ఉంది. ఒక నమ్మకమైన పనిమనిషిని కుదుర్చుకు ఎప్పుడూ తనకు సాయంగా ఉంచేసుకుంది. ఆమెకు చాలా సన్నిహితుడై ఆత్మీయుడుగా ఆనాడు మెసిలిన శ్రీధర్ దగ్గరనుంచి. జానకి పోయిందనే ఉత్తరం వచ్చింది తన ఇంటికి ఆతిధ్యానికొచ్చిన ఆ దంపతులు గుర్తుకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంది రమ. ఏమిటో భగవంతుని విలాసం. బ్రతికున్న వాళ్ళను విడదీసి. ఒకరిని భూమిపై మిగిల్చి ఒకరిని ఎత్తుకుపోయి అలా విడదీసి భూమిపై బతికే జంటలతో ఆడుకుంటాడు కాబోలు! విధి ఎగబాటు కల్పింపించి వారి మనః పరితాపం వినోదంగా వింటాడు కాబోలు ... కడుపులో బిడ్డ కదిలిన ప్రతి క్షణం శ్రీనివాసరావు గుర్తొస్తున్నాడు. నిస్సహాయంగా అతన్ని శపిస్తూంది. తన్ను తాను పోషించుకుని సంఘంలో గౌరవంగా బ్రతకగలననే అహం తనను వెక్కిరిస్తూంటే, పగబట్టిన మగవాడిచేతిలో ఓడిపోయిన అబల రమ.
భార్యపోయి పదిహేను రోజులు కాలేదు రమ ఇంటికి వచ్చాడు శ్రీధర్. ఒకరినొకరు జాలిగా చూసుకుని సానుభూతి వచనాలూ వేదాంత వాక్యాలూ, వల్లించుకున్నారు. అతనిచేత ఆప్యాయతగా కడుపునిండుగా అన్నం తినిపించింది రమ.
ఆ రాత్రి భోజనమైన తర్వాత నా కెవరు న్నారు రమా అమ్మా? నాన్నా? తోబుట్టువులా? నీ దగ్గర మనశ్శాంతి లభిస్తుందని నెలరోజులు సెలవుపెట్టి వచ్చాను నువ్వూ నేనూ కలసి ఓ ఇంట్లో ఉంటే. నలుగురూ ఏమనుకుంటారో? వచ్చాను కాని ఇప్పుడలా అనిపిస్తూంది," అన్నాడు శ్రీధర్.
"ప్చ్.....అనుకోనీ...... లోకాన్ని నేను లక్ష్య పెట్టను. లోకమంటే ఏమిటి శ్రీధర్. మన చట్టూ మన చరిత్ర తెలిసిన వ్యక్తులు ముఖపరిచయమన్నా ఎక్కువగా లేని కొందరు. లోకం సంఘం చిన్నతప్పును భూతద్దంలో చూసి ముచ్చటలాడి రచ్చకీడ్చే లోకం. భార్యాభర్తల తల్లీబిడ్డల తగువులు చూస్తూ వినోదించే లోకం జంటలు విడితే తృప్తి పడేలోక. పెదవులపై తేనెపూసుకు సానుభూతి కురిపించే లోకం. తల్లిని తన్నే తనయున్ని దండించలేని లోకం.....ఏమిటి శ్రీధర్ మనచుట్టూ ఉన్న వ్యక్తులు. నాకేం భయంలేదు. అననీ నాలుకలు చించుకానీ చావనీ. పోయిన నీ భార్యనూ, నన్ను మోసం చేసి పెద్దమనిషిగా చలామణి అవుతున్న నా భర్తను మరచిపోవడానికి ప్రయత్నిద్దాం" అంది రమాదేవి ఆవేశంగా.....
మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్.
"అతనెవరు?"..... ప్రశ్నలు ఎదురయ్యాయ్ రమాదేవికి. "నా క్లోజ్ ఫ్రెండ్. బ్రదర్లాటివాడు అంటూ పరిచయం చేసేది రమ.
వారం గడచిన తర్వాత ఓ ఆదివారం రోజున అలసటగా, బరువుగా, నీరసంగా ఉన్న రమవైపు చూస్తూ. ఈ నెలాఖరులోగా డెలివరీ అయి పోతుందంటావా? అన్నాడు శ్రీధర్.
హాస్పిటల్లో జాయినవుతాను. నువ్వుంటావుగా.
"ఉంటాన్లే .... కాని రమా, మగవాడు భార్య పోయినా, భార్యను వదిలినా మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు. మరి స్త్రీ లెందుకు చేసుకోకూడదు? ఎందుకలా ఉండిపోతున్నారు."
"నిన్ను జాతుల్ల్లో స్త్రీలు హాయిగా పెళ్ళి చేసుకుంటున్నారు."
"మరి మన మెందుకు అలా ముందడుగు వెయ్యకూడదూ?"
"మన మనకు... అది మీ పురుషులు చర్చించుకోవలసిన విషయం"
అంటే?......
"విధవా వివాహాలు సమర్ధించింది ఓ రకంగా మన సంఘంకాని ఆ విధవను పెళ్ళి చేసుకోడానికి కోటికొక్క పురుషుడైనా ముందడుగు వేసున్నాడా?..... ఎక్కడో ఎవడో అనామకుడు చేసుకున్నాడంటే.... ఓ అందరూ అభినందిస్తారు. ఒకరు చేసేపని నభినందించేవాడు తానూ పని చెయ్యలేరు శ్రీధర్."
విధవ సంగతి వదిలెయ్ సపోజ్ మాట వరుసకు "శ్రీనివాసరావు మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడని విన్నాం. మరోలా ఫీలవకు నువ్వెందుకు చేసుకోకూడదూ."
"కూడదని నేనన్నానా!" పేలవంగా నవ్వింది.
"అనవు కాని నువ్వాపని చెయ్యలేవేమో! మళ్ళీ పెళ్ళి చేసుకు ధైర్యంగా సంఘంలో తిరిగే సాహసం మీ స్త్రీల కుందా? మీలో బలహీనత లున్నాయ్... నిన్ను.....నీకు నచ్చిన వ్యక్తి పెళ్ళి చేసుకుంటానంటాడనుకో. నీకు పుట్టిన పాపను తండ్రిలా అభిమానిస్తానంటాడు అతనితో వివాహాన్కి ఒప్పుకుంటావా రమా?" ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీధర్.
"నాకు నచ్చిన వ్యక్తి..... హు.... నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు శ్రీధర్....మనస్సు విప్పి మా దాంపత్య జీవితంలో దొర్లిన పొరపొచ్చాలు చెప్పాను నీకు. మరొక వ్యక్తితో మళ్ళీ వైవాహిక జీవితం కాంక్షిస్తున్నాననుకున్నావు. బలహీనతే అను. మరేమన్నా అనుకో కన్యావరయితే రూపం అన్నారెవరో. తొలిచూపు లోనే అతని రూపం నన్నాకర్షించింది. ఎన్ని మనస్పర్ధ లొచ్చినా లొంగిపోయేదాన్ని శ్రీధర్? అతని ఆ ఆకర్షణే యేమో! ఎక్కడ ఉండనీ. ఎలా వుండనీ. ఈ జీవితానికి. ఈ జన్మకు ఆ శ్రీనివాసరావే నా భర్తగా ఉండిపోనీ. నా బిడ్డ తండ్రి అతనే శ్రీధర్. మరొకరిని పెళ్ళి చేసుకుని అతనికివ్వడానికి నా దగ్గర ఏం లేదు. నా సున్నితమైన మధుర భావాలన్నీ దోచుకు నన్ను శిలగా మార్చి వదిలిపెట్టారు శ్రీనివాసరావు...." ఆమె గొంతు పూడిపోయింది.
"క్షమించు రమా! నీ మనస్సు నొప్పించాను. నువ్వూ పదహారణాల భారత స్త్రీవే.... సోషల్ గా తిరిగినంత మాత్రాన సంప్రదాయం వదిలిపెట్ట రని తెలియజెప్పావు. మరేం నొచ్చుకోకు ఈ టాపిక్ వదిలేద్దాం. అసలీ సంభాషణే మరచిపోదాం" అన్నాడు శ్రీధర్. అతని గొంతు బాధగా ధ్వనించింది.
రమ శ్రీనివాసరావు పోలికలు పుణికిపుచ్చుకున్న అమ్మాయిని ప్రసరించింది. శ్రీధర్ ఆమెకు అండగా నిలిచి ఆదుకున్నాడు.
* * *
