Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 66


    "అది నిజమైతే నాతో అంతచనువుగా యెందుకు  ప్రవర్తించావ్?" ఆమె రెండుభుజాలు ఆవేశంగా ఊపాడు.

    "డ్యూటీ...."

    ఆమె మాట పూర్తికాక పూర్వమే ఆమె రెండు చెంపలు పగిలి పోయాయి.

    "షటప్ అండ్ గెటవుట్..." అన్నాడు కోపంగా.

    "సిద్దార్థ గారూ!"

    "గారె, బురె ఏంలేదు.మళ్ళీ నాకు కనిపించకు." అన్నాడు ఆవేశంగా లేచాడు.

    ఆమె ఉన్న చోటే  చిత్తరువువలా నిలబడిపోయింది. వెళ్ళేప్రయత్నం చేయలేదు.

    "నేను వెళుతున్నాను....." అని చర చర,  ఆమె ను ఒంటరిగా వదిలేసి ఊళ్ళోకి వచ్చాడు.అతను మెల్లగా పోలీసు స్టేషన్లో వెళ్ళడ! మొదట ఉన్న ఎస్సై ట్రాన్స్ ఫర్ అయ్యాడు. కొత్త అతను వచ్చాడు. అతనే శ్రీనివాస్ కేసు చూస్తున్నాడు.

    "నమస్తే సిద్దార్థగారు రండి."అతను ఆహ్వానించాడు.

    అతను కూర్చీ చూపి, కాఫీ తెప్పించాడు.

    "మీ సహకారం వల్ల మేం బయట పడగాలిగాం. మాకకు ప్రజలు కూడ సహకరించాలి" అన్నాడు.

    "ప్రజల్లో అంత చైతన్యం ఏది! పోలీసు  డిపార్టుమెంటు అంటే లంచగొండి డిపార్టుమెంట్ అని ఓ భావం ఉంది."

    "అవును. దానికి ప్రజలది, ప్రభుత్వానిది తప్పు. రేపుసాయంత్రం ఒకసారి ఇంటికి రండి మాట్లాడుకుదాం."

    "ఇల్లెక్కడ!"

    " మీకు శ్వేత ఉండే ఇల్లు తెలుసు కదా."

    సిద్దార్థ ముఖంలో రంగులు మారాయి.

     "ఆ ఇంట్లోనే   ఉంటాను .కరీమ్ మా మామగారు."

    "వాట్ !"ఆశ్చర్యంగా చూచాడు.

    " అవునండి. డాక్టర్ జాన్ ను ఎరుగుదురుగా, ఆయన మా పెద్దమ్మ కొడుకు...." అన్నాడు.

    "అయితే మనం   దగ్గర స్నేహితులం."

    " అవును శ్వేత యెప్పుడూ మీ గురించి చెబుతుంది."

    "శ్వేత పోలీసు డిపార్టుమెంటుకు చెందిన మనిషిని తెలియదు" అన్నాడు.

    "అవును . నిన్నటివరకు తెలియదు మధుమూర్తి మద్రాసునుండి గల్ఫ్ దేశాలకు కన్యలను అమ్ముతున్నాడు. చదువు మిషతో మద్రాసులో వ్యాపారం మీరు చూస్తున్నారేమోనని అనుమానం వచ్చింది. అన్ని విషషయాలు సేకరించటానికి శ్వేతను వేశారు.ఆమె డ్యూటీ అయిపోయింది."

    "అలాగా..."

    "మీకు చెప్పే ఉంటారే రేపు కరీమ్ గారింట్లో ఆమెకు పార్టీ వుంది. పార్వతమ్మ ఏడ్పు పెరటినుండి వినిపిస్తుంది.

    అతని పేరు ఖాదర్ అట.

     అతను సెలవు తీసుకుని వచ్చాడు. తడికెల గేటు తీసుకుని వచ్చేసరికి పార్వతమ్మ ఏడ్పు పెరటినుండి  వినిపిస్తుంది.

    రోజులా వెళ్ళి ఓదార్చాలనిపించలేదు.అతనికి చేదుమాత్ర మింగినట్టుంది. వెల్లికలా పడుకుని చేతులు తలక్రింద పెట్టుకున్నాడు. ఆదామెకు సరదాకావచ్చు. కాని తనకుకాదు, తను నిజంగా ప్రేమించి, అభిమానించాడు.

    ఛీ...ఛీ..మరొకరికి వాగ్దత్త అయిన వ్యక్తి తన బుగ్గను యెలా చుంబించ గల్గింది!

    అతను అటు ఇటు దొర్లాడు.

    "యెప్పడు వచ్చావ్ సిద్దయ్యబాబూ!"పార్వతమ్మ అడిగింది.

    " కొద్దిసేపు అయింది. రాధికను చూచి వచ్చావా!"

    "చూచానయ్యా!ముద్దబంతి పువ్వుల్లా ఉండేపిల్ల  యెలా అయింది! చక్కి శల్యం  అయింది."

    " మనుష్యూల్ని గుర్తుపడుతుందా!"

    " నన్ను చూడగానే ఏడ్చింది తనవల్లే శ్రీనివాస్ పోయాడన్నది . మీ అమ్మగారే కోపంగా ఉండి మాట్లాడ నియ్యలేదు." అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS