Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 73


    "ఇప్పటికయినా ఈ ప్రపంచంలో పడ్డావు, సంతోషం వదినా! రా వెలదాం. నాతోపాటు ఉందువుగాని"అన్నాడు.
   
    "  ఇంకా నీకూడా ఎందుకు బాబూ! ఆ పిల్లలకు వీలు చుచుకుని ఇంత విషం పెట్టటానికా!"అప్పుడే అక్కడికి వచ్చిన సులక్షణ తండ్రి రాయుడు అన్నాడు.   

    " నాన్నా !మీరు ఊరుకొండి.అతనేం చేశాడు"

    "ఇంకా ఏం చేయాలి పిచ్చితల్లీ...."అతనేదో చెప్పబోయాడు.

    "అతను ఒకడు చేస్తే ఇదంతా జరిగిందా నాన్నా! దుర్మార్గులు యెప్పుడో ఒకప్పుడు ఇలా కాక తప్పదు కాని పద." అన్నది. అతను సిద్దార్థ మింగేలా చూశాడు.

    "సిద్దార్థా!అవసరం అయితే మొదట నిన్నే ఆశ్రయిస్తాను. రేపు పిల్లలు బయటకు వెళే అందరూ వేలెత్తి చూపితే నేను భరించలేను. ఆ పరిస్థితిలో పిల్లలు పెరగటం ఇష్టంలేదు."

    "మరేం చేద్దాం. అనుకుంటున్నారు వదినా!"

    "నూ చెల్లెలు నైజీరియాలో ఉద్యోగం చేస్తోంది. తనకు స్పాండు లైసెస్ ఆపరేషన్ కావాలి. నన్ను రమ్మని ఎన్నో సార్లు రాసింది. ఇప్పడు వెళ్ళాలనుకుంటున్నాను." అన్నది. ఆమె గొంతులో వణుకు కంటే ఆత్మాభిమానం ఎక్కువుగా కనిపించింది.

    "అలిగి అత్తగారింటికి ,చెడి చెల్లింలింటికి పోరాదమ్మా!నేను బ్రతికే ఉన్నాను కోర్టులను క్రింద మీద చేయగలను" అన్నాడు అతి శయంగా రాయుడు.   

    "నాకు తెలుసు నాన్నా! నా  స్వశక్తి ఏమిటో నేను చూచుకోవాలి. స్త్ర్రీ ఎప్పుడూ పురుషుడిపై ఆధారపడి నందుకే ఇంకా అతని అరాచకాలు ఎక్కువవుతున్నాయి ." అన్నది.

    సిద్దార్థ ఒక స్త్ర్రీని-వరిణితిచెందిన స్త్ర్రీ  ని, పండిపోయినట్టు మాట్లాడుతున్న స్త్ర్రీని చూచాడు.

    "ఏదయినా అవసరం వస్తే నీ దగ్గరకే వస్తాను."

    "థాంక్యూ వదినా! రేపు వచ్చి బేబిని, బబ్లును చూస్తాను."

    "రేపు వద్దు  సిద్దార్థా! నేను వెళ్ళే తారీఖు తెలియచేస్తాను. ఏర్ పోర్ట్ కు రా నాదొక చిన్న కోరిక . మీ నాన్న అన్నలకు భార్యలంటే బానిస, పనికి మాలిన స్త్ర్రీ! నీవయినా సాటి ప్రాణిగా గౌరవించయ్యా." అన్నది.

    "నీ కోరిక ఎప్పుడూ గుర్తుంటుంది వదినా! నాకు హెచ్.ఎమ్. టిలో ఉద్యోగం దొరికింది" అన్నాడు.

    "చాలా  సంతోషం ఏదో పరిశ్రమకు ప్రయత్నించినట్టు ఉన్నావు"

    "దాదాపు  అదీ పూర్తి అయింది. దాన్ని రాంబాబు చూసుకుంటాడు." అన్నాడు.

    "రాంబాబా!అతనెవరు!"

    "హైస్కూల్లో మాక్లాసు మేటు తెల్లగా , పొడుగ్గా ఉంటాడు చూడు వదినా! పెళ్ళిలో నువ్వు అతనే నీ మరిది అనుకున్నావు...."

    "ఓ.....అతనా అతను సినిమాల్లో చేరలేదా?"

    "తెల్లగా, పొడుగ్గా ఉన్నవారంతా సినిమాల్లో చేరితే ఇక సినిమా పరిశ్రమ బాగుపడినట్టే నటించే టాలెంటు ఉండవద్దా?"

    ఆమె తండ్రి కార్లో వెళ్ళిపోయింది.

    సిద్దార్థా గాఢంగా నిట్టూర్చాడు.ఒక విధంగా ,ఈ గోల మేలే చేసింది. వదిన కళ్ళు తెరిచింది. లేకపోతే ఇంకా తను నమ్మిన సిద్దాంతాలు పట్టుకుని వ్రేళ్ళాడేది.మధుమూర్తి ని తలుచుకుంటే ,అతనికే ఆవేదనగా ఉంది. ఇరవై ఒక్క సంవత్సరం కటకటాల మధ్య మ్రగ్గడం అంటే మాటలా!

    ఒంటరిగా నిలబడిన  సిద్దార్థ భుజంపై చేయిపడింది.ఆశ్చర్యంగాచూచాడు. ఇన్ స్పెక్టర్ ఖాదర్ నిలబడ్డాడు.

    "పదండి వెళ్దాం"అన్నాడు.

    "పదండి...." ఇద్దరూ వచ్చి ఇన్ స్పెక్టర్ జీపు ఎక్కారు.

    "మాకు నేరస్తులను పట్టుకోవటంలో ప్రజల సహాయం లభించాలి. సర్! అప్పుడే ఏమయినా చెయ్యగలం. లేకపోతే ఏమీ చెయ్యలేము. బయటివారు పోలీసులను తిడుతుంటారు.యుద్ధంలో పాల్గొనే సైనికుడు నయంసర్!శతృవు యెవరో తెలుస్తుంది.మాకు అదీ తెలియదు. అందరిపట్ల నిష్పక్షపాతంగా ఉండరుకదా. పెద్దవారి మనసు ఏమిటో మాకు తెలియదుకదా!" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS