"అమ్మా!రేపటినుండి రాధిక కాలేజికి వెళ్తుంది" అన్నాడు.
" అంతకంటే నాకుకావాల్సిందేం ఉంది నాయనా!"ఆమె ఆవేదనా పూరితంగా , భారంగా నవ్వింది.
"మీ నాన్న వాలకం చూస్తేనే భయంగా ఉందిరా. సాయిలుతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు."
"ఎన్నాళ్ళో చూద్దాం. నువ్వు తొందరపడకు."
"అంతకంటే నాకు కావాల్సిందేం ఉందిరా. సాయిలుతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు."
"ఎన్నాళ్ళో చూద్దాం. నువ్వు తొందరపడకు."
"అంతా అయోమయంగా ఉందిరా , సులక్షణ సామాన్లన్నీ వాళ్ళనాన్న వ్చచి తీసుకు వెళ్ళాడు" అన్నది.
"వదినలోని స్థబ్దత పోయిందమ్మా ఆలోచిస్తోంది"అన్నాడు.
ఆమె నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో ఎన్నో నిశబ్ద సంగీతాలు వినిపించాయి.
మనిషి కి మనసే శావం!
మనసున్న మనిషికి సుఖం లేదంతే.
స్తబ్దతలోని సుఖం నీవు రుచిచూడలేదు అన్నట్టున్నాయి ఆ చుపులు
"నేను వెళ్ళి పలుకరించనా?"
"కోపంలో ఉన్నారు!" అన్నది.
" ఏం చేస్తారు ?కొడతారు.అంతే కదా!"
ఆమె జవాబు చెప్పేలోగా అతను పై మెట్టుమీద ఉన్నాడు.
"నాన్నా !.... నాన్న గారూ!"
పురుషోత్తమరావుగారు పడక కుర్చీలో కుర్చుని ఉన్నారు.
"యెవరు?ఒహో,బీదబంధూ...ఛీ బావుండ్లా దీన జనపాలకాఅని పిలువనా!"అన్నాడు వెటకారం వెక్కిరంత పరాకాష్టకు చేరుకుంది.
"మీ ఇష్టం నాన్నా...."
"యెందుకొచ్చావ్!నన్నేకేసులో ఇరికించాలని తాపత్రయం!"
"నాన్నా!వొక్కకేసులో నా సాక్ష్యంవల్ల శిక్ష పడింది. మరిమిగతా కేసులన్నీ నేనే పెట్టించానా! న్యాయానికి చట్టానికి ,వ్యతిరేకమైన పనులు చేస్తుంటే యెలా!"అన్నాడు.
" న్యాయం, చట్టం గురించి, నువ్వు నాకు నేర్పుతావా!"అన్నాడు తీక్షణంగా అతని కళ్ళు ఎఱ్ఱగా వున్నాయి.
"నేర్పటం లేదు నాన్నా! ఆలోచించమంటున్నాను. మీకు నేను కొడుకును కాను అన్న భావన వున్నా, నాకు మాత్రం మీరు నాకు తండ్రి అన్న గౌరవము భావన వున్నా, నాకు మాత్రం మీరు నాకుతండ్రి అన్న గౌరవము వున్నది. నాకు హెచ్.ఎమ్.టి లో వుద్యోగం వచ్చింది."
"ఇంకేం ఉద్దరించు. అది నా వల్లే నేను చెప్పించిన చదువువల్లే వచ్చిందిరా చవటా!"
"ఇంకేం ఉద్దరించు. అది నావల్లే. నేను చెప్పించిన చదువువల్లే వచ్చిందిరా చవటా!"
" కాదని నేను అన్నానా !మీరే వుండొద్దని అన్నారు."
"సిగ్గు వుంటే నేను వేయించిన వుద్యోగం వదిలేసి వెళ్ళు."
"మీరు వేయించారా!"
"అంతేకదా."
"తండ్రిగామీ ధర్మం అది."
"కొడుకుగా నీధర్మం ఏమిటో సెలవీయి."
"మీరేం చెబితే అది చేస్తాను"
" వెళ్ళి చావు"
"ఇప్పుడు చచ్చిన మనిషితో సమానమే నాన్నా బయట మనిషిగా ముఖం ఎత్తుకు తిరగటం లేదు.ఈయన అన్నే ఆ హంతకుడు అంటూ వేలెత్తి చూపుతున్నారు."
"అన్ననే జైలుకు పంపాడని ముభావ న వుమ్మేసే రోజులు వస్తాయిరా. వెళ్ళు నాకళ్ళముందు నుంచి వెళ్ళు," అన్నాడు.
సిద్దార్థ మాట్లాడక , వొకసారి చూచి, వెను తరిగాడుఈ ధీమా ఏమిటో... "అన్నాడు.
"నువ్వు తొందరపడి ఊరు వదిలి వెళ్ళకు నాయనా. అటు మీ నాన్నతో ,ఇటు రాధికతో వేగలేను."అన్నదామె.
