Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 60

    "వాడిని పైకి పంపటంలో నీ ఉద్దేశం?"

    " వాడే వచ్చాడు"అన్నది.

    "వాడినిలా పిలుపు "అన్నాడు.

    "ఇప్పుడీ అర్ధరాత్రి రభస ఎందుకు!"అన్నది నిదురబోతున్నాడని బొంకలేకపోయింది.

    ఆనాటి నుండి ప్రారంభమయింది తండ్రి, కొడుకులు మధ్య కోల్డ్ వాల్, తండ్రి చేసే ప్రతీ పనిలో తప్పులు కనిపించసాగాయి. అలsా ప్రారంభం అయిన మనస్పర్దలు ఈనాడు ఇలా అంతం అయ్యాయి.

    ఆమెకు తెలియని మరో విషయం జరిగింది. రాధిక తన ప్రేమవిషయాలు ,తండ్రి పెట్టే ఆటంకాలు కూడా చర్చించింది అన్నతో.

    అది కూ ఒక రకమైన నిరసనను పెంచింది అతనిలో.అది ఇల్లు విడిచి పోయేలా చేస్తుందని యెవరూ ఊహించలేదు.ఆమె స్వరం కోల్పోయినట్టు అలాగే కూర్చుండిపోయింది.


                                      15


    పార్వతమ్మ నిస్త్ర్రాణంగా చాపమీద పడి ఉంది. శ్రీనివాస్ అస్తి పంజరం తీసిననాటి నుండి, యెవరో  ఒకరు ఆమెకు అన్నం తెచ్చి ఇస్తున్నారు. ఇష్టమయితే తింటుంది, లేకపోతే మానేస్తుంది.

    "అంతా తలరాక.ఇంక ఏం ఏడుస్తున్నావ్ ఊర్కో. పాము ఆడి, జోలి వింపుకున్నట్టు మూన్నాళ్ళ ముచ్చట చూపి మాయం అయ్యాడు నీ కొడుకు." అన్నదొకామె.

    "అవునే నడమంత్రపు కుర్చీలు ముందు చిన్న వసారా ఉంది.

    వసారాలో జాజి చెక్కల కుర్చీలు వేసి ఉన్నాయి. గోడకు పెద్దగా ఉన్న బుద్దుడి కేలెండరు ఉంది.

    ఒక గదిలో వంటిల్లు,యెదుటి గదిలో , రెండు నులక మంచాలున్నాయి. రోజూ పార్వతమ్మా ఎత్తి పెట్టేది.

    "అబ్బ ఉన్నంతలో అందంగా అమర్చుకుంటే తప్పా!"

    మంచాలు వాల్చి, వాటిపై పువ్వుల దుప్పట్లు పరిచేవాడు.

    తల దగ్గర జాజి చెక్కల రాక్ ఉంది . దాంట్లో పుస్తకాలు అమర్చుకునేవాడు.

    ప్రతీ పుస్తకానికి అట్ట వేసుకునేవాడు.

    అదంతా చూస్తే శ్రీనివాస్ పై ఎవరికయినా సద్భావంకల్గుతుంది. అందరూ వెళ్ళిపోయారు.

    పార్వతమ్మ తిరిగిరాని కొడుకు, గుణ, గణాలు తలుచుకుని భాధపడుతుంది.

    " అమ్మా!"   

    "శ్రీనూ...." చటుక్కున లేచి వచ్చింది. మసక వెలుతురులో నిలబడిన కొడుకును కౌగిలించుకుంది.
   
    "నేను అనుకుంటూనే ఉన్నానురా తండ్రీ. నీవు  వస్తావని. నా కడుపులో చిచ్చుపెట్టవని..... నన్ను వదిలి ఎక్కడకు పోకురా....."అన్నది అతన భుజంమీద తలవాల్చి.

    "లేదమ్మా!.... ఎక్కడికి వెళ్ళను."

    "ఏమిట్రా ..... ఆగొంతు అలా ఉందేమిటి!" దూరం జరిగి, అతడిని పరీక్షగా చూచింది. అతను సిద్దార్థ.
   
    "నువ్వు.... నువ్వా!.....యెందుకు....ఎందుకు వచ్చావ్...."ఆమె కళ్ళలోని సంతోషం మాయం అయి, కఠినత్వం వచ్చేసింది.

    "అమ్మా...."

    "వద్దమ్మా! పొమ్మనకు అన్నీ  వదులుకుని నీకోసం వచ్చాను. నేను శీనుని తెచ్చి ఇవ్వలేక పోవచ్చు కాని, శీనులా మీతో ఉంటానమ్మా...."అన్నడు.

    "ఇంకా ఏం మిగిలింది నాయనా..... ప్రేమ అంటూ నా కొడుకును మింగిందినీ చెల్లెలు! నాతో ఏదయినా సవిఉంటే చెప్పు నాయనా! ఈ మోసాలు వేషాలు నేను సహించలేను." అన్నది.   

    "అమ్మా!అలా అనకమ్మా, పెద్దవారు చేసిన తప్పుకు నా చెల్లెలు ఏం చేస్తుంది? దాన్ని చూస్తే నువ్వలా అనవమ్మా. రాధిక పిచ్చిదయింది." అన్నాడు.

    "రాధమ్మ పిచ్చిదయిందా!అయ్యో.... నువ్వు అదృష్టవంతురాలి వమ్మా.పిచ్చి దానివయి అన్నీ మరిచి పోతున్నావు నాకా అదృష్టం కూడా లేదు." అన్నది తలబాదుకుంటూ.అతను వెళ్ళి ఆమె చేతులు పట్టి ఆపాడు.

    " అమ్మా!వద్దు...ఆ మూర్ఖులను, ధన మదాంధులను వదిలి వచ్చేసాను. నాకు రాధిక తన ప్రేమ కథ చెప్పి, అతను  తగినంత సంపాదించిన నాడే వస్తాడట  అన్ననాడు సంతోషించాను . మాకున్న ఆస్తిలో మూడో భాగం ఇచ్చి పెళ్ళిచేద్దాం. అనుకున్నాను. నన్ను నమ్ము "ఆమ భుజాలు పట్టి కుదిపాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS