"ఓ.కె. బాబా....ఓ.కె."అన్నది చిరునవ్వుతో.
"నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. ఇదిగో టెలిగ్రామ్. మా లెక్చరర్ ఇచ్చాడు.?" అని చూపించాడు.
"ఓ కంగ్రాచ్యులేషన్స్!"ఆమె ఆనందంగా అతని చేయి పట్టి ఊపింది.
"థాంక్స్ . మతి నాకేమిస్తావ్!"
"ఏదో కోరుతునన్నారు."
"నేను కోరింది కాదంటే బాధ కల్గుతుంది."
"అనను- అనను సరా! చెప్పండి."అన్నది.
అతను అల్లరిగా తన బుగ్గ చూసాడు.
ఆమె ముఖంలో రంగులు మారాయి.మరుక్షణమే మామూలుగా మారిపోయింది. చిన్నగా నవ్వి దగ్గరగా వచ్చి, అంటీ, అంటనట్టు, అతని బుగ్గ చుంబించింది.
"థాంక్స్-థాంక్యూ డియర్ -" అన్నాడు.
"సిద్దార్థా! ఒక విషయం చెప్పాలి."
"అంత సంకోచం దేనికి?చెప్పు."
" ఈ శుభ సందర్భంలో నిన్ను బాధిస్తే క్షమించు"అన్నది.
"అదేంమాట శ్వైతా! దేని శుభం, దేని విషయం దానిదే."అన్నాడు.
" నువ్వు. యెవరు!యెవరు?అంటూ అడిగినా చెప్పలేదు.ఈరోజు చెబుతున్నాను. నేనొక ,సి.ఐ.డి.ఆఫీసరును..."
"శ్వేతా!" అతని ముఖం కాంతివంతం అయింది.సంతోషంగా ఆమె చేతులు పట్టి ఊపాడు.
"నా గెస్ తప్పుకాలేదు."అన్నాడు.
"నువ్వు గెస్ చేసావా!"
"అవును. నాకంటే ఈ ఊరుమాది, మా చెల్లెలు ప్రేమలో చిక్కుకుంది.అని కుతూహలం మీకెందకో అర్దంకాలేదు."
అలా ఊహించారన్నమాట.శంకరి అసలు పేరు అంబాబాయి మహారాష్ట్ర్రలో పుట్టింది.అక్కడ నగ్నదేవతగా జనులను మూర్ఖులను చేసింది. పోలీసులు వెంటపడగానే మాయం అయింది.ఆమె ప్రవృత్తి ప్రమాదకరమైదని,ఆంధ్రలో వుండవచ్చునని వార్త అందింది.
"తమరు పరిశోధనలు మొదలు పెట్టరన్నమాట.
"ఈ ఊరికి.ఏ.సి.ఐడి. ఆఫీసరు వచ్చినా అంబాబాయి ఉరఫ్ శంకరిగారు తల వలపుల వల విసిరేది. దాంతో వారు ఆమె కొగిట్లో బందీలు.బయటినుండి స్మగుల్డ్ గూడ్స్ రావటం, మనదగ్గర ఉన్న శిల్పా సంపద, అమ్మాయిలు మాయం అవుతున్నారు. పోలీసులకు తల నొప్పిగా మారింది, ఎమ్మెల్యేగా నిలిచి, ఓడిపోయిన పురుషోత్తమరావు,మధు మూర్తి చెయ్యి వున్నదని తెలిసింది. మధుమూర్తి కి ఆడవారి వీక్ నెస్ ఉందని తెలిసి నన్ను పంపారు."
"ఓహో!
"నువ్వు వస్తుండగానే వార్త వచ్చింది నీ పై ఓ కన్నువేసి ఉంచమని."
"ఒక కన్ను ఎందుకు! రెండు కళ్ళు వేసావ్."
"సారీ సిద్దార్థగారూ! మీరు అభిమానం పెంచుకుంటే క్షమించండి, మిమ్మల్ని స్టడీ చేయాలని , మీకు దగ్గరగా వచ్చినట్టు నటించాను.
"శ్వేతా!"
"అవును."
" శ్వేతా! నో...నో.అలా అనకు."
"ఈ రోజుయినా నిజం చెప్పనియ్యి సిద్దార్థా!నాకు అమ్మా, నాన్న ఉన్నారు. నాపెళ్ళి నిశ్చయం అయింది."
"శ్వేతా!"
"అవును. వరుడు. నాన్న స్నేహితుడుని కొడుకు .స్టేట్స్ లో ఎం.బి.యే చేస్తున్నాడు."
"శ్వేతా!ఆపు." అన్నాడు కోపంగా.
"నిజం సిద్దార్థా!"
