Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 61

 

    జవాబుగా ఆమె రెండు కళ్ళనుండి ముత్యాలసరాలు తెగిపడ్డాయి.

    "శ్రీనివాస్ అంటే ఏ భావంలేనిదే ఆతనికోసం ఎందుకింత ప్రాకులాడుతాను! హంతకులను  పట్టివ్వాలని ఎందుకంత తాపత్రయ పడతాను. శవాన్ని త్రవ్వి తీస్తానా!"అన్నాడు.

    "యెన్ని చేసినా నా బిడ్డ రాడు."

    " అందుకే నేను వచ్చానమ్మ"

    ఆమె మాట్లాడలేదు.

    "అమ్మా!నువ్వు నాకు చిన్నప్పుడు పాలు కుడిపావు.ఆ ప్రేమతోనే నీదగ్గర వుండనియ్యామ్మా"అన్నాడు.

    ఆమె ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది.

     "అతను గబ, గబా స్టౌ  వెలిగించాడు టీ చేసి, అమెకిచ్చి తనూ తీసుకున్నాడు.టీ త్రాగుతూ టీ అన్నీ కన్నీళ్ళు కార్చింది.

    "సిద్దార్థ బాబూ! పిల్లలు దుర్మార్గులు అయితేనే నయం బాబూ. ఈ స్టౌఎలా కొన్నాడో తెలుసా" అన్నది.

    " మీరు వీధిలో యెవడో వచ్చి కుస్తీ పోటి అన్నాడు. 'బస్తీమే సవాల్'అంటూ గొడవ మొదలు పెట్టాడు.తను పహిల్ వాన్ అని, తనతో కుస్తీ అయినా పట్టాలని , లేదంటే ఇంటికి అయిదు రూపాయలు కావాలన్నాడు. పోలీసులుకూడా కొన్ని సార్లు ఇలాంటి తొత్తులకు సాయం చేస్తారు."

    " ఇంటికి అయిదు వసూలు చేసాడా!"

    " చేయాలనే వాడిలొల్లి. శ్రీనువెళ్ళి నీతోకుస్తీ పడితే ఏమిస్తావురా!"అన్నాడు.

    " నేను ఓడిపోతన్రా!లుచ్చా."అన్నాడు.అడవి దున్నపోతులా ఉన్నాడు.

    "ఒక వేళ్ళ ఓడిపోతే...."

    "యాభై రూపాయలు ఇస్తాను. సిద్దార్ధబాబు!ఒక్క దెబ్బతో వాడిని క్రింద పడేసాడయ్యా. అంతే ఇకమాట్లాడక, యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ డబ్బు తీసుకుని బజారుకెళ్ళి  స్టౌకొనుక్కువచ్చాడు ' నాకేం పుల్లలతో టీ కాచుకోరాదు' అంటూ-" ఆమె బావురుమంది.   

    ఆ ఇంట్లో దుఃఖిస్తే లాభం లేదమ్మా. ధైర్య్గంగా ఉండి శీనును చంపినవారిని ఉరి కంభం ఎక్కించాలి."అన్నాడు.

    అతను శ్రీనివాస్ ప్రారంభించిన 'పరిశ్రమ'ఫైలుతీసి క్షుణ్నంగా చదివాడు.

    ప్రొడక్షన్ కు సాచ్యూరేటెడ్ పాయింట్ రాకూడదు బ్రష్ లు తాయరుచేసే పథకం అది. అవసరంకూడా ఎంతుందో క్షుణ్నంగా రాసాడు. ఒక భారత్  హెవిఎలక్ ట్రికల్స్ కి సప్లయి చేస్తే చాలు ఫైలు మూసి బ్యాంకుకు వెళ్ళి విషయాలు మట్లాడి వచ్చాడు.

    శ్రీనివాస్ పేరున జరిగిన ట్రాంశాక్షన్ క్లోజ్ చేసి, కొత్తది ప్రారంభించమన్నారు.
   
    "ధాంక్యూసర్!" అతను బయటికి వచ్చి ఆలోచించాడు. పని ప్రారంభించేవరకు తనకు గడిచేదెలా?తండ్రి పేరు ఉపయోగించనిదే ముందుకు సాగలేడు.ఏం చేయాలి! ఈ సమస్యనెలా ఎదురుకోవాలి!

    అతని చేతికి ఉన్న రవ్వల ఉంగరం' రోలెక్స్ గడియారం గుర్తుకు వచ్చాయి. వెంటనే వాటిని అమ్మేశాడు.మూడువేల ఎనిమిది వందలరూపాయలు వచ్చేయి. అందులోనుండి రెండువందలు పెట్టి ఒక మామూలు వాచి కొనుక్కున్నాడు. జాగ్రత్తగా వాడితే అయిదారు నెలలు గడుపవచ్చు.ఈ లోప ఏదయినా ఉద్యోగం చూచుకోవాలి. అనుకున్నాడు.   

    అతను పళ్ళు తీసుకుని ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మ వంటచేసింది.

    "బాబూ'ఎందుకు ఇక్కడ వుంటావు? మీ ఇంటికి వెళ్ళిపో .ఎప్పుడయినా వచ్చి కనిపిస్తే చాలు." అన్నది.
   
    " నాకు వండి పెట్టడం విసుగ్గా ఉందా అమ్మా!"

    "ఎంత మాటన్నావ్ బాబూ!ఏ జన్మలో చేసిన పాపమో ,ఈ జన్మలో కన్నవాడిని పొగొట్టుకుని పిలుస్తున్నాను. యశోదమ్మ ధర్మతల్లి నాయనా!ఆమెను క్షోభపెట్టకు"అన్నది.

    "లేదు. ఆమెకు చెప్పే వచ్చాను. ఎక్కడున్నా ఆమ ఆశీస్సులు నాకుంటాయమ్మా"అన్నాడు.
   
    "  ఏమో బాబూ! అంతా గందరగోళంగా వుంది. నీకంత దయగా ఉంటే చచ్చేవరకు మీ ఇంట్లో ఉంచుకుని ఇంత  గంజి పొయ్యండి."

    " ఆ మాట  ఆనొద్దమ్మా...." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS