Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 83

 

    "సరస్వతమ్మగారూ! మా కాబోయే కోడలు శ్వేత." అంటూ ఓ ముత్తబంధువుకు పరిచయం చేసింది.

    "నమస్తే...." అన్నది, ఆ సరస్వతమ్మ యెవరో తెలియక పోయినా

    "ఊ....నీ అంతస్తుకు తూగని సంబంధం కేవలం స్నేహంతో చేసుకుంటున్నావంటే నమ్మలేదే నాగరత్నం. పిల్ల కుందనపుబొమ్మ." అన్నదా సరస్వతమ్మ.

    "సరసుపిన్నీ!మా సూరికంటే అందగత్తేంకాదు మీరు మరీను...." అన్నదో స్త్ర్రీ ఆమెను సురేంద్ర వెళ్ళేనాడు ఏర్ పోర్ట్ లో చూచింది సురేంద్ర పిన్ని ఆవిడ.

    "అవునూ!శ్వేతా ఇటురా...." చేయిపట్టి దూరం లాక్కువెళ్ళింది నాగరత్నం.

    "ఏమిటి ఆంటీ?"

    "ఇంతకంటే మంచి చీర దొరకలేదా!"

    "ఆంటీ!"

    " అవునే నా శతృకూటమి అంతా వచ్చారు. నా కోడలు అందరిలో  డాబుగా, దర్పంగా, హుందాగా ఉండాలి.' అన్నది.

    శ్వేత పెద్ద సి.ఐ.పి. ఆఫీసరయిన ఉండికూడా నోరెత్తలేకపోయింది.

    యెంత కృత్రిమమైన వాతావరణం!

    "నా కోడలు వేసుకున్న నగలు, మరెవరూ వేసుకో కూడదు. కోడలు కట్టే చీరలు అపూరూపమైనవి, అత్యంత విలువయినవి అయిఉండాలి."

    "నేను ఖరీదు చూడను ఆంటీ...."

    "ఇక నుండి చూడాలి."

    ఆమె జవాబు చెప్పలేదు. ఈ ఊళ్ళో నీచేతి క్రింద ఉంటే చూసుకుందాంలే అనుకుంది.

    "బొంబాయి నుండి వచ్చే విమానం మరో అయిదు నిమిషాలో లాండ్ అవుంతుంది."వి  విమానం పేరు, నంబరు  చెప్పారు.అందరూ ఎక్సిట్ వైపు గబ, గబ పరుగులు పెట్టినట్టు వెళ్ళారు.

    కొందరు పూలదండలు రడీగా పట్టుకుని నిల్చున్నారు.

    శ్వేత, గుమ్మం దగ్గరకు పరుగెత్తే నాగరత్నమ్మను చూచి నవ్వు
కుంది.

    ఫోటో గ్రాఫర్లు తన కెమెరాలను సరి చూచుకున్నారు.

    ఈ మధ్య ఫోటో గ్రాఫర్లకి గిరాకీ తెగ పెరిగిపోయింది.

    పెళ్ళి అవుతుంటే చుట్టూ వాళ్ళే.

    ఓ నాటకం వేసినా, ఓ పాట పాడినా, కళాకారులకు, ప్రేక్షకులకు మధ్య ఈ ఫోటో గ్రాఫర్లే ఉంటారు.

    ఇప్పుడు ఏర్ పోర్ట్ లో  కూడా వాళ్ళే....

    ఆమె ఆలోచనలు చెదరగొడుతూ  కల, కలం బయలుదేరింది. విమానం అగింది. .జనం దిగుతున్నారు.

    శ్వేత దృష్టి దూరం  నుండి వచ్చే, తెల్లగా, పొడుగ్గా,ఠీవిగా వచ్చే యువకునిపై పడింది. పిల్లిగడ్డం, సైడ్ బన్స్ తో  హుందాగా ఉన్నాడు.

    ఒక్క నిముషం రెప్పవేయటం మరిచిపోయింది.

    ఇందాక సురేంద్ర పిన్నమ్మ అతని అందాన్ని పొగిడితే ఏమో అనుకుంది. రంగు తేలి అందంగా తయారయ్యాడు.

     అతను ఎక్సిట్ దగ్గరకు రాగానే....టప్ మని అతని మెడలో దండలు పడ్డాయి.

    " ఓహ్! ఇదేమిటి నాన్నా!"

    "మా సంతోషం....." అన్నాడు కొందరు ఫోటోలు క్లిక్ మన్నాయి.

    అతని కళ్ళు మాత్రం, అటు,ఇటు కదలాడి, శ్వేతమీద  నిలిచాయి. అతని ముఖం ప్రసన్నం అయి పెదవులు విచ్చుకున్నాయి.

    "హాయ్ శ్వేతా!"

    "హయ్...."  అంటూ ముందుకు వచ్చింది.

    మరోసారి కెమెరాలు క్లిక్ మన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS