Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 62

   
    ఆమె అన్నం వడ్డించింది. వంకాయకూర, మజ్జీగ ఉన్నాయి.ఆకలి మీద అనే రుచిగా వున్నాయి. ఇంట్లో అయితే ఆ కలిపిన వంకాయలు ప్రక్కకు నెట్టేసేవాడు. ఇక్కడ శుభ్రంగా తిన్నాడు.
   
    అప్పటికి వెళ్ళి "నెయ్యి తెస్తానుబాబూ?"

    "వద్దమ్మా...." వారించాడు ఇంటిముందు పేరుకుపోయిన చెత్తా, చెదారం,చీదర తీసివేశాడు

    శ్రీనివాస్ ఉన్న రోజులో ఒకనాడు ఆ దారిన తన పొలాల వైపు వెళ్తున్నాడు.ఒక్క నిముషం ఆగి ఆ ఇంటివైపు చూచాడు.

    "అరేరే.....సిద్దార్థగారా!రండి...రండి.మద్రాసునుండి యెప్పుడు వచ్చారు!" అంటూ ఆహ్వానించాడు.

    లోపలికి వెళ్ళి అలాగే నిలబడిపోయాడు.

    ఒకవైపు అందమైన గులాబీలు!

    మరో వై పు లిల్లీలు! ఇంకోవాపు బోగస్ విల్లా పొదలు! దూరంగా పరిమళాలు వెదజల్లుతున్న  'రాత్ కి రాణి' మొక్కలు!!

    "రండి బాబూ....." అహ్వానించాడు.

    "శ్రీనివాస్ ! మా బంగళాకంటే మీ కుటీరం బావుంది."

    "అదంతతా మీ అభిమానం బాబూ." అని నవ్వాడు ఆ నవ్వు ఇప్పటికీ మరిచిపోలేడు.ఎంత ఆకర్షణ! ఎంత అందం వుందా నవ్వులో,

    "నేనే అమ్మాయినయితే!" అనుకున్నాడా రోజున.తన చెల్లెలు ఒక అమ్మాయి.ఆమె ప్రేమిస్తుందని ఊహించలేకపోయాడు.   

    "వస్తాను....."

    "అదేమిటి బాబూ! ఇంతదూరం వచ్చి అలా వెళ్ళి పోకూడదు...."  పార్వతమ్మ అప్పాలు పెట్టి, టీ ఇచ్చింది. వెళ్ళేటప్పుడు మూరెడు మల్లెలమాలఇచ్చింది రాధికకు ఇవ్వమని.

    ఆనాటి ఉద్యానవనములా మళ్ళీదాన్ని తీర్చిదిద్దాలి. అవును అప్పుడే శ్రీనివాస్ ఆత్మ, శాంతిస్తుంది అతను పాదులు సరిచేసేసరకు సాయం త్రం అయింది అతను చేతులు కడుక్కుని వచ్చేసరికి టీ, టిఫిన్ సిద్దంగా పెట్టింది పార్వతమ్మ.   

    " అమ్మా!"   

    " బాబూ!"

    " నువ్వు రామ్మా!"

    "వద్దు నాయనా!నీకు చేసిపెట్టుకునే భాగ్యం ప్రసాదించావు. అంతకంటే ఏం కావాలి?ఆనాటి యశోదమ్మలా ఏం పుణ్యం చేసుకున్నానో...." అన్నది.   

    "అలా ఆనకమ్మా, మన కడుపు నిండటం కాదు ముఖ్యం. ఎంత పంచుకుతిన్నాము అన్నది ముఖ్యం."  అన్నాడు. ఆమె ఒక అప్పం తీసుకుంది.   

     ఇద్దరూ టీ త్రాగుతుండగానే రాంబాబు పరుగెత్తుకు వచ్చాడు.
   
    "ఏమిట్రా సిద్దూ ఇది!"

    "నువ్వేమిటి, నేను మద్రాసునుండి వచ్చిన రోజు కనిపించిమాయం అయ్యావు." అన్నాడు.
   
    "చెబితే తిడతావు."

    "తిట్టనుగాని చెప్పు."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS