Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 85


    'ఫోన్   మోగింది.

    ఆమె ఫోన్ ఎత్తి  'హల్లో!' అన్నది.

    "హల్లో !నేను డియర్!ఏమిటి అచ్చు  పల్లెటూరి పిల్లలా ప్రవర్తించేవు."

    "సురేంద్రా!"

    " చెప్పు డియర్!"

    "ఒక చిన్న ప్రశ్న అడిగితే కోపం రాదుకదా.!"

    "నో ..నాట్ ఎటాల్..."అన్నాడు.

    "నీకు అక్కడ ఎవరితోనయినా అఫేర్ ఉందా!"

    "శ్వేతా...." అటునుండి ఏ జవాబు రాలేదు.

    "ఉన్నామనము కొన్ని విషయాలు దాచకుండా చర్చించుకోవటం మంచింది"అన్నది ప్లెయిన్ గా.

    "శ్వేతా! కొన్ని తాత్కాలిక ఆవేశాలుంటాయి. రైల్లో ప్రయాణం చేస్తూ, ప్రక్క సీటువాడితో ,ఎదుటి సీటువారితో స్నేహం చేస్తాం .రైలు దింగంగానే , వాళ్ళెవరో,మనవం యెవరమో.అలాంటి అపేర్స్ ఏర్పడుతాయి. వాటిని నేను మరిచిపోతాను. నువ్వు మరిచిపోవాలి"అన్నా.

    "అది కాదు.... అది కాదు..." నాకు అపేర్ ఉంటే క్షమిస్తావా అని అడగలేక పోయింది.

    "యుసిల్లీ !ఇలాంటి ఆలోచనలతో పారిపోతావా!"

    " అదేం కాదు నీతో మాట్లాడాలి"

    "మనము మాట్లాడుకోవలసినవి  ఈ నీరసపు విషయాలు కాదు." నవ్వి ఫోన్ లోనే ముద్దు శబ్దం చేసి ఫోన్ పెట్టేసాడు.   

    అతని అఫేర్స్ ఉండగా లేనిది తన పరిచయం చెప్పాల్సినంత గొప్పది కాదేమో. నిశ్చింతగా నిదురపోయింది.


                                 22


    ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. ఒకచోట ముసలతను రక్తం కక్కుకుని పడిపోయాడు.

    మరొకచోట బాలెంతరాలయిన స్త్ర్రీ కళ్ళు తేలేసింది.

    ఇంకోచోట ఉన్నట్టుండి ఓ  యువకుడి మాట పడిపోయిందట. అదంతా బాలరాజు బృందం మంత్ర శక్తి అనుకుంటున్నారు. అతన్ని కలుసుకుని, అడుగుదామంటే అతను తపస్సులో ఉంటున్నాడట. అతను ఎవరికీ దర్శనం ఇవ్వటంలేదు.

    పరాయి ఊరినుండి  ఈ మంత్రాలకు తిరుగుడు మంత్రం వేసేవారిని  తెచ్చారు ఊర్లో చందాలు జమ చెస్తున్నారు.

    "సిద్దూ నీచందా కావాలిరా." అర్జున్ వచ్చాడు.

    " ఎందుకు !" ఆశ్చర్యంగా అడిగాడు సిద్దార్థ.

    "ప్రజలమీద కోపగించిన బాలరాజు దుష్టశక్తులను ప్రేరేపించి వదిలాడు. వాటిని  శాతింప జేయాలి."

    "డబ్బుతో శాంతిస్తుందా!"

    "కాదు మహారాష్ట్ర్రనుండి ఓ సాధువును తీసుకు వచ్చాను.య అతనితో బాగు చెయిస్తాను."

    "ప్రజల మీద బాలరాజుకు కోపం ఎందుకు!"

    "వాడు గొప్ప తాంత్రికుడు. మనకు జవాబు చెప్పే స్థితినుండి ఎదిగిపోయాడు."

    "అయితే నేనొకసారి చూడాలి."

    "చూడలేవు"

    "అయితే నాచందా రాదు."

    "ఫలితాలు దారుణంగా వుంటాయి."

    "నేనంత పిరికివాడిని.శాస్త్ర్రం తెలియనివాడిని కాను." అన్నాడు

    అర్జున్ గౌడ్ నచ్చచెప్పాలని చూచాడు.

    "నేను చావుకయినా సిద్దమే కాని ఇలాంటి త్రాష్టం  పనులకు ప్రోత్సహించను." అన్నాడు.

     "ఓ సినిమా చూచాననుకోరా."

    " ఇంకా నయం పారేసుకున్నాననిఅనలేదు."అన్నాడు.

    సిద్దార్థ ఆంతర్యం అర్ధం అయింది,వాళ్ళు బలవంతం పెట్టలేదు. రాంబాబుకు ఇవ్వాలనే ఉందిగాని సిద్దార్థకు భయపడి ఇవ్వలేదు.అతనికి సిద్దార్థ వల్ల ఓ పని దొరకింది.  అతని బ్రతుక్కు ఓ  అర్దం ఏర్పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS