ఊర్లో నమోదు చేయబడిన దోపీడీలలో అతనికి భాగం ఉన్నది.
ప్రతీ మానభంగం కేసులో అతని హస్తం ఉన్నది.
స్మగ్ లింగ్ లో అతనవు భాగస్వామి.
స్వప్రయోజనాల కోసం ఎన్నో పనులు చేశాడు. సిద్దార్థ ఒక్క సాక్ష్యమే అయితే తప్పించుకునేవాడేమో.
అతను ఆడుకుని,అంతం చేసిన స్త్ర్రీ ల పేర్లు వింటుంటే సులక్షణ అంతరంగం కదిలిపోయింది.
ఇలాంటి వివాహాలకు పవిత్రత అంటూ లేనిపోని హంగు అంటగట్టారు. ఆమెకు వివాహంపట్ల, ఆ వ్యవస్థ పట్ల నమ్మకంపోయింది.
" మాట్లాడమ్మా! నీకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటాను!"
"నాకు న్యాయం చేస్తారా!"
"తప్పకుండా."
" అయితే హైకోర్టు, సుప్రీమ్ కోర్టుకు వెళ్ళనక్కరలేదు. నా బిడ్డలను నేనుపోషించుకోగలను."
" అమ్మా!"
"అవునండీ,ఇన్నాళ్ళూ అయోమయంలో బ్రతికాను.ఇక మనిషిలా నా బిడ్డలకు తల్లిలా బ్రతుకుతాను."అన్నది.
"ఈ కోపం యెవరిపైన!ఆ స్థిద్దార్థగాడిని సమర్ధిస్తానని అనుమానం ఉందేమో అదేం లేదమ్మా!"
"నా కెవరిపైనా కోపంలేదు. నాపై నాకే కోపంగా ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతీ ఆడపిల్లకు పుట్టగానే " నీకు వేరే జీవితంలేదు భర్త, పిల్లలు" అంటూ పాఠాలు చెబుతారు..కాబోయే "నీకు వేరే జీవితం లేదు భర్త, పిల్లలు" అంటూ పాఠాలు చెబుతారు. కాబోయే భర్తకోసం , రాబోయే ఆ మగాడి కోసం, ఈ మె ఆశల వలవరిచి కూర్చుంటుంది. అతను మంచి వాడయితే పరవాలేదు. మా వారిలాంటి వారయితే"
"వాడేం చేశాడు! ప్రతీ మగాడు చేసేపనే వాడూ చేసాడు." అన్నాడు.
"అలా అనకండి . పరుషులందు పుణ్యపురుషులు వేరమయా అన్నట్టు ఇంకా కొందరున్నారు కాబట్టే ధర్మంకుంటుతూ నడుస్తోంది"అన్నది.
పురుషోత్తమరావు మహనం నశించింది.
"ఇప్పుడేమంటావ్?"
"ఏం అనను. మీ కొడుకు పేరు వినిపించనంత దూరం వెళ్ళి పోతాను." అన్నది ఆవేశంగా కాదు- ఆవేదనగా.
"వెళ్ళు... వెళ్ళి హాయిగా ఉండు. ఇలాంటివి యెన్ని జరిగితే మగాడి జీవితం వెళ్ళమారుతుంది! ఆ విషయం మరిచి పోచావు. మీ ఇష్టం వచ్చినట్టే ఉండు," అయన వెళ్ళి జీపులో కూర్చున్నారు.ఆమె కన్నీటితో కదిలే జీపును చూచింది.
"వదినా!"
"ఏమిటి సిద్దార్థా?"
"నన్ను, నన్ను....క్షమించు." అన్నాడు.
"ఎందుకు? నువ్వు చేసింది తప్పని నేను అనటంలేదు కదా. అతన్ని ఒక్క కేలునుండి తమ్ముడవు నువ్వు తప్పించగలవుగాని,అన్ని కేసుల్లో కాదుకదా!"అన్నది వేదాంతిలవా నవ్వుతూ.
"వదినా!"
"భర్త సంపాదన.పుట్టింటి గొప్పలు చెప్పే స్త్ర్రీ ఇలామారి, మాట్లాడుతోందని ఆశ్చర్య పోతున్నావా! ఆడది తిరిగి చెడింది అంటూ పనికిమాలిన సామెతలు పెట్టి పాడుచేశారయ్యా." అన్నది .ఆమె ఎంత చీకటి బ్రతుకు బ్రతికిందో ఆ మాటల్లో ధ్వనించింది.
"హృదయ పూర్వకంగా అంటున్నావా వదినా!"
"హృదయ పూర్వకంగానే అంటున్నాను సిద్దార్థ! రేపు డబ్బు గుప్పి,ఆయనను విడిపించుకు వచ్చినా ఆయనతో కాపురం చెయ్యలేను.ఇంటికి అలంకార ప్రాయం అయిన భార్యగా బ్రతుకులేను." అన్నది .ఆమె ముఖం మలినం అయింది. ఆమె కళ్ళముందు భర్తజీవితంలో పాలు పంచుకున్న స్త్ర్రీలంతా కనిపించారు.
"సిద్దార్దా! మనిషి బలహీనుడు ఏదో ఒక క్షణంలో బలహీనతకు లోనయితే క్షమించ వచ్చుగాని మగతనం అనుకుని, పొగరుబోతులుగా తిరిగితే అది క్షమించరాని నేరం." అన్నది.
