"నిజమే కాని...."
"కాని అర్దణా ఏం లేదు,ఈ విషయంలో మధుమూర్తి జాలి చూపి, మీరు దోషులు కాకండి."అన్నది.
సిద్దార్థ మాట్లాడలేదు.
"ఈ రోజు ఇద జరిగింది. రేపు ఇంకొకటి చెయ్యవచ్చు.అదీకాక అందరూ అతను చేసిన, శిక్ష తప్పించుకున్నాడని తామూ చేయబోతే ప్రమాదం కదా!"
"అవన్నీ ఆలోచించాను. నా కళ్ళముందు బేబి బబ్లు తిరుగుతున్నారు. ఒకరికి న్యాయం చేయబోయి ఆ పసివారికి అన్యాయం చేస్తానేమోనని భయంగా ఉంది.
" అంత జాలి ఉంటే నీ పర్యవేక్షణలో ఆ పసివాడిని తీర్చి దిద్దు."
"అంతే నంటావా!"
"బి బోల్డ్ సిద్దార్థా!ఇప్పజడు నువ్వు బెసికిపోతే అందరం చేసిన ప్రయత్నం వృధా అవుతుంది."అన్నది.,
అతను ఆమెను చూచాడు. ఆ కళ్ళల్లో దీక్ష, పట్టుదలా కనిపించాయి.
"ఓ....కే...." చేయి చాచాడు.
ఆమె చేయి అందించింది , చేయి అందించింది.చేయి నొక్కి వదిలాడు.
ఆమెకు తన గుర్తుగా ఏదన్నా ఇవ్వాలనుకుని మరిచిపోయాడు-
"నేను వెళ్తాను శ్వేతా!"
"మీ సహృదయతకు నా ధన్యవాదాలు."
"మళ్ళీ మీ అని నన్ను దూరం చేయవద్దు."
" తప్పదు శ్వేతా!" జీపు వచ్చింది.ఖాదర్ పిలిచాడు. నవ్వుతూ ఆమె ఎక్కింది.అప్పటికే సామాన్లు పెట్టారు.
జీపు కనుమరుగు అయ్యేవరకు చెయ్యూపాడు. శ్వేత పమిటతో కళ్ళు ఒత్తుకోవటం చూచాడు.
తన జన్మదినం అనేకంటే పునర్జన్మ దినం అంటే నయం అనుకున్నాడు. ఆశాభంగం , దాని తరువాత నిశ్చింత మొదటిసారి చవిచూశాడు. భారంగా ఇంటికి వచ్చాడు.
18
యెవరెన్ని విధాలుగా చెప్పినా, తను అనుకున్న విధంగానే సాక్ష్యం చెప్పాడు సిద్దార్థ.
"ఇదంతా దాయాదులన్న ద్వేషంతో చేసిన కుట్ర. అన్నగారూ అంటూ ఆప్యాయంగా అడిగి తీసుకున్న ఉంగరం ఈ రోజు తన స్వార్థప్రయెజనాల కోసం ఉపయోగించుకున్నాడు ఈ సిద్దార్థ" అన్నాడు అతని లాయరు.
దాన్ని పురుషోత్తమరావు ,సులక్షణ బలపరిచారు. వారు జడ్జీగారికి లంచం పెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. వారి ఆశయం నెరవేరలేదు. దురశాపరుడు, తిమ్మిని బమ్మి చేసే న్యాయమూర్తి రిటైర్డ్ అయికొత్త అతను వచ్చాడు.
అతను లంచాల జోలికి పోడు, ఆదర్శాలు వల్లించడు. గంభీరంగా ఉండి తను అనుకున్నది చేసి వేస్తాడు.
అతని ముందు వీరి అటలు సాగలేదు.
అదీకాక శ్రీనివాస్ ను హత్యచేసి న కేసు ఒక్కటే కాదు.ఇంకా ఎన్నో ఉన్నాయి.
శంకరి ఉరఫ్ అంబాబాయి చరిత్ర బయటికి వచ్చింది. దాంతో అతను ఉరిశిక్ష తప్పించుకున్నాడు , గానిశిక్ష తప్పుంచుకోలేక పోయాడు. అంబాబాయికి, మధుమూర్తి ఒక్కొక్కరికి ఇరవై ఒక్క సంవత్సరం కారాగార శిక్షపడింది.
వీరప్పకు,బసప్పకు,ఇంకా ఇద్దరు అక్కడవుండే స్త్ర్రీలకు ఒక్కొక్కరికి ఏడు సంవత్సరావ కారాగార శిక్ష విధించారు.అదివిన్న సులక్షణ అదిరిపోయింది. మా మగార్ని తిట్టింది. శపించింది.
"వెనక ఉండి అన్నీ అవక తవకలు చేయిస్తూ, సిగ్గులేదా? మళ్ళీ వచ్చావ్!ఈ నాడు నా పిల్లలు వీధిన పడ్డారు. నేను అనాధను అయ్యాను" అన్నదికోర్టు బయటికి రాగానే.
" సులక్షణా! ఈ కోర్టు తీర్పు ఇవ్వగానే సరా? హైకోర్టుకు వెళ్తాను. సుప్రీమ్ కోర్టుకు వెళ్తాను" అన్నాడు రోషంగా ఆవేశంగా.
ఆమెకు ఈ కేసు నడచిన ఎనిమిది నెలల్లో చెంపలు దగ్గర జుట్టు నెరిసింది.
కోర్టులో భర్త గురించి వెల్లడయిన ఒక్కొక్కని నిజం వింటుంటే ఆమెకు మతి పోసాగింది.
ఒక్క నేరమేనా!
ఊర్లో జరిగే ప్రతీ దొమ్మీలో మధుమూర్తి భాగం వుంది.
