అతనివైపొకసారి చూసి జోడు తొడుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది రమ.
డ్యూటీనుంచి తిరిగివస్తున్న రమ ఆఫీసు దగ్గర చేతులు కట్టుకు నిల్చున్న శ్రీనివాసరావుని చూసి ఆశ్చర్యం. సంతోషం. తృప్తీ ఎన్నో సద్భావాలు అతనిపై ముప్పిరిగొనగా. "నాకు అలవాటేగా. ఎందుకొచ్చారు? నిద్రపాడు చేసుకొని!" అంది అతని భుజం మీద చెయ్యివేసి అతనితో నడుస్తూ.
"నీకెందుకొచ్చిన యాతన రమా! రిజైన్ చెయ్యి" అన్నాడతను.
"నేనెప్పుడూ ఉద్యోగం మానెయ్యాలను కోవడం లేదు." ఆమె జవాబు.
అర్ధరాత్రి నడిరోడ్డు. ఆమెతో ఇంకేమీ మాట్లాడలనిపించ లేదతనికి.
రమ నైట్ డ్యూటీ కెళితే ఆమె తిరిగివచ్చే వేళకు విధిగా ఆమె ఆఫీసు వైపుకు వెళ్తాడు శ్రీనివాసరావు.
రంగనాధం డబ్బు దుబారా చెయ్యొద్దనీ, ఇంకా ఎలా సంసారం పొదుపు చెయ్యాలో ఉత్తరాలు వ్రాస్తున్నాడు.
రమ స్నేహితులు నలుగురు రమ వయస్సు వారిద్దరూ ఆమెకన్నా రెండుమూడేళ్ళు పెద్ద వాళ్ళిద్దరూ వచ్చారోరోజు నవ్వుతూ ఆప్యాయతగా ఆహ్వానించింది. శ్రీనివాసరావుని పరిచయం చేసంధి వారికి రమ.
"నీ లెటరూ, శుభలేఖా అందాయి రాలేక పోయాం అనూ ఆమెకు ఓ దంతపు బొమ్మ. లెదర్ బాగ్ బహుమతి ఇచ్చారు వారు. వారికి కాఫీ, టిఫినూ పెట్టి, ఎన్నెన్నో తాము కాలేజీలో చదివినరోజుల దగ్గరనుంచీ ఆ రోజువరకూ ఎన్నో జరిగిన సంగతులు. ఫ్రీగా నవ్వుతూ, మధ్యమధ్య ఛలోక్తులూ, కవ్వింపూలూ శ్రీనివాసరావు ఉనికె గుర్తించకుండా మాట్లాడు తూన్న రామవైపు చురచురా చూసి, బాత్ రూమ్ కెళ్ళాలనే నెపంతో అక్కడ నుంచి తప్పుకున్నాడు శ్రీనివాసరావు.
వాళ్ళు గడప దిగి వెళ్ళిన క్షణంలో "ఉంది మనలేకపోయానా? ఈ రాత్రికి?" వ్యంగ్యంగా, కసిగా అన్నాడు శ్రీనివాసరావు.
"సరదాగా సినిమాకెళ్దాం ఉండండి అన్నాను. కాని ఏవో పనులున్నాయట. "పరధ్యానంగా అతని గొంతుపసిగట్టని రమ అంది.
నాలుగు క్షణాలు. ఎలా మందలించాలి! ఈమె స్వేచ్చ ఎలా అరికట్టాలి? అనే ఆలోచనలో శ్రీనివాసరావు కాఫీ, టిఫినూ గిన్నెలు కడగడంలో రమా మౌనంగా ఉండిపోయారు.
"మా బంధువుల్లో చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు కానీ నీలా ఇంత స్వేచ్చగా మగా ఆడా లేనివి లేనట్టు. కుమారి, శ్రీమతి ఇద్దరి వ్యక్తిత్వంలో తేడా ఉండదన్నట్టు ప్రవర్తించరు" అన్నాడతను.
"మా బంధువుల్లో చాలామంది చదువుకుని ఉద్యోగం చేసే స్త్రీ లని పెళ్ళి చేసుకున్నారు. కాని పురాణయుగంనాటి పురుషుల్లా భార్యకి ఖాయిదాలు పెట్టరు. అందామె కొంటెగా.
"ప్చ్....ఒక్కటి అడుగుతాను సమాధానం చెప్పు. నేను మరొక స్త్రీతో సంబంధంపెట్టుకుంటే నీకెలాటి బాధా అభ్యంతరమూ ఉండవు కదూ?"
"అంటే?" ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.
"నువ్వలా మగవాళ్ళతో చనువుగా మాట్లాడ్డం నాకు కష్టంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే..నీ ఉద్యోగం, నీ ఫ్రెండ్సూ. నీ ఫ్యాషనూ ఏవీ నాకు నచ్చడం లేదు..... నువ్వు మారాలి. మారితీరాలి. మనమధ్య పొరపొచ్చాలు రాకుండా ఉండాలంటే!" ఆరునెలలయి సహిస్తూన్న శ్రీనివాసరావు గబగబా అనేసి తేలిగ్గా నిట్టూర్చాడు.
"తన స్వార్ధంకోసం తన సంతోషంకోసం ఒకరి ఇష్టాలు. అభిరుచులూ, చంపేవారంటే నాకు అసహ్యం. కాలేజీ ఇల్లూ తప్ప బయట ప్రపంచమే అక్కలేని మీరు ఎలా పుట్టారో 'నా కోసం' ఎవరి నీతీ వారికుండాలి. అంతేకాని నేను బాధబడతానని. నా కోసం మీరు మీకు అటువంటి చాపల్యమే ఉంటే మరొక స్త్రీని కోరుకోవడం మానేస్తారా?.... అలా బెదిరిస్తే భయపడేదాన్ని మాత్రం కాదు." వచ్చే కోపాన్ని. అసహనాన్ని అణచుకుంటూ అంది రమ.
తాను కోరుకున్నది తన మాటకు విలువఇచ్చి తన అభిప్రాయాన్ని మన్నించే భార్య కాని, సూటిగా లెంప వాయించినట్టు జవాబు చెప్పే భార్య కాదు. మగవారితో, వినయంగా ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడి తలుపు వెనక్కి తపుకునే భార్యకాని. చర్చలూ, మీ మాలనలూ, వేసుకు పగలబడినవ్వే భార్య కాదు. అలసి వచ్చిన తనకి ఆదరంగా, పరిచర్యలతో, రుచికరమైన భోజనంతో తృప్తిపరిచే భార్యకాని. తను గడపలో కాలు పెట్టగానే. డ్యూటీకో, ఫ్రెండ్సింటికో, సినిమాకో వెళ్ళిపోయే భార్య కాహ్డు. నయాన్నో భయాన్నో ఆమెను మార్చగలననే గుండె నిబ్బరం క్రమంగా కరిగిపోగా, నిరాశా, నిస్పృహ ఆమెపై అసహ్యం, కసీ పేరుకుంటున్నాయి అతని హృదయంలో కాని అందమైన రమ అతని దగ్గర చేరగానే కాదనలేని దౌర్భల్యం....అదే అదే....తాను నిగ్రహంగా ఉండాలి అనుకున్న శ్రీనివాసరావు మౌనంగా రమపట్ల ముభావంగా ఉండిపోయాడు వారం రోజులు.
అతని ముభావం చిరాకు గ్రహించిన రమ. అన్నంలో నెయ్యివేస్తూ, "వారం రోజులై అదోలా ఉంటున్నారు. వంట్లో ఏమన్నా సుస్తీయా మామూలుగా ప్రశ్నించింది.
అతను మౌనంగా ఆమెవైపొకసారి చూసి తలవంచుకు గబగబా అన్నం తినసాగాడు.
"ఏయ్ మిమ్మల్నే! మాట్లాడాలనిలేదా?" నవ్వుతూ అడిగింది.
"పరుషంగా మాట్లాడి ఒకర్ని ఒకరు నొప్పించుకునే కన్నా మౌనం మంచిది కదూ!"
"నా మాటలకి మీరు నొచ్చుకుంటున్నారా. స్కూలు ఫైనలు చదివే దాకా అమ్మవుంది. పి.యు సి అయ్యేదాకా నాన్న ఉన్నారు. వాళ్ళతో నిస్సంకోచంగా మీతోలానే మాట్లాడి వాదించేదాన్ని. ఇప్పుడు బామ్మా నేనూ పోట్లాడుకుంటుంటాం కాని నా మీద ఎవ్వరూ కోపం తెచ్చుకోలేదు వాళ్ళందరికన్నా నా దృష్టిలో ఎక్కువ మీరు. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తున్నాయా! నా మాటలు ఖాతరు చేస్తున్నారా? నా మీద కోపం తెచ్చుకుంటున్నారా? వద్దండీ మనస్సులో తోచిన మాట అనెయ్యడం. ముక్కుకి సూటిగా పోవడం నాకు అలవాటు. పోనీ నా ఫ్రెండ్సెవరన్నా నాతో అసభ్యంగా మాట్లాడుతున్నారా?" చలించే గొంతుతో ప్రశ్నించింది రమ.
"అలా మాట్లాడితే బావ చంపి చెవులు మూసేసే వాణ్ణి. కాని ఆలోచించు. అమ్మా, నాన్నా బామ్మా, భర్తా. అందరి దగ్గరా ఒకలా మసలడం బాగుండదు. మాట ఖాతరుచెయ్యాలి, చేస్తాను. అలాగే నామాట నువ్వూ ఖాతరు చెయ్యాలి" గబ గబా చెయ్యి కడిగి లేచాడతడు.
పసిపిల్ల లా అతనిపక్కన చేరింది. అతని స్వభావం అర్ధంకాని రమ ఆ రాత్రి -
ఇంకా లోకజ్ఞానం అట్టే తెలియదు అనుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసరావు.
* * *
పెళ్ళయి విస్పారంగా, అర్ధరహితంగా దొర్లి పోతూన్న కాలం అది. చాలాసార్లు ఏదోరకంగా ప్రతిరోజు ఇద్ధరిమధ్యా వాక్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 'గడచిన మూడుసంవత్సరాల్లో నాలుగుసార్లు వచ్చి వెళ్ళిన జానికమ్మ "ఎంత చదువుకన్నా డబ్బు తెచ్చే దైతే మాత్రం మగవాణ్ణి అలా ఎదిరించ వచ్చా? అంటూ ముక్కు మీద వేలేసుకుంది. రంగనాధం. కొడుకునే మందలించేవారు. ప్రావిడెంట్ ఫండుతో తణక భూములు విడిపించి భాగాని కిచ్చారు. పెన్షనూ, పంటగింజలూ వుండగా వారికి కొడుకుడబ్బు అవసరమేమీలేదు.
రమ పల్చని అందమయిన చీరలు కట్టకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు శ్రీనివాసరావు. అలాంటి చీరలు కట్టొద్దని మందలిస్తే ఆమె నిర్లక్ష్యంగా నవ్వేసి మళ్ళీ అవే చీరలు అదే ముస్తాబు ఆమె జీతం తన జీతం తానే తీసుకుంటున్నాడు. కొన్నాళ్ళయి ఆమె చీరలు కొనే అవకాశం ఉండదని జీతంలో ఇంటి ఖర్చులన్నీ మినహాయించి పోకెట్ మనీ అని ఇద్దరి మొత్తం మీద ఓ ఏభై రూపాయలు పెట్లో ఉంచుకొని మిగతాది బ్యాంకులో వేస్తున్నాడు. ఏభై దాచినపెట్టి తాళం రమదగ్గర తాను నాలుగు రూపాయలు పర్సులో పెట్టుకొని అతనికి రూపాయి అర్ధా ఇస్తూంటే నలుగు రూపాయ లియ్యి రామా ఏమయిపోతాయి? అంటాడతను. చాల్లెండి కాఫీకి కేంటిన్ లో నెలకొకసారి ఇస్తారు. డబ్బెక్కువైతే మగవాళ్ళ కేమైనా అలవాటవవచ్చు"నని నవ్వేస్తూ అంటూంది రమ.
"ఆడవాళ్ళు చీరలు కొన్నట్టు" అంటాడతను కవ్వింపుగా నవ్వుతూ.
"చీరలు కొన్నంత మాత్రాన ప్రమాదం, నష్టం ఏం ఉండదు. ఆమె జవాబు"
"ఇవ్వాళ కాస్త వంట చెయ్యరూ! నా వంట్లో ఏం బాగుండలేదు. బద్ధకంగా ఉంది" గునుస్తూ గారంగా అంది రమ.
ఆమె మాటవింటూ తెల్లబోయి సర్దుకుని "బద్ధకం వదిలిపోతుందిలే వంటచేస్తే. చేసెయ్యి మగవాణ్ణి వంట చెయ్యమనడం మర్యాద కాదు."
"ఆడది సంపాదించడం మర్యాద కాబోలు."
"నేను నిన్ను డబ్బు సంపాదించమనలేదే"

"అయితే నే తెచ్చిన జీతం ఎందుకు తీసుకుంటున్నారు?"
"నీవల్ల అనుభవించే సౌఖ్యాలేం లేవు. కనీసం డబ్బుతో నన్నా తృప్తిపడదామని."
"అవును ఏం లేవు మీకు ఎంతచేసీ సంతోషపెట్టలేను. కేరియరు తెస్తారో. వంట చేస్తారో మీ ఇష్టం. మీ కన్నా పెద్ద పొజిషనో ఉన్న మగవాళ్ళే అవసరమైతే వంట చేస్తారు."
