" థాంక్ గాడ్!" పోనీ తను బావుంది."
"టీ త్రాగుతావా బాబూ!"
" వద్దు...." అంటుండగానే కరీమ్ చాచా హడావుడిగా లోపలికి వచ్చాడు.
"నీకు అక్కరలేదేమో, నాకుకావాలి..." అంటూ కూర్చున్నాడు.
" ఖాదరి సాబ్ మీ అల్లుడని చెప్పలేదేం చాచా!"
" నాకు అతను ఈ ఊరు వచ్చుతున్నట్టు చెప్పలేదు బేటా. రేపు మాఇంట్లో బువ్వ తినాలి. మీ చాచి చెప్పమంది."
"రేపా యెందుకు!"
"సేతా బేటీ పోతుంది అందుకు."అన్నాడు. పార్వతమ్మ ఇచ్చిన టీ త్రాగి అతను వెళ్ళిపోయాడు.
అతడికి రాధికను చూడాలనిపించింది. ఇంటికి వెళ్తే తండ్రి చేసే వెటకారం గుర్తుకు వచ్చింది. ఆయన బ్రతుకలేక వచ్చావు అంటాడు.
అయినా మెల్లగా ఇంటికి వెళ్ళాడు. తండ్రి లెనట్టున్నాడు నిశబ్దంగా వున్నది.
"అన్నయ్యా...." రాధిక వచ్చి అన్న చేతులు పట్టుకుంది.
"ఏమ్మా బావున్నావా!" అన్నాడు ఆమె భుజాల చుట్టు చేతులు వేసి. యశోదమ్మ ముఖంలోకి కాంతి వచ్చింది.
"ఇన్నాళ్ళకు, అమ్మ,చెల్లి గుర్తుకు వచ్చారుట్రా!"
"ప్రతి నిమిషం గుర్తుకు వస్తూనే ఉన్నారు. మీరు రావద్దన్నారు. కదా." అన్నాడు.
ఆమెకు ఆవేశంగా ఎన్నో అనాలని ఉన్నది కాని అంటే కొడుకు తనకు దొరుకకుండా పోతాడు.
"రిజల్ట్స్ వస్తే అమ్మకు కనిపించవా!ఈ అమ్మ బాధ అక్కరలేదు..."
"లేదమ్మా! నాన్నగారి నిఘ్టారాలు గుర్తుకు వచ్చిరాలేదు. బయటికి వచ్చి చూడమ్మా, మనగురించి యెంత గొప్పవిషయాలు వినిపిస్తాయో"
"నాకు తెలుసురా."
ఇద్దరికి ఆమె సున్ని వుండలు పెట్టింది.
"వీళ్ళు ఇంత దారుణానికి వడి కడతారని తెలిస్తే నేను చచ్చినా శ్రీనివాస్ పేరెత్తె దాన్ని కాదు." అన్నది ఏడుస్తూ.
" ఏడ్వవద్దు రాధీ! ఏడ్చి ఏం సాధిస్తాం."
అదే అనిపిస్తుంది. నాలాంటిది బ్రతికి ఏం సాధిస్తుంది.
" రాధీ!నువ్వు మళ్ళీ చదువాలమ్మా."
"అన్నయ్యా! వెళ్ళిపో.... అదిగో జీపు శబ్దం. కోడల్ని పరామర్శించటానికి వెళ్ళాడు. మన నాన్న.... "అన్నది రాధిక.
సిద్దార్థ లేచాడు.
"సిద్ధూ! రేపు పుట్టినరోజు . నేను కోరికలు ఏం తీర్చలేక పోయినా ఇంత పాయసం వండి పెట్టగలను నాయనా. "అన్నది.
అలాగే వస్తానమ్మా." అన్నాడు.
అతను చర,చర వెళ్ళిపోయాడు.
17
తల్లి ఇచ్చిన కొత్తకి లాల్చి వేసుకుని ఆమె పెట్టిన పాయసం తిన్నాడు.రాధిక నవ్వుతూ అన్నగారి క్రాపు దువ్వింది.
" లంచ్ వరకుండన్నయ్యా."అన్నది.
"ఉండటానికేం ?అక్కడ కరీమ్ చాచా పిలిచాడు"అన్నాడు.
"వెళ్ళు ! ఈరోజు నాన్న త్వరగా వస్తాడు." అన్నది.
"నువ్వంత దిగులుగా ఉండవద్దు రాధీ నువ్వు నవ్వుతూ ఉండాలమ్మా. మనిషి జీవితంలో చీకటి, వెలుగు, సుఖం , దుఃఖం ఉంటాయి." అన్నాడు.
"అందుకే బ్రతికాను"అన్నది.
అతను గేటు దాటుతుండగా బేబి, బబ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. చిన్నాన్నా, 'చిన్నాన్నా'అంటూ
