Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 68


    "ఏమిటీ బేబీ?"

    " మమ్మి రమ్మంటుంది."

    వాళ్ళు వెనుకే ఇంట్లోకి వెళ్ళాడు.

    " ఏం వదినా! పిలిచారంట."అన్నాడు సులక్షణం ముఖం ఉక్రోషంతో ఎఱ్ఱబడింది.

    " మీ అన్నయ్య మీకేం అపకారం చేసాడు?"

    " నాకు.  అపకారం చేసాడని అన్నానా?"

    "లేకపోతే ఆయన విషయాలు నీకెందుకు?"

    "ఆయన విషయాలు నాకు అక్కరలేదు ఆయన స్వంత విషయాలలో జోక్యం కలుగ జేసుకున్న విషయం ఏమిటో చెప్పు" అన్నాడు.   

     ఆమె  జవాబు చెప్పలేనట్టు నిలబడి పోయింది.

    పిల్లలు బిక్కు, బిక్కున చూడసాగేరు.

     "అకస్మాత్తుగా ఆమె సిద్దార్థా! పాదాలపై వాలిపోయింది.

    "నీకు దండం పెడతాను సిద్దార్థ! ఎల్లుండే కేసు విచారణకు వస్తుందట. నా  పిల్లలను తండ్రిలేని వారిని చేయకు. ఆ ఉంగరం ఇచ్చెయి." అన్నది.

     "ఛీ....ఛీ...లే వదినా...." లేపి కూర్చోబెట్టాడు.

    తల్లి ఎందుకో గంభీరమైన విషయానికే ఏడుస్తుందని అర్థం అయిన పిల్లలిద్దరూ బావురుమన్నారు.

    "ఛ...ఛ... ఊరుకోండి. బబ్లూ! నువ్వెళ్ళి నానమ్మ పాయసం పెడుతుంది. తినిరా..." అని ఇద్దరిని బలవంతంగా బయటికి పంపాడు.

    " పిల్లల ముందు ఏమిటి వదినా!"

    "ఏం చేయను! మా ఇంట్లో జమీందారి పద్దతిలో, బయటి ప్రపంచంతో సంబంధం లేక పెరిగాను"   అన్నది ఏడుస్తూ.

    "ఇక్కడికి వచ్చాకర డబ్బు, హోదా అనుకున్నానేగాని, దాని వెనుక ఉన్న అరాచకాలు తెలియవు" అన్నది.

     వెంటనే రెండు చేతులు జోడించింది.

    "సిద్దార్థా!నా బిడ్డలను తండ్రి లేనివారిని చేయకు. నీకు ధర్మం కాదు."

    "వదినా!నేను ఏం చేస్తున్నాను. ఆ ఉంగరం పోలీసుల దగ్గర ఉన్నది."

    " ఉంటే ఉండవచ్చు. నువ్వు కావాలనుకుంటే  నువ్వు దాన్ని రప్పించగలవు!అది నీ చేతినుండి జారిపోయిందని చెప్పగలవు." అన్నది.

    "వదినా!"

    "పరాయివాడా శ్రీనివాస్! మన అమ్మాయిని పాడుచెయ్యాలని చూచినవాడు. మీరు అన్నా తమ్ముళ్ళు రక్త సంబంధీకులు . కావాలంటే ఆపార్యంతమ్మకు ఓ పదివేలరూపాయలు పారేద్దాం."అన్నది.
       
    యెంతటి నిర్దయ!

    " డబ్బుతో ప్రేమను కొంటారు.అమ్ముతారు. అతనికి చిరాకు కల్గింది.

    "వస్తాను."లేచాడు.

    "మా బ్రతుకులు మీచేతిలో ఉన్నాయి బాబూ!"అన్నది.
   
    "అక్కడ పోలీలుకూడా వున్నరు వదినా?"

    "సిద్దార్థా!పోలీసులు,కోర్టులు నాకు తెలియనివికావు. అవన్నీ సాక్ష్యాలమీద నడుస్తాయి."అన్నది .జవాబు చెప్పలేనట్టుగా బయటికి వచ్చాడు.

     అతనికి చిరాకుగా ఉంది.

     "మనసు లేని దేవుడు మనిషి యెందుకో మనసిచ్చాడు!"అంటూ రామకృష్ణ పాడుతున్న రేడియోలో వస్తుంది . నిజంగా అది ఎంత నిజం! ఏం చేయాలి?

    న్యాయానికి కట్టుబడితే ఇద్దరు పసికూనలు అన్యాయం అయి పోతారు.

    పసిపిల్లల గురించి ఆలోచిస్తే ధర్మం నాశనం అవుతుంది.బాధ్యత, రక్త పాశం అతడిని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS