Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 64

 

    "నువ్వేం పని చేస్తున్నావ్"?

    "అమ్మాయిల వేట...."

    "మరినిన్ను చేసుకుని బాగుపడతానని యెలా అనుకుంటాను?"

    "నాకు ఆస్తి వుంది."

    " కొంచెం తేడా వుంది. నేను ఆస్తికి వారసుడిని. మా నాన్న కోరికలు తీరుస్తూ నా కోరికలు తీర్చుకుంటుంటాను.అందుకని ఆస్తి నాదే."

    "మీ నాన్న కోరక తీర్చేవడావి నాకోరిక ఏం తీరుస్తావ్? రేపు మీ నాన్న కోరితే అతనికి నచ్చిన అమ్మాయిని  పెళ్ళి చేసుకుంటావు."

    "పెళ్ళి....పెళ్ళా ..." పక, పక నవ్వాడు.

    శ్వేత చిరాకుగా చూచింది.

    "నాకు చాలా చిన్నప్పుడే మా మామ కూతురితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు.నీ లాంటివారు ఊరికి ఒకరున్నారు."అన్నాడు.

    యెంత నిర్లజ్జ!

     దేశంలో యువకులు మాట్లాడే మాటా ఇది!
   
    శ్వేత అలోచిస్తోంది.   

    "నెల, రెండు నెలలు నాతో ఉండు. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.ఆతరువాత కావాలంటే ఆ సిద్దార్థను చేసుకో. వాడొట్టి పూల్! ఇలాంటివి తెలిసినా నమ్మడు. నమ్మినా, నువ్వు కంటనీరు పెట్టుకున్నావనుకో-అంతే కరిగిపోతాడు."వచ్చి ఆమె భుజాలు పట్టుకుని ముందుకు వంగాడు.

    శ్వేత చిన్నగా నవ్వింది.

    ఆమె రెండు బుగ్గల్లో చిన్ని, చిన్న సొట్టలు పడ్డాయి.

    అతను మైమరిచి, పెదవులు బుగ్గలపై ఆనించబోయాడు.శ్వేత తన రెండు చేతులు అతని మెడకు వేసి కత్తిలా నొక్కి పట్టింది.

     " అబ్బా...." అంటూ వేళ్ళాడిపొయాడు.

    "ఆమె త్వరగా బయటికి వచ్చింది. దూరంగా గేటు దగ్గర సిద్దార్థ, రాజేష్ మాట్లాడుతున్నారు.

    ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

    "సిద్దార్థా!వీళ్ళు  నీ స్నేహితులా! అలా చెప్పుకోవాలంటే సిగ్గు వేయటం లేదూ?"అన్నది.

    "సిద్ధార్థ తెల్లబోయినట్టు చూచాడు.

    "ఈ ఉత్తరం చూడండి...." ఆమె చీటీ ఇచ్చింది.

    అది చదివి తెల్లబోయాడు.

    " నేను రాయలేదు."

    "నువ్వు రాశావని నేను అనటంలేదు. నీ స్నేహితులు అబద్దాలు కోర్లు, మోసగాళ్ళు, ఫోర్జరీ చేయగల సమర్ధులు . ఈ రాజేష్  బ్రోకర్ లా ఈ ఉత్తరం తెచ్చాడు...."

    "నేను....నేనా?అబద్దం. నేను వస్తానురా....." అతను పరుగు పరుగున వెళ్ళిపోయాడు.

    "ఓ రాజేష్! మీస్నేహితుడు మరో గంటలో స్పృహలోకి వస్తాడు. తీసుకు వెళ్ళండి." అన్నదామె.

    రాజేష్ హడవుడిగా వెళ్ళిపోయాడు.

    "శ్వేతా! లాయర్ తో మాట్లాడి వస్తున్నాను." అన్నాడు.

    "ఇక కేస సాఫిగా నడుస్తుంది. మీరు సాక్ష్యంగా సరిగ్గా ఇవ్వాలి.అన్ని ఆధారాలు  సమకూరాయి."అన్నది.

    "అవును నేను తప్పక సరయైన దారిలో నడిపిస్తాను.నేను శ్రీనివాస్ తల్లితో ఉంటున్నాను తెలుసా?"

    " తెలుసు! ఆమెకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది." అన్నది, ఇద్దరూ అలా నడిచివెళ్ళి చెరువుగట్టున కూర్చున్నారు. నిశ్చలంగా ఉన్న నీటిలో నీలాకాశం స్వచ్ఛంగా కనిపించింది.

    "సిద్ధార్థగారూ!"

    "ఈ గారే బూరే ఏమిటి!నాకో శుభవార్త తెలిసింది. నీకే మొదట చెప్పాలని వచ్చాను" అన్నాడు.

    "ఏమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS