Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 74


     "అవునుగాని అంతా ప్రజలదే తప్పని అనను. మీ జుల్మ్ కు భయపడినా భయపడతారు.

    "అది జుల్మ్ అనుకుంటున్నారు. అసహాయత- అంతే, మిమ్మల్ని ఎక్కడ దించమంటారు!"

    "బస్ స్టాండ్ లో దింపండి."

    " ఈ రోజు ఒంటరిగా వెళ్ళటం మంచిదికాదు."

    "నాకు హానిచేసే వారు ఒక్క మా నాన్న గారే,ఒక కొడుకుజైలులో ఉన్నాడు. దూరంచేసుకుంటాడని అనుకోను"  అన్నాడు.

    " మీ నాన్న సంగతి కాదు? ఆ శంకరి ఆశ్రమంలో బ్రతికేవా రెందరో. వారిగురించి నేను అంటున్నది. వారి బ్రతుకుతెరువు పోయినట్టేకద."

    "అవును."అన్నాడు సాలోచనగా.

    ఖాదర్ అతడిని పార్వతమ్మ ఇంటిముందు దింపాడు.

    " టీ త్రాగి పోదువు రా భాయ్"

    "మరోసరి  వస్తాను," ఖాదర్ జీపు వెళ్ళిపోయింది.

    జీపు శబ్దం విని పార్వతమ్మ బయటికి వచ్చింది.

    "ఏమిటి బాబూ!ఏమయింది?"

    "వాళ్ళందరికి శిక్షపడింది ఉరిశిక్ష మాత్రం కాదమ్మా." అన్నాడు.

    "పోనీలేబాబూ! వాళ్ళు చచ్చిపోతే మనకు వచ్చేలాభం ఏముంది?"అన్నది.

    ఆమె ఇప్పుడు మామూలుగా తిరుగుతోంది.   

    కాలమే అన్ని గాయాలకు మందు.

    ఆసత్యం గ్రహించక ఎన్నో అనుకుంటారు.

    "మధుమూర్తి భార్య పిల్లలు వచ్చారా బాబూ?"

    "భార్య వచ్చింది.ఆమె విరక్తితో విదేశాలకు  వెళ్ళిపోతోందమ్మా" అన్నాడు.

    "ఏమిటో!అన్నీ వుండి ఆ బాబుకు  ఇదేం బుద్ది బాబూ!"

    "అదొకపిచ్చి"అన్నాడు.

    అతను కళ్ళు మూసుకుని చాలాసేపు మంచంలో పడిపోయాడు. బంధువులు , బాధ్యత అతడిని ఉక్కిరిబిక్కిరి. చేశాయి.   

    "సిద్దూ బాబూ!అమ్మదగ్గరకు వెళ్ళిపో నాయనా!"అన్నది పార్వతమ్మ టీ ఇచ్చి.
   
    అతను ఏమిటన్నట్టు చూచాడు.

    "ఇందాక అమ్మ గుడిదగ్గర కనిపించాడు బాబూ!నువ్వు దగ్గర లేక, రాదికమ్మ దిగులుగా కూర్చోవటం ఆమెను సగంచేసాయి.అధికాక పెదబాబు కూడా మాట్లాడుతున్నట్టు లేదు."

    సిద్దార్థ టీ త్రాగి కప్పు క్రింద పెట్టాడు.

    "నాకు ఉద్యోగం రాగానే అమ్మను తెచ్చుకుందాం అనుకున్నాను. రేపే ఇల్లు చూస్తాను." అన్నాడు.

    "ఇల్లు చూడటం అమెను తెచ్చుకోవటం తురువాతూబాబూ!మొదట వెళ్ళి ఓదార్చు."అన్నది.

    అతను ముఖం కడుక్కుని బట్టలు వేసుకుని తయారయ్యాడు. శ్వేతను కోర్టులో చూచినా కలుసుకునే అవకాశం రాలేదు.   


                                     19


    "అన్నయ్యా!"అన్న మాటలకు బాదాపూరితంగా అరిచింది రాధిక.

    "నేను కూడా జీవితంపై విరక్తి పెంచుకుని పారిపోవాలా!త్రాగుబొతును కావాలా?"అన్నాడు.

    "ఆమె బ్రతికే ఉంది,అన్నయ్యా ,అతను నావాడు కాలేదన్న బాధ కాదు శ్రీను పోయాడని...." అన్నది వెక్కుతూ.

    "అతను పోయినా, అతని ఆశయాలు ఉన్నాయి.అతను నిన్ను పెద్ద ఆఫీసరుగా చూడాలనుకున్నాడు. అతని ఆత్మ శాంతించాలంటే, నువ్వు చదువుకుని ,అతను ఆశించినట్టు ఐ.ఏ.ఎస్. పరీక్షలు రాసి , మీరు ఎదురుకుంటున్న పరిస్థితి సంఘంలో  యువత ఎదురుకోకుండా జాగ్రత్తపడు" అన్నాడు.   

    రాధిక మాట్లాడలేదు.   

    అతను లేచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS