ఫారిన్ లో పాన్ ఖరీదు డాలరుంటుంది. మీకు అక్కరలేదు."అన్నాడు సిద్దార్థ.
ఆమె నవ్వింది.
"ఎప్పుడు వెళ్తున్నారు?"
"ఖాదర్ గారేమో జీపు ఏర్పాటు చేస్తానంటున్నారు."
"ఎన్నింటి బయలుదేరుతారో చెబితే నేను వస్తాను"అన్నాడు.
"బయలు దేరేవరకు ఇక్కడ ఉంటే మీ పనులు చెడి పోతాయా?"
"నాకేంపనులున్నాయి! నీవు సర్దుకోవాలి."
"సర్దుకోవటం అయిపోయింది"అన్నది.
భుక్తాయాసంతో కరీమ్ అక్కడే ఒరికి గురక పెట్టాడు. అతని భార్య వంటింట్లో ఉంది. కొడుకు కోడలు, కూతురు అల్లుడు బయట గదిలో కూర్చుండిపోయారు.
ఇద్దరే అక్కడ మిగిలారు.
"సిద్దార్థా!మీరు ఈ కేసులతో సంబంధం లేనివారని,ఇన్నో సెంట్ అనీ, మీరు మెదట మీ నాన్న గారి గదిలో కనిపించినప్పుడే నిర్ణయించుకున్నా, పై అధికారి అజ్ఞానుసారం అనుమానించవలసి వచ్చింది."
"వస్తే ఏమయింది?"
" ఆశలు కల్పించి వంచించాను."
"ఆశలు అందరికీ నెరవేరవు."
"హైద్రాబాద్ వస్తే మా ఇంటికి రండి!"
"ఘ్యార్...."
" అతనికి ఎన్నో మాట్లాడాలని్ ఉంది.
ఇద్దరి హృదయ పూర్వకంగా చెబుతున్నాను సిద్దార్థ!"
చెప్పమన్నట్టు చూచాడు.
"నాకు మిగిలిని మంచి మిత్రులు మీరే. నాకే అవసరం వచ్చినా నీ దగ్గరే వస్తాను"అన్నది.
అతను నవ్వాడు.
"నమ్మకం కలుగటం లేదు, కదూ?"
"నేను అందరినీ నమ్ముతాను శ్వేతా! మీ కాబోయేవారు ఎప్పడు వస్తున్నారు విదేశాలనుండి?" అన్నాడు.
"ఈ రోజు నవంబరు ఫస్టుకదా....సరిగ్గా నెలనాటికి డిశంబరు ఫస్టున వస్తున్నాను."అన్నది.
" ఉద్యోగం చేస్తావా? అతనితో వెళ్ళిపోతావా!"
"అతని కార్యక్రమం ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. "నేను బావున్నాను. నువ్వు బావున్నావా" అంటూ క్లుప్తంగా రాస్తాడు. వచ్చిన తరువాత నిర్ణయం అవుతుంది."
" ఈ జీవితానికి అలవాటు పడిన తరువాత అక్కడ ఉండగలరా!"
"అదంతా ఇంకా ఆలోచించలేదు. నేను." అన్నదామె.
అతను నిట్టూర్చాడు. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ్యాదిన ఈ మేనరికాల పిచ్చి ఎందుకు ముదిరిందో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం స్నేహితులు కనిపించగానే వరసలు పెట్టి పిలుచుకుని మేనరికాలు కలుపుతారు.
తండ్రి స్నేహితుడిని తల్లి అన్న, అన్న అంటూ చనువుగా పిలిచేది.ఆ చనువుతో మేనరికం అన్నట్టు ప్రవర్తించారు.
కాదనటానికి అప్పట్లో తనకు అవసరం, అవకాశం రాలేదు.
" శ్వేతా!"
" చెప్పండి."
"స్నేహితుల దగ్గర అండి, రైలు బండి ఏమటి? సిద్ధూ అని పిలువు."
" ఆ చనువు పోగొట్టుకున్నా నేమో, చెప్పు."
" భాద్యతా ,బంధుత్వమూ అర్ధం కావటం లేదు. శ్వేతా! వదిన దీనాతిదీనంగా ఏడుస్తోంది." జరిగిన విషయాలు చెప్పాడు.
"సిద్దార్థా"బంధుత్వం మరిచిపొమ్మని నేను అనటం లేదు. బాధ్యతను నెరవేర్చండి. మనం సెంటిమెంట్లు ,దయ, జాలి అనుకుంటూనే చెయ్యవలసినంత ద్రోహం దేశానికి చేస్తున్నాము."
