Previous Page Next Page 
గాజు బొమ్మ పేజి 8


    "అబ్బా! ఇంకా తగ్గలేదే!' నెమ్మదిగా అనుకున్నాడు . ఫ్లాస్కు తీసి చూశాడు. కాఫీ అలాగే ఉంది.
    "బిందూ , లే! కాఫీ తాగానేదే దేమిటి?" అంటూ లేపి గ్లాసు అందించాడు.
    "తలనొప్పి తగ్గిందా? టెంపరేచర్ రుందనుకుంటానే ఇంకా?"
    బిందు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గమనించీ గమనించనట్లు ఊరుకున్నాడతను. మౌనంగా తగ్గిందన్నట్లు తల ఊపింది.
    "ఇక తగ్గుతుంది లే! మరో టాబ్లెట్ ఉందిగా? అది వేసుకుంటే పూర్తిగా జారిపోతుంది టెంపరేచర్."
    "మీరు అన్నం తిన్నట్లు లేదే?'అన్నదామె కొంతసేపటికి.
    "ఒకపూట తినకపోతే ఏం పోయిందిలే!" అన్నాడు.
    కానీ, అతడు తన మూలాన్నే హోటలు కి వెళ్ళలేక పోయాడని గ్రహించింది. వెళితే తనకే అవసరం వస్తుందో, ఒంటరిగా ఉండలేదేమో నన్న ఊహతోనే అలా ఉండిపోయాడు.
    మళ్ళీ పన్నెండు గంటలకి వచ్చి లేపి టాబ్లెట్ ఇచ్చాడు. అంతవరకూ అతడు మేల్కొనే ఉన్నట్లు అతని కళ్ళే చెబుతున్నాయి. ఆమె మనస్సులో అవ్యక్తమైన భావ మేదో ఝల్లుమంది వీణలా, అతణ్ణి చూడగానే. అంత రాత్రి వరకు తన కోసం మేల్కొని ఉన్నాడన్న భావన ఆమెలో సంచలనం కలిగించింది.
    ఉదయం లేవగానే "కాఫీ ఉంది, ఫ్లాస్కు లో . ముఖం కడుక్కో, బిందూ !" అంటూ వచ్చాడు.
    అంత నీరసం లోనూ అతని అభిమానం ఆమె కెంతో బలం కల్గించింది. వేకువనే లేచి హోటలు కి వెళ్లి కాఫీ తీసుకొని వచ్చాడతను. హోటలు సుమారు మైలుటుంది అక్కడికి. ఇంత శ్రమా తనకోసమే అన్న భావం మనస్సున పొంగుతూన్న సందడి కి తీయదనాన్ని అద్దింది.
    గుమ్మం దగ్గర తూలి పోతుంటే వెంటనే వెనకగా వచ్చి పట్టుకున్నాడు అత్రతతో. జ్వరమూ, నీరసమూ , మనో వ్యాకులతా ఆమెను క్రుంగ దీశాయి. కళ్ళు తిరుగుతున్నట్ల యింది. ఆ పైన అయిదారు క్షణాలు అంతా గాడాంధకారం అలుముకు పోయినట్లయి అతని భుజం మీద వాలిపోయి అతడెంతో అత్రతతో కదిలి పోయాడు. తన కంఠం నుంచి వెలువడుతున్న అత్రతా , అనురాగం ఆమె మనస్సుని మరింత పరవశింప జేశాయి. ఆ నీరసం తోనే అతని మాటలు వినిపించుతూనే ఉన్నాయి. మృదువైన ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉంది ఆమెకు. కానీ, మాట పెగలడం లేదు. నెమ్మదిగా తన భారమంతా అతనే మోస్తూ, తీసుకొని, వెళ్లి మంచం మీద పడుకో బెట్టాడు. ముఖం మీద అస్తవ్యస్తంగా పడి ఉన్న జుత్తును పైకి సర్దాడు. పక్కనే కూర్చుండి పోయాడు ఆమె ముఖం వంకే చూస్తూ. అతనికా క్షణాల్లో ఆమె పసి పాపలా కనిపించింది.
    "బిందూ , ఎలా ఉంది? కళ్ళు తిరిగాయా? కొంచెం కాఫీ తాగుతావా?"
    "ఆ కంఠన లాలన! అనురాగ భరితమైన అభిమానం! ఆ రెండూ ఆమె హృదయాన్ని నవనీతం కన్నా కోమలం చేసి వేశాయి.
    ఆ ప్రయత్నంగానే ఆ కనుల నుంచి అశ్రు బిందువులు జారిపడ్డాయి. ఆ దృశ్యం అతణ్ణి మరింత కదిలించి వేసింది. అంతవరకూ ఉన్న దూరం తొలగిపోయి, ఆమె తన కెన్నో జన్మల నుంచి మధురానురాగం అందించుతూన్న స్నేహ మయిలా గోచరించింది. వెల్లువలా పొంగింది లోలోన దాగి ఉన్న అనురాగం అర్ణనమై .
    ఎప్పటికో కళ్ళు తెరిచిన ఆమె దృష్టి కతడు మరింత సుందరంగా అగుపించాడు. చెంపల మీద జారిన అశ్రు బిందువుల్ని తుడుస్తుంటే కాదని వారించాలనుకుంది సిగ్గుతో. కానీ, మనస్సు నుంచి మాటేరాదే!
    కాఫీ ఇచ్చి అతడు టాబ్లెట్ తీసుకొని రావడానికి బజారు కు వెళ్ళాడు. హిమబిందు మనస్సెంతో హాయిగా ఉంది.
    "ఏమను కుంటుందో తన మనస్సు! నా ఊహల్లో ఊగుతున్న తీయదనం తెలిసి పోయిందేమో? ఎందుకిలా నన్ను నన్నుగా నిలవ నీయడం లేదీ హృదయం? తన కళ్ళు చెమర్చాయెందుకో? అతని మనస్సు ఇంత చేరు వేపుడయ్యింది నాకు? ఆ మాటల్లో నాకోసం ఎంత ఆత్మీయత ఉంది! శ్యాం! నీ మనస్సు మధుర మైనది. అది నన్ను సున్నితంగా బంధించు తుంది! నా దుఃఖం ఆవిరై పోతున్నది నీ స్నేహంతో. ఎందుకింత చేరువగా వస్తున్నావ్? నా స్నేహం నీకేం పంచి పెడుతుందని నీ ఊహ! కానీ ........నా బ్రతుకే.......?" గడ్డ కడుతున్న దుఃఖం మళ్ళీ కరిగి పైకి పొంగిందామె కంఠన ఆ ఊహలతో.
    వస్తూ వస్తూ డాక్టర్ని కూడా వెంట బెట్టుకు వచ్చాడు శ్యామసుందర్. డాక్టర్ని చూసి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది హిమబిందు. ఇంజక్ష నిచ్చి కంగారుపడ నవసరం లేదని, విశ్రాంతి తీసుకోమని చెప్పి సెలవు తీసుకున్నాడు డాక్టర్.
    "మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చా రెందుకూ? జ్వరం లేదుగా?" అన్నదామె.
    "ఏమో? మళ్ళీ సాయంత్రం వస్తుందేమో? ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా? ఫీజు ఎక్కువవుతుందని భయపడుతున్నావా ఏమిటి? నేనే పిలిపించాను గనక బిల్లూ నేనే ఇస్తానులే, భయపడకు!" అన్నాడతను నవ్వుతూ.
    "ఇదేమిటి ! ఫీజు మీ రెందు కివ్వడం?"
    "ఏం? నేనెందు కివ్వకూడదు? ఈ మాత్రం ఋణపడి ఉంటేనే మంచిది. వచ్చే జన్మలో మళ్ళీ స్నేహితులం కావచ్చు!"
    అతడు నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో పరిహాసం లేదని గ్రహించిందామె. అందుకే వారించాలని కదలబోతున్న పెదవులు ఆగిపోయాయి వెంటనే. ఇంత మాత్రానికే వద్దని చెబితే అతని మనస్సు చిన్న బోతుందే మో అనుకున్నదామె.
    కళ్ళు మూసుకుని పడుకొని ఉన్న ఆమెను మృదువుగా పిలిచాడు -- "బిందూ , నిద్రా? ఇంద బత్తాయి రసం! తాగు! కొంచెం ఓపిగ్గా ఉంటుంది" అంటూ.
    "మీరు మరీ చిన్న పిల్లని చేస్తున్నారు నన్ను! ఒక్క రోజు జ్వరానికి నాకేమీ కాదు లెండి. అయినా ఇప్పుడు మిమ్మల్ని పళ్ళు తెమ్మన్నదేవరు?"
    "నిన్నిలా వద్దని అనమంటున్నదేవరసలు?"
    ఆ మాటతో నవ్వాపుకోలేక పోయిందామె మాట్లాడకుండా అందుకుంది గ్లాసుని.
    "ఎందుకింత మృదువుగా మందలించు తున్నావ్ శ్యాం. ఈ బిందుని? నీ ముందు నవ్వకుండా ఉండలేదు నా మనస్సు క్షణమైనా! ఇంద్రజాలం గాని తెలుసా ఏమిటి నీకు? ఏమో? నాకెందుకో భయంగా ఉంది! ఇంత దగ్గరగా వచ్చి .....నా హృదయాని కిలా ఆనందాన్ని అందించు తున్నావ్? ఎలా.. ఎలా ... ఉంటుందో....ఏమౌతుందో ఈ అనుబంధం !....'
    ఆలోచన తెగనే లేదు. అంతలోనే వచ్చాడు మళ్ళీ శ్యాం. కాలేజీ కి వెళ్ళడానికి కాబోలు హుందాగా , నీట్ గా తెల్లని దుస్తుల్లో తయారై వచ్చాడు.
    "అరే! ఇంకా తాగనే లేదా! ఇదో, బిందూ! ఇలా అయితే ఇక కరుణ పెళ్ళికి ఎలా వెళతాం , చెప్పు? ఎల్లుండే వెళ్లాలని తెలుసా? ప్లీజ్, బిందూ ! కరుణ కోసమైనా కాస్త మనిషివిగా ఈ రెండు రోజుల్లో! పోనీ, నన్ను వదిలివేయ్!"
    "మీతోనే రావాలా నేను కూడా?"
    "ఏం? రాకూడదా? విరోదినా నేను?"
    "అని అనలేదే నేను? మీకు నాతొ పోట్లాడడం ఇష్టమను కుంటానే?" "మరేం చేయాలి స్నేహం కుదరని వాళ్లతో? యుద్ధం తప్పదు మరి!"
    "ఆ యుద్ధం లో నేనే ఓడిపోతున్నా నెమో?"
    "ఆ ఓటమి వలన నాకేమీ నష్టం రాదేమో, బిందూ! అందుకే ఒప్పుకుంటున్నావు ఓటమిని మనస్పూర్తిగా !"
    ఆ మాట ఆమె హృదయం లోలోనికి చొచ్చుకు పోయి విద్యుత్తులా నరనరానికీ పాకిపోయింది.
    "నా మనస్సున ఏ మూల ఏ ఊహ ఉన్నదో తనకి వినిపించకుండా దాచుకోలేక పోతున్నానా?' అనుకుంటూ పైకి అన్నది తరవాత.
    "నా మన స్సెండుకో నా మాట వినడం లేదసలు! కొన్ని క్షణాల్లో నన్ను నన్నుగా నిలవనీయడం లేదు. అంధకారం తప్ప అక్కడేమీ లేదేమో ననిపించు తోంది. ఇంకా మనః స్పూర్తిగా ఎలా ఒప్పుకో గలను దేన్నయినా?"
    "కపిరపిచ కాసిశాయన మదసుత్తో వృశ్చికేన
            నందష్ట!
    అపిచసిశాచగ్రస్త !కింబ్రూ మస్తన్య
        నైచిత్యమ్'
    అన్నారు మన మనసు గురించి. కోతి వంటిది మనస్సు. మామూలు కోతి కాదు. కల్లు తాగింది. తెలు కుట్టింది. ఆపైన దయ్యం పట్టింది. ఇలాగే ఉందా, బిందూ , నీ మనస్సు కూడా?"
    "మీరునన్ను మరీ ఆటలు పట్టిస్తున్నారు. నా మనస్సు కోతి గావచ్చు. కానీ, కల్లు తాగలేదు...."
    "తెలు కొట్టలేదు, దయ్యం పట్టలేదు డానికి అంటావ్! అంతేనా? కోప్పడకు మరి! నిజం చెబుతున్నాను . కోరిక కల్లు వంటిది , బిందూ! మరి ఏ కోరికా లేదా నీ మనస్సున?"
    "బాగుంది! నన్ను శల్య పరీక్ష చేస్తున్నారే! సరే! మరి తెలు కుట్టిందన్నారు . దయ్యం పట్టిందన్నారు! ఎలాగో చెప్పండి!"
    "కోరిక ఉన్నప్పుడు అసూయ దుఃఖం తప్పకుండా ఉంటాయి. అదే తేలూ, దయ్యం అవుతాయి!"
    "మరెలా లాలించాలి ఈ మనస్సుని?"
    "ఆసంశయం మహా బాహొ మనోదుర్నిగ్రహం
            చలమ్    
    అభ్యాసేన తు కౌంతేయ నైరాగ్యేణ ఛ గృహ్యతే'
    అంటారు కృష్ణుడు నీలాగే అర్జునుడు అడిగినప్పుడు ."
    "అంటే...."
    "ఈ మనస్సు కోతి వంటిదే! అతి చంచల స్వభావం గలదే! కానీ, అభ్యాసం చేత, వైరాగ్యంచేత అది మన మాట వింటుంది."
    "మరిక నేను వెళతాను. ఊరికే ఆలోచనలు పెంచుకోకు, బిందూ!" అంటూ వాచీ చూసుకుని టైం అయిందని వెళ్ళిపోయాడు. అతడు కనిపించినంత వరకూ అలాగే చూస్తూ ఉండి పోయింది.
    "శ్యాం! నీకెలా తెలిసింది నా మనస్సు! ?క్షణం లో నా ఊహల్లో ఇంద్రధనుస్సు ని సృజించుతున్నావు! ఎలా చెప్పాలి నీకు? అబ్బ! చెప్పకుండా ఎన్నాళ్ళు దాచుకో గలను? ఎందుకిలా వసంతం నిమ్పుతున్నావ్ నా కలల్లో! ఈ పూవు ఇలా వాడిపో కూడదా? ఎందుకింత సుగంధాన్ని అడ్డుతున్నావ్ మాటిమాటికీ? వెన్నెల కన్నా చల్లని హాయి ఉంది, శ్యామ్ మీ స్నేహం లో . కానీ ... ఎక్కడ దాచుకోను ఆ బంధాన్ని ! ఈ హృదయాన ఏం ఉంది?! శూన్యం అని నీకు ఎలా చెప్పాలి?' తీయని ఆ ఊహల్లో అతని కెంతో చేరువయినట్లు మనస్సు అన్నీ విప్పి చెప్పుకుంది.

                            *    *    *    *
    ఆదివారం గుంటూరు కు ప్రయాణం అవక తప్పలేదామే కి. శ్యామసుందర్ ఎంతో చెప్పి ఒప్పించాడు. "నాలుగు రోజులు ముందే ఎందుకు లెద్దురూ" అని ఆమె అన్నది.
    "ఇదిగో , బిందూ! నీకిక్కడ ఒక్కదానికే ఏం తోస్తుంది చెప్పు? ముందు నా మనస్సు నిలవదు. నేను వెళ్ళాక నువ్వు ఓ పూటే భోజనం చేసి మరో పూట కడుపు మాడ్చు కుంటావ్! అదలా ఉంచు! నిన్నసలు ఒంటరిగా ఉండనివ్వను! అలా ఉంటె మళ్ళీ నేను వచ్చాక 'ఎవరు మీరు?' అంటావ్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS