Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 86


    "ఈ శని, ఈ పీడాకారం యెప్పుడు విరగడ అవుతాడు!" అంటూ విసుక్కునే వదినలంతా ఎంతో ఆప్యాయతను కురిపిస్తున్నారు. మంచి అయినా, చెడు అయినా సిద్దార్థ చెప్పిందే వేథం.

    " ఏరా రామ్ నువ్వేమంటావ్?"

    " నాదో మాట, వాడిదో మాట లేదు."

    "వాడి చమ్చావి."అన్నాడు కెలికినట్టు.

    "అయితే అయ్యాను. అందుకు నాకేం కోపం లేదు వాడంత ఆలోచన, ఇంత చిన్న వయసులో ఇతరులను గురించి ఆరాటపడే ఆవేదన ఉంటే చాలు" అన్నాడు.

    దయ్యం అంటే, చేతబడులు అంటే చాలామంది భయపడతారు.యెందుకు! అది వారిలోని  బలహీనత! తాము చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి.

     డబ్బులేని వారు తెగించారు. సిద్దార్థకు హాని జరిగితే మనకు జరుగుతుంది కానియ్యి. అని లేదన్నారు.
   
    " అనుభవిస్తారు" శపించినట్టు అని వెళ్ళిపోయారు.

    ఊరంతా ఆరోజు పెద్ద జాతర చేస్తున్నారు. సిద్దార్థ , రాంబాబును తీసుకొని , మెల్లగా ఇంటికి వెళ్ళాడు. పురుషోత్తమరావు ఆరోగ్యం క్షణించింది. వెళ్ళి మాట్లాడి మందులు ఇప్పించి వస్తాడు.

    ఇద్దరిని చూచి యశోదమ్మ చాలా సంతోషించింది.

    "నాన్న  ఆరోగ్యం కోలుకుంది కదమ్మా!"

    " నీ గురించి  దిగులురా. రోజూ కనిపిస్తున్నావు. ఆ దిగులు మరిచిపోయారు సిద్దూ!  ఆ అర్జున్ అడిగిన పాతికరూపాయలు పారెయ్యక పోయావా!"అన్నది.

    "నువ్విచ్చావా ఏం?"

    ఆమె జవాబు ఇవ్వలేదు.

    "అమ్మకు భయం అన్నయ్యా, నాన్న పేరిట ఇచ్చింది" అన్నది రాధిక.

    " అమ్మా!దుష్టశక్తులను పోగొడుతున్నారు గాని, ఆ దుష్టశక్తులను సమాజం మీదికి వదిలిన దుష్టుడిని వెళ్ళగొట్టరేం?"

    "వాడు మనకు ఏదయినా హాని చేస్తే..."

    "పిరికిగా బ్రతికేకంటే చావటం నయం కదూ!"అన్నాడు.

    "మంచిది నాయనా! ఏం రాంబాబూ,అంత మౌనంగా కూర్చున్నావ్?" పలుకరించి ఇద్దరికి కాఫీ , టీపిన్ ఇచ్చింది.

    వీధి, వీధంతా పండుగలు చేసారు.

    క్షుద్ర దేవతలను పారద్రోలటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కల్లు కుండలు, సారా సీసాలు, గొర్రెపోతులు , కోడిపుంజులు వచ్చాయి.

    తాంత్రిక శక్తని ఎదిరించే అతను మంత్రాలు వల్లిస్తున్నాడు.  జనానికి అర్థంకాకపోయినా తలలు అడిస్తున్నారు.

    అన్నం రాసులు పోశారు.

    మాంపము పెట్టారు, కల్లుకుండలు, సారాసీసాలు పెట్టారు. గారెలు, బూరెలు పోశారు.

    నై వేద్యం షడ్రసోపేతం, నానావిధ ఫలంతథా

    నానావిధానిద్రవ్యాణి , దాత్యా దేవ్యై ప్రయత్నత!

    మద్యం నివేద్య మాంసంచ మత్స్యం ముద్రాంతతః పరః

    దత్వా దేవై, ప్రయత్నేన అన్నం, బహువిధం తథా!

    పూజారి  వెంట్రుకలు విరబోసుకుని నివేదన అర్చించారు.

    పసుపు, బొట్టుపెట్టుకున్న నల్గురు మగవారు. ఆడువారు నిల్చున్నారు.

    "బైరవ పూజంటే?"

    కొందరు తెలియనివారు ప్రశ్నించారు.

    "భై రవ పూజంటే , నై వేద్యంతోపాటు మైధునం ఉండాలి.... భైరవా...." ఆంటూ కళ్ళు మూసుకున్నాడు.

    "మైధువం అంటే...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS