"నా మాట నమ్మండి బాబూ! బీరప్పకు దగ్గు, దమ్ము,ఎప్పుడో ఒకటి, అర జాకెట్టు కుడితే పొట్ట నిండుతుందా! ఆ పిల్లను నేర్చుకొమ్మంటున్నాను" అన్నది ఏడుస్తూ.
"దొరా!"
"కాస్త ఎఱ్ఱగా , బుర్రగా ఉన్న ఆడపిల్లలుండగానే, డబ్బున్నవారికి గాలంవేసి,పెద్దింటి వాళ్ళను ప్టటాలని మీప్రయత్నం ఇలా అందరి మాటలు వింటే ఊరంతా వస్తారు....."
"లేదు బాబూ...."ముసలమ్మ ఎంత ప్రాధేయపడినా ఆయన వినలేదు.ఏడుస్తు వెళ్ళిపోయారు.
యశోదకు ఏమయినా సహాయం చెయ్యాలని ఉన్నా, ఈ రోజే కాస్త ప్రేమగా క్రిందికి దిగివచ్చిన భర్తను నిరాశపరచటం ఇష్టంలేక ఊరుకుండిపోయింది.
ఆ రాత్రి తల్లీ, కూతురు అతని దగ్గరే కూర్చున్నారు.
మర్నాడు దయమే సిద్దార్థ వచ్చాడు. అందరూ ఆనందించారు. కాని ,ఆ ఆనందం అట్టేకాలం నిలువలేదు.
వెంటనే చిట్టి, ఆమె కొడుకు వచ్చారు.
" ఓహో!నేను బ్రతకటం ఇష్టం లేదన్నమాట."అన్నాడు పురుషోత్తమరావు.
"మీరు వెయ్యేళ్ళపాటు బ్రతుకాలనే నా తాపత్రయం."
"ఆ అమ్మాయిని యెందుకు తెచ్చావ్?"
" ఆత్మహత్య చేసుకోబోయింది."
" దేశంలో చాలామంది ఆత్మహత్య చేసుకోబోతారు."
"ఈ అమ్మాయి చేతిలో రుజువుతో వచ్చింది"అన్నాడు పిల్లడిని తీసుకుని ముందుకు వచ్చి.
పురుషోత్తమరావు మనసు భగ్గుమంది.
"ఆ పిల్లవాడిని ఎందుకు ఎత్తుకున్నావు?"
" ఏమిట్రా! ఏమన్నావ్?పెళ్ళి చేసుకుంటావా?"
" మరంతే చేయాలి."
"సిగ్గులేదూ! బిడ్డతల్లిని యెలా పెళ్ళి చేసుకుంటావ్?"
"బిడ్డతల్లితో ప్రేమ కలాపాలు జరుపడానికి పెళ్ళి చేయటానికి ఉంటాయా! ఎంగిలి,అసహ్యత అన్నిచోట్ల ఉండాలి నాన్నా...."
"ఛీ...ఛీ..... నన్నా పేరుతో పిలవకు-" చేతికందిన కర్ర తీసి అతనిపైకి విసిరాడు.
అది సిద్దార్థ భుజానికి తాకుతూ క్రిందికి జారింది. తనకు దెబ్బతాకకపోయినా, కుర్రాడజు కెవ్వుమన్నాడు.
"ఏం లేదు బాబూ...."
"ఆ..ఆ...."ఏదో సైగలతో చెప్పి చిట్టి పిల్లడిని లాక్కుంది..
"చిట్టీ! ఆగు. బాబు మా వంశానికి పుట్టిన బిడ్డ. వాడు బజారు పాలుకావటం నేను సహించలేను"అన్నాడు.
" సిద్దూ!"
"అవునమ్మా! ఆపిల్ల బయటి ప్రపంచంలో బ్రతకలేదు. నోరు లేదు. అలా అన్యాయం కావల్సిందేనా?"
"ఒకటి పోతే, మరో సమస్య? ఊరి విషయాలన్నీ నీకెందుకురా?" అన్నది ఆమె కోపంగా.
"నువ్వు అలోచించేది అంతే. పద చిట్టీ...." ఆమె భుజాలపై చేయివేసి మెల్లగా నడిపించుకుని వెళ్ళాడు.
ఆది చూస్తుంటే పురుషోత్తమరావుకు, ఈ ప్రపంచం అంతటినీ కిరోసిన్ పోసి అంటించాలనిపించింది. ఒక్కసారి ఆకాశంకూలి వారిపై పడితే బావుండును అనుకున్నాడు.
21
శ్వేత ఇంటికి వచ్చి ఉత్తరం ఏదయినా వచ్చిందా అని తల్లిని అడిగింది.
"రాలేదమ్మా"అన్నది.
తొమ్మిది నెలలు ట్రైనింగ్ లో ఢిల్లీలో ఉన్నది.
ఆమె తండ్రి హడావుడిగా వచ్చాడు. అతని పేరు వనమాలి పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాడు ఇప్పుడేదో ప్రయివేట్ కంపెనీలో సెక్రటరీగా పని చేస్తున్నాడు.
