"రమా! హద్దుమీరి మాట్లాడకు."
"అంటే.
"అవున్లే నీకు మాటలు హద్దేమిటో అమ్మా నాన్నా బామ్మా ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్పినా నువ్వు అర్ధం చేసుకోలేవు అర్ధంకాదు.!
"ఆమె జవాబు చెప్పలేదు మౌనంగా యీజీ చైర్లో కళ్ళు మూసుకు పడుకుంది.
నాలుగు రోజులు కేరియరు అన్నం తిన్నారు.
రోజూ హోటలు నుంచి భోజనం డబ్బుదుబారా అనుకున్న శ్రీనివాసరావు వంట ప్రారంభించాడు. అతను వంట చేస్తుంటే. అన్నం కలిపినట్టూ. ముక్కలు దించినట్టూ అతనికి సాయం చేస్తూంది రమ.
అలవాటో మరేమిటో ఆమె వంటచేస్తూన్నా వెనుక ఏదో పని చేస్తున్నాడు శ్రీనివాసరావు. తర్వాత రోజుల్లో-
"టైమయిపోయింది చీర కాస్త పిండి..."
"ఛ నోర్ముయ్" అరిచినట్టు కసిరాడు శ్రీనివాసరావు.
"ఓ....మగవాడు." నవ్వి వెళ్ళిపోయింది రమ.
అతని మనస్సు సహించరాని ఓటమితో ఉడికిపోయింది ఇవ్వాళ బట్టపిండమంది రేపు కాళ్ళు పట్టమంటుంది! హు.... దీని పొగరు! పిల్లి పాలు తోసింది. గతం చెదిరింది చప్పుడుకి.
అతనికిప్పుడు ఆమెను మార్చాలనిపించడం లేదు, ఆమె నెలా శిక్షించాలి, ఆమెపై ఎలా కసి తీర్చుకోవాలి? అనే ప్రతీకారవాంఛ! గతం చదివిన శ్రీనివారావు బలంగా కణతలు రుద్దుకున్నాడు.
* * *
బైట వర్షం జోరు హెచ్చింది. అతని పెదవులు తడారినట్టయ్యాయి. ప్లాస్కులో కాఫీ గ్లాసులో పంచుకున్నాడు. చప్పగా, నులివెచ్చగా ఉంది. తాగాలనిపించలేదు. కసిగా, కాలువలో పోశాడు.
పెట్టెతాళం రమ తీసుకుపోయింది. అతనికి డబ్బుకావాలి. కప్ప బద్దలుకొట్టి రెండు రూపాయలు జేబులో వేసుకున్నాడు. బైట వర్షం చప్పుడు వినిపిస్తూంది. మరొక రూపాయి జేబులో వేసుకున్నాడు.
తలుపు తాళంవేసి వీధి గుమ్మంలోకొచ్చి రోడ్డునపోయే రిక్షాపిల్చి ఎక్కి హోటలు కెళ్ళాడు. కాఫీ టిఫినూ తీసుకుని: ఒక కిల్లీ, సిగరెట్ పెట్టె కొన్నాడు. మళ్ళీ రిక్షాలో ఇంటికివచ్చాడు.
సాయంత్రం ఆరుగంటలకి వచ్చింది రమ. వస్తూనే అతని ఫాలాన్ని స్పృశిస్తూ. "ఎలా ఉంది ఒంట్లో?" అడిగింది.
"బాగుంది" అన్నాడు శ్రీనివాసరావు.
"రాత్రి ఏం చేస్తారు?"
"నా శ్రాద్ధం"
"సరే ఎందుకులెండి, మీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది"
"మానేయ్."
అతనివైపు రోషంగా చ్జూసి మంచం వాల్చుకుని పడుకుంది రమ. ఆమె తనను బ్రతిమిలాడి కాఫీ ఇస్తుందనుకోలేదుకాని. "కాఫీ త్రాగరాదూ!" అనన్నా అంటుందేమో ఆనుకున శ్రీనివాసరావు ఆమెవైపు కసిగా చూశాడు.
* * *
నాలుగురోజులు జ్వరంలో ఒక్కరోజైనా తనకోసం డ్యూటీమానాని రమని ఏవగించు కున్నాడు శ్రీనివాసరావు.
ఆమె గలగలా మాట్లాడుతుంది. అతను ముభావంగా తప్పనిసరిగా ఊ కొడతాడు. రోజులు దొర్లిపోతున్నాయ్. ఆమె నిర్లక్ష్యం అతనిలో పగ పెంచుతోంది. అతని సహనం నశించిపోతూంది. ఆమె ఫ్రెండ్సు ఆడామగా ఫ్రీగా తానున్నా లేకపోయినా ఆమెతో గంటలు తరబడి మాట్లాడి నవ్వుతున్నారు.
ఓ రోజు రత్రి మామూలుగా అతని ప్రక్కన బద్ధకంగా వళ్ళువిరిచి పడుకోబోతున్న రమతో "నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉంది రమా. లే.... నా పక్కన చేరకు." అన్నాడు. ఆమెను బలంగా చేతుల్తో తోసేస్తూ.
"ఏం? ఎందుకని కొత్తగా ఇదొకటి కూడా వచ్చిందే మీలో...." దిగువన జారిపడ్డ రమ నవ్వబోయింది.
"నీ ఫ్రెండ్సెవారూ నా ఇంటికి అవడానికి వీల్లేదు." అరిచాడు.
"మీ ఒక్కరి ఇల్లే కాదు ఇది నా ఇల్లు కూడా."
"అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం?"
"ఉద్దేశ్యమేం కాహ్డు. "మా యింటికి మీరెవ్వరూ రావద్దు అనే సంస్కారం ఇంకా నాలో రాలేదు" వ్యంగ్యంగా నవ్వింది.
"నీ చదువూ సంస్కారం ఉద్యోగం ఫ్రెండ్సూ భగవాన్ నాకెలాటి శిక్ష విధించాడు భగవంతుడు?"
"కాస్త సంస్కారం పెంచుకుంటే ఇవేం మిమ్మల్ని బాధించవు.
"పదిమంది మగాళ్ళతో విరగబడి నవ్వడం సంస్కార మనుకుంటున్నావా? ఎవడి పెళ్ళామన్నా నీ ఫ్రెండ్స్ పెళ్ళా లెవరన్నా నీలా మాట్లాడుతున్నారా? వారెప్పుడన్నా మనింటి కొచ్చారా? నాతో మాట్లాడేరా?
"ఆవలింతకీ ఏమిటి మీసోది?" చిరాగ్గా ప్రశ్నించింది రమ.
"నా మనస్సంతా కలుషిత మయిపోతూంది రమా! చాలా బాధపడుతున్నాను. చివరిసారిగా చెప్తున్నాను. నీ నడవడి ఆ ఉద్యోగం - టెలిఫోను ఆపరేటరు - పదిమంది మగవాళ్ళ మధ్య చెయ్యడం. నాకు ఇష్టం కావడంలేదు. చాలా ప్రయత్నించాను. నన్ను నేను ఇంక అదుపులో పెట్టుకోలేను. మనం భార్యా భర్తఃలుగా ఓచోట జీవించాలంటే, నువ్వు ఉద్యోగం మానెయ్యాలి. మానెయ్యకపోతే నన్నిలా నిర్లక్ష్యం చేస్తూంటే నిన్ను భార్యగా భరంచలేను. ఇటుపైన నువ్వు అనుభవించే ఫలితాలు ఘోరంగా ఉంటాయ్."
"బెదిరిస్తూన్నారా ఏం?" లేచి నుంచుంటూ అతనివైపు చురుగ్గా చూసింది రమ.
"బెదిరింపుకాదు. నా మనస్సులో ఉన్న బాధ వ్యక్తం చేశానంతే. కాకుంటే నా నిశ్చయం చెప్పాను."
"ఇంకా ఆ బాధ ఎక్కువైతే కొడతారు. తిడతారు అంతకన్నా ఏం చెయ్యగలరు మీరు?"
"ఏమీ చెయ్యలేనా?"
"చంపేస్తారు...."
కొట్టీ తిట్టీ చల్లార్చుకునే కోపం కాదు రమా నా గుండెల్లో ఉన్నది.....అంతకన్నా ఎక్కువధి. నీ చుట్టూ నిన్నూ నీ వ్యక్తిత్వాన్నీ మెచ్చుకుంటూ తిరిగే నీ ఫ్రెండ్సు నీ మొహమ్మీద ఉమ్మేయాలి. నువ్వు పతితవీ. కులటవీ అని లోకం కాకుల్లా పొడిచి నీ అహాన్ని చంపి తింటూ ఉంటే....నువ్వు భర్త చాటు భార్యగా. వ్యవహరించనందుకు కుళ్ళి కృశించి ఏడవాలి."
"పోనీ, మీ భార్యకులట, పతిత అయిన్నాడు హాయిగా నిద్రపోతారు కాబోలు మీరు." అంటూ డబ్బున వేరొక మంచం వాల్చి పడుకుంది రమ.
తెలతెల వారుతూండగా వత్తిగిలిన శ్రీనివాసరావు తన పక్కన ఒదిగి పసిపిల్లలా నిద్ర పోతూన్న రమను కుదిపి, దిగువకు త్రోసి "ఎప్పుడు చేరావ్ ఇక్కడకు సిగ్గులేదూ?" అన్నాడు.
"అబ్బా చచ్చానండీ. నాకు నిద్రపట్టక.....ఏం తప్పా" అంటూ మంచం ఎక్కి పడుకుంటూన్న ఆమెవైపు చిరాగ్గా చూస్తూ... "ఛీ! ఛీ! ఇంకా ఎలా చెప్పాలి? ఏం చెయ్యాలి అంటూ లేచిపోయి వేరేమంచం మీద పడుకున్నాడు శ్రీనివాసరావు.
* * *
రేపు మా కాలేజీ వాళ్ళం అంటే లెక్చరర్సందరం ఫేమ్లీస్ తో పిక్ నిక్ కి వెళ్తున్నాం. నువ్వూ వస్తావుకదూ! కాలేజీకి వెళ్ళబోతూ అడిగాడు శ్రీనివాసరావు రమని.
మేమందరం రేపే వేసుకున్నాం ఆ ప్రోగ్రాం.
ఓ అయితే నువ్వు రావా?
ఎలా? రాను.
ఛ.... ఛ... అస్సలిప్పటికే అందరూ నా గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ప్లీజ్....రావాలి నువ్వుకూడా.
"నాకు కుదరదు."
"సరే"....వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
మర్నాడు ఉదయం శ్రీనివాసరావు లేవక ముందే తట్టి లేపి తలుపులేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది రమ.
అతనికి ఏ పిక్ నిక్ కీ వెళ్ళాలనిపించలేదు. అందరూ భార్యా పిల్లలతో సందడిగా వస్తే తాను?" అతనికి పట్టలేని కోపం వచ్చింది. తల రెండు చేతుల్తో పట్టుకున్నాడు. ఈ జీవితమంతా ఇలా దొర్లవలసిందేనా! కాదు అలా వీల్లేదు తానూ మగవాడిగా. అధికారంగల భర్తగా తనకు విదేయురాలైన భార్యతో జీవితం నడుపుకునే ఉపాయం వెతుక్కోవాలి. తలుపులు టకటకా చప్పుడు.
తలుపు తెరచి కొంచెం కలవరపాటుగా సంతకం చేసి టెలిగ్రాం తీసుకుని గబగబా చదివాడు శ్రీనివాసరావు.
రమ బామ్మకు సీరియస్ గా ఉంది వెంటనే రమ్మని. "బామ్మపోయి తాను వదిలేసి.... రమ దిక్కులేని దవ్వాలి. కసిగా నవ్వుకున్నాడు శ్రీనివాసరావు.
* * *
రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరిన రమ. మీరప్పుడే ఎంతసేపై వచ్చారు? ప్రశ్నించింది కొంటెగా.
అతను మాట్లాడలేదు.
ఏం ఎందుకని? వెళ్ళినట్టులేదే.
నీకెలా తెల్సు? అడిగాడు ఆమెవైపు చురుగ్గా చూస్తూ. మీ లెక్చెరర్సూ మేమూ అంతా ఓ తోటలోనెగా ఎరేంజ్ చేశాం అతని తలమీద పిడుగు పడ్డట్టయింది. రే వందరూ తనవైపు ఎగతాళిగా చూసి నవ్వుతారు. ఇంటికాపున్నావా అని. ఇంకా ఎన్నెన్నో ఛలోక్తులు విసురుతారు. తన మీద తనకే అసహ్యమేస్తూంది. మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళకూడదు. నాకేం ఉద్యోగం లేకపోతే జరగదా! అనుకున్న శ్రీనివాసరావు ఏదో నిశ్చయానికి వచ్చాడు, కొన్ని క్షణాలేమో ఆలోచించిన శ్రీనివాసరావు నెమ్మదిగా సౌమ్యంగా "రమా! నాకు కొంచెం డబ్బుకావాలి ఇస్తావా? అడిగాడు.
నా దగ్గరేముంది? ఆంద్రబ్యాంకులో డబ్బు మొన్న మీ నాన్నగారు అవసరమంటే ఇచ్చేశానుగా?
ఆ ఏడువేలూ! అన్నాడు ఆమెవైపు చురుగ్గా చూస్తూ.
ఏడువేలూ ఎక్కడ ఉన్నాయ్ మీ నాన్న ఏనాడో తీసుకుపోయారు. నవ్వేసింది రమ ఆనాటి శ్రీనివాసరావు కోసం గుర్తొచ్చి.
"సంతోషం ఇదిగో వైరొచ్చింది. "అంటూ ఆమెవైపా కాయితం విసిరాడు.
చదువుకున్న రమ ఘొల్లుమంటూ "వెంటనే నాకు కబురెందుకు చెయ్యలేదూ?"అని అడిగింది.
అతను మాట్లాడలేదు. ఆమె గబగబా సంచీలో రెండు చీరలు కుక్కుకుని స్టేషనువైపు నడిచింది.
ఆమె సుస్తీలో ఉన్నప్పుడూ ఇంకా అనేక రకాలుగా ఆమెను ఆదుకున్నందుకుగాను. ఓ దగ్గర బంధువుపేర ఆమె ఆస్తి వ్రాసినట్టు తెల్సు కున్న రమ హతాశురాలైంది. తనకు బామ్మ నుంచి ఆస్తేమీ సంక్రమించలేదని రుజువైన తర్వాత. తప్త హృదయంతో రిక్తహస్తాలతో ఇల్లు చేరింది రమ.
శ్రీనివాసరావు ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళి పోయాడన్న వార్త క్షణాల్లో ఆమెకు చెప్పాడొక కాలేజీ విద్యార్ధి. దిమ్మెరపోయింది రమ. ఏమిటన్నీ ఇలా జరుగుతున్నాయి ఆలోచనలు స్తంభించాయి ఓ క్షణం ఏమిటి జరుగబోతూంది ముందు? భగవాన్ నన్నిపరీక్షలకు నిలబెడుతున్నావ్ ఆమెకళ్ళు జలజలా వరించాయి.
కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి తనకు తాను ధైర్యం చెప్పుకున్న రమ చూస్తాను. నన్నేం చేయగలదో ఆయన ఉద్దేశ్యమేమిటో" అనుకుంది.
* * *
ఏమిటిలా వచ్చావ్? ఇప్పుడేం సెలవులు లేవుగా! నువ్వొక్కడివే వచ్చావ్ అమ్మాయిని తీసుకురాక పోయావా? పెట్టేబెడ్డింగూ ఇంట్లోపెట్టేస్తూన్న కొడుకును సంభ్రమంగా చూస్తూ అడిగింది. జానికమ్మ.
నాన్నేరి ప్రశ్నించాడతను.
వీధిలో కెళ్ళారు. అవునూ? అర్దాంతరంగా ఉత్తరం ముక్కయినా వ్రాయకుండా ఇలా వచ్చావేమిటీ? రెట్టించిందామె.
తర్వాత చెప్తాలే అమ్మా. కాఫీ ఉంటే ఇయ్యి. అన్నాడు శ్రీనివాసరావు బట్టలు మార్చుకుంటూ.
అతనిరాకకి రంగనాధంగారూ ఆశ్చర్యంతో అందోళనా వ్యక్తం చేస్తూ ప్రశ్నలవర్షం కురిపించాడు.
మూడు సంవత్సరాల తమ దాంపత్య జీవితంలో తననామె లక్ష్యపెట్టకుండా క్షణక్షణం ఎలా ఎదురు తిరిగేదో, ఆమె ప్రవర్తనకి తానెలా కుమిలిపోతున్నాడో క్లుప్తంగా చెప్పి నన్నేం చెయ్యమన్నారమ్మా! చెప్పండి. ఈ పెళ్ళి నాకు ఇష్టంలేని పెళ్ళి చేసేకన్నా ఇంకే శిక్ష విధించినా సంతోషంగా అనుభవించే వాడినమ్మా! తొలిసారిగా శ్రీనివాసరావు కళ్ళల్లో నీరు తిరిగింది.
నిస్సహాయంగా, నిరుతురులే కొన్నిక్షణాలు చిత్తరువుల్లా ఉండిపోయారా దంపతులు.
కొన్ని క్షణాలు బరువుగా దొర్లిన తర్వాత నేను ఓసారి అమ్మాయిని మందలించి తీసుకురానా? అన్నాడు రంగనాధం.
నవ్వాడు పేలవంగా శ్రీనివాసరావు. "లాభం లేదు నాన్నా తన ఇష్టప్రకారం తాను చేస్తుందంతే .. తాను ఇక్కడికిరాదు వచ్చినా నాకు అక్కర్లేదు." అంటూ.
"వద్ధంటే తప్పుతుందా బాబూ దాంపత్య బంధం?" బాధగా ధ్వనించింది రంగనాధం గొంతు.
"ఆ బంధానికికట్టుబడే ఇన్నాళ్ళూ వహించాను......కమ్మని తిండికి వాచీపోయాను నాన్నా ఆమె నాకేనాడూ ఆప్యాయతగా అన్నంపెట్టలేదు."
జాలిగా చూశారు కొడుకువైపు తల్లిదండ్రులు
* * *
శ్రీధర్ నువ్వా కంగ్రాచ్యులేషన్స్ భార్యా సహితంగావచ్చావే లెటరు వ్రాయకపోయావా? ఇల్లెలా తెలిసింది?" అంది రమ తలుపుతీసి సంతోషంగా వచ్చిన అతిథులవైపు చూస్తూ.
"వ్రాశానే మీ వారికి" అన్నాడు శ్రీధర్.
తన కెవరన్నా ఉత్తరాలు వ్రాస్తే చించి పారేస్తాడు శ్రీనివాసరావని తెలిసి రమ నవ్వేస్తూ మరచిపోయి ఉంటార్లే. అంటూ గబగబా ఉచిత మర్యాదలు చేసింది.
