Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 63

    పార్వతమ్మ అతనికి  టిఫిన్ ఇచ్చింది.

    "మేమంతా తలో ఫిల్డ్ లో ఫర్ ఫెక్ట్ కావాలనుకున్నామురా. బాలరాజు చేతబడులు నేర్చుకుంటున్నాడు. అర్జున్ హిప్నాటిజమ్ నేర్చుకుంటున్నాడు., రాజేష్ బిజినెస్ నేర్చుకున్నాడు. నేనేమో సినిమాలో చేరాలని వెళ్ళాను...."అన్నాడు.

    "ఏమయినా అవకాశాలు వచ్చాయా?"

    "అతను నాది ఫోటో జెనిక్ ఫేస్ అదీ అదీ అని చివరకు పాతిక వేలు పెట్టుబడి పెట్టమంటున్నారా!"

    "మరి నువ్వేం ఆలోచించావ్?"

    "ఆలోచించటానికేం ఉంది?అమ్మానాన్న లేరని ఈ మాత్రం చదువు అన్నయ్యలు చెప్పించార పాతిక పైసలు ఇవ్వరు. ఇప్పటికే ఉద్యోగం లేదని తిడుతున్నారు"

    "మరి అంతేగా!"

    " ఆ సమయంలో నువ్వు గుర్తుకు వచ్చావురా. పాతికవేలు మీ నాన్నకు గొప్ప విషయం కాదు.ఇంటికి వెళ్తే సాయిలు ఏడుస్తూ జరిగిన విషయాలు చెప్పాడు" అన్నాడు నిరాశగా.

    "డబ్బు పెట్టి టాలెంటును కొనసాగలేవు."

    "ఈనాడు అన్నీ కొంటున్నారు, అమ్ముతున్నారు."అన్నాడు.

    "అవునురా! ఆ దర్శకుడు నీ టాలెంటుని నమ్మి పెట్టుబడి పెట్టలేక, నీ లాటలెంటుపై ప్రయోగం చేస్తాడు.ఒక్క అవకాశం ఇస్తాడు. తరువాత...."

    "ఛాన్స్ లు రావంటావా?"

    "టాలెంటును నమ్ముకుంటే ఒకసారి కాకపోతే మరోసారి రావచ్చుకాని కేవలం...."అతను ఇంకా మాట్లాడలేపోయాడు.

    రాంబాబు ఆలోచనలో పడ్డాడు.

    " చూడు రామూ! ముక్కు మొహం బావున్న ప్రతీవాడు సినిమాలో చేరాలనుకుంటాడు.అది అతని తప్పుకాదు.ఆ ఫీల్డ్ లో త్వరగా డబ్బు, పేరు సంపాదిస్తారు కాని అందరికీ ఆ అవకాశం రాదు."అన్నాడు.

    "మరి నాకు ఉద్యోంగం యెలా దొరుకుదతుంది? రికమండేషన్ లేదు. లంచం ఇవ్వలేను." అన్నాడు ఆవేదనగా.

    "నువ్వేం దిగులు పడకు- ఏదో ఆలోచిద్దాం."

    "సిద్దూ !నువ్విలా చేయటం నాకేం నచ్చలేదురా.డబ్బు విలువ తెలిస్తే నువ్విలా చేయవు."

    అదేరా జీవితం! లేనివాడు ఉన్న వాడినిచూచి అసూయ పడతాడు. ఉన్నవాడికి  లేనివాడిని చూస్తే అసూయ." అన్నాడు , వేదాంతిలా నవ్వుతూ. రాంబాబు  అతని ప్రభావితం అయ్యాడో లేదోకాని అప్పటికి వెళ్ళిపోయాడు

    "అమ్మా !"నేనిలా లాయర్ దగ్గరకు వెళ్ళి వస్తాను"

    "మంచిది నాయనా....."అన్నదామె.

    ఆమె మొదట నా కొడుకు తెచ్చి ఇవ్వగలరా అనుకున్నది గానీ, ఇప్పుడు ఎంతోధైర్యంగా ,ఎంతో నిశ్చితంగా వున్నదామెకు.

    ఆమె లేచి వంట ప్రారంభించింది.

    సముద్రంలో కొట్టుకు పోయే వాడికి, గడ్డిపోచ సహాయం దొరికినట్టుంది.


                                   16


    శ్వేత అర్జున్ వంక చూచింది. అతడిని ఆ క్షణంలో మంచి మాటలతో తప్పించుకోవాలి. తను ఏమాత్రం బయటపడినా జీవితం తెల్ల వారుతుంది.

    "నాకు హృదయమిచ్చి చూడు....."

    హృదయం చెవి కమ్మలా, చేతి గాజులా తీసి ఇవ్వటానికి!

    "శ్వేతా! ముఖ్యమయిన విషయం సూట్లాడాలి గుడి దగ్గరకు రా" అన్న ఉత్తరం అందిందామెకు.

    అచ్చు సిద్దార్థ చేతి వ్రాతలా వుంది.   

    నిజమేననుకుని త్వరగా బయలు దేరింది. పర్స్ , తన రక్షణ ఏదీ గుర్తులేదు. వచ్చేసరికి అక్కడ అర్జున్, రాజేష్ వున్నారు.

    అర్జున్ తనతో మాట్లాడుతుంటే రాజేష్ బయట కాపలా వున్నాడు.

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్? ఆ సిద్దార్థగాడు వస్తాడనా! ఉత్త వెర్రి నాగన్న- వచ్చినా నిన్ను కూలికి పంపుతాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS