Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 76


    " అలాగేనమ్మా!మీరు నిశ్చితంగా  వుండండి. రాధికా!నేను చెప్పింది అర్ధం అయిందా!ఆశించినవన్నీ జరిగితే జీవతం ఏముందమ్మా!" నవ్వాడు.ఆమె గంభీరంగా మారిపోయింది.

    "సిద్దార్ధ లేచాడు.అప్పుడే సాయిలు హడావుడిగా పరుగెత్తుకుని వచ్చాడు.

    "సిద్దయ్య బాబూ!కొండమునిగిందయ్యా...."

    "ఏం అయిందిరా సాయిలూ?"

    "బాలరాజు లేడూ!కేరళం....బొయ్యి మంత్రాలు నేర్చుకువచ్చి, అందరికి బాణావతి చేస్తున్నాడయ్యా."
    "బాణా వతా!"

    "అవునుయ్యా! అదోరకం చేతబడి, బాలరాజు పినతండ్రికి , వాడికి పడరాదు.ఆ పినతండ్రి కూతురుకు చేతబడి చేసాడు. ఆపిల్లరక్తం కక్కుకుని చచ్చిపోయింది."అన్నాడు.   

    "నీకిలాంటి వార్తలు యెవరు అందిస్తారయ్యా."

    "అయ్యో గట్లనకు బాబూ! నేను కళ్ళారా చుచి వచ్చాను.ఆ పిల్ల, తల్లితండ్రులు ఏడుస్తున్నారు" అన్నాడు.
   
    సిద్దార్ధాకు నమ్మశక్యం కాలేదు'

    అతను తల్లి పిలుస్తున్నా , వినకుండా సాయిలు వెంట వెళ్ళాడు

    ఇద్దరూ బాలరాజు ఇల్లు చేరుకున్నారు. పెద్ద కాంపౌండులో వున్న భవంతి ఇల్లది.   

    బాలరాజు తండ్రి, పింతండ్రి పంచుకుని చెరొకవైపు వుంటున్నారు ఇంటిముందు పశువులు కట్టేసి వున్నాయి.

    "నా పాపో!నా ఇజ్జిమ్మా...."అంటూ ఓ స్త్ర్రీ ఏడుస్తోంది.ఇంటి ముందు పలుచగా వున్నారు జనం.   

     ఇలాంటి చోట, క్రింద తరగతుల వారు ఎప్పుడూ గుంపులుగా వుంటారు.   

    మరేమయిందో! ఒక్కరూ కనిపించలేదు. సిద్దార్థ ముఖంలోని ప్రశ్న చదివినట్టు సాయిలు జవాబు ఇచ్చాడు.
   
    "అందరికి భయమే బాబూ!ఏ  నిమిషంలో ఎవరికి చేస్తాడో చేత బడి...."అన్నాడు.
   
    "బాలరాజూ!"

    "అన్న లేడు." ఒకమ్మాయి జవాబు చెప్పింది.

    "యెప్పుడు వస్తాడు:"

    "తెలియదు."   

    "నేను వచ్చి వెళ్ళానని చెబుతావా!"

    "నువ్వంటే యెవరు?"

    "నన్ను గుర్తుపట్టలేదా! సిద్దార్థను...."అని, ప్రక్కకు వెళ్ళ్డాడు. చిరిగిపోయిన తట్టు వేసి, దానిపై పెట్టారు. అయిదారు సంవత్సరాలపాప అచేతనంగా పడి ఉంది.

    శవం ప్రక్కన ఇరవై అయిదేళ్ళ స్త్ర్రీ కూర్చుని ఏడుస్తోంది. కాస్త దూరంలో జంగయ్యాలా ఉన్న మరో వ్యక్తి నాల్గు సంవత్సరాల కుర్రాడికి బ్రతిమాలి పాలు తాగిస్తున్నాడు.ఒకరిద్దరు స్త్ర్రీలు ,ఇరుగుపొరుగులు అయిఉంటారు. తొంగి చూచి వెళ్ళిపోయారు.

    "ఇదిగో ....." చప్పట్లు కొట్టాడు.

    "ఏడ్పు ఆపి ఆ స్త్ర్రీ ఇటు చూచింది.  ఆమె జర్రున చీదేసింది.   

    ఇగో !యెవరో పిలుస్తున్నారు..." అని భర్తకు చెప్పి, మళ్ళీ ఏడ్పు అందుకుంది.
   
    అతను పిల్లలను భుజం మీద వేసుకుని వచ్చి, సిద్దార్థను చూచి, ఏమిటన్నట్టు ముఖం పెట్టాడు.

    " నేను పురుషోత్తమరావు కొడుకును."

    "తెలుసు బాబూ!ఏంకావాలి!"

    " మీ అమ్మాయి యెలా చచ్చిపోయింది.?"

    " యెలా చచ్చిపోతే ఏం చచ్చిపోయింది బాబూ, ఇప్పుడవన్నీ చెప్పి, ఉన్న పిల్లను చంపుకొమ్మంటారా?"

    "నీకేం భయం లేదు...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS