Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 58


    "వాడిది ఆవేశం...." అన్నది. ఆర్తి ఉన్నా వాడు  అనగలడు. కాని ఆ మాటంటే భర్తకు కోపం వస్తుందని తెలుసు

    !నాకేం అవసరం అని వాడిని బ్రతిమాలను!"

    "వాడు మనము కన్న కొడుకండి."

      "కన్న కొడుకయినా, కట్టుకున్న భార్య అయినా కట్టుబాట్లలో ఉన్నంతవరకే గుర్తుంచుకో...."అని ఆయన వెళ్ళిపోయాడు.

    సిద్దార్థను కడుపుతో ఉన్నప్పుడు ఎంత ఆరాటపడ్డారు, ఎన్నెన్ని కలలు కన్నారు. అప్పటికి ఆమెకింకా భర్త స్వరూపం పూర్తిగా తెలియదు.అతను ప్రేమికుడే.

    "యశూ!నాకు కొడుకున్నాడు. కూతురే కావాలి." అన్నాడు రావు.

    "ఉహూ!నాకు కొడుకే కావాలి."

    "ఎందుకో...."

    " మా  నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నాకు కొడుకు పుడితే వాడిని 'నాన్నా'అని పిలుచుకుని నామనసు తీర్చుకుంటాను." అన్నది

    "ఏయ్ !నీకు నేను,భర్తను, తండ్రిని, కొడుకును...."అన్నాడు.

    పొంగి పోయింది.

    ఆ పొంగు అట్టేకాలం నిలువలేదు.

    "కొడుకు పుడితే మా నాన్న పేరు పెట్టాలి."

    "అబ్బా!సిద్దయ్య....ఊహు.....అనిల్,అజిత్ లాంటివి పెడతాను" అన్నది.

    "ఉహు!మొదటిసారి సావిత్రి అదే మీ చనిపోయిన అక్కగారు మధుమూర్తి అంటూ పెట్టింది."

    "ఆ పేరును మోడర్న్ గా చేయవచ్చు."

    "యెలా!"

    "సిద్దార్థా....."అన్నది.

    "అద్బుతంగా ఉంది యశూ!" ఆమె నుదురు బుగ్గలు చుంబించాడు!ఇద్దరూ ఆనంద డోలికంలో తేలియాడారు.

    "సరే  నీ కొడుకు తరువాత కూతురు కావాలి. ఆకుతురికి నాకు ఆస్తి ఇచ్చిన అత్తయ్య పేరు పెట్టాలి"అన్నాడు.

    " కొత్త పేరు పెడితే తప్పా!"

    " కాదు కాని వారిని జ్ఢాపకం ఉంచుకోవాలి.మధు డాక్టరు అవుతాడు. సిద్దార్థ ఇంజనీరు చదువుతాడు.?అన్నాడు.

    "యశోద పకపక నవ్వింది.

    "యెందుకా నవ్వు?"

    " కొడుకు పుట్టకముందే కలలుకనే మీ ఆదుర్దాకి."

    " ఏయ్ నా కోరిక ఏది కలాకాదు, కల్ల అంతకంటే కాదు"అన్నాడు చాలా ఆత్మ విశ్వాసంతో.

    ప్రతీ తల్లితండ్రులు పిల్లల గురించి కలలు కంటారు. ఏమేమో చేయాలనుకుంటారు కాని పిల్లలు పెరిగి పెద్దవారయి, వారి మార్గం వారు ఎన్నుకుంటారు.

    అదృష్టం బావుంటే తల్లి, తండ్రులకు అనువయిన మార్గం ఎన్నుకుంటారు. అదృష్టరేఖ వక్రిస్తే పిల్లలు కొరకరాని కొయ్యలుగా తయారు అవుతారు. ఎదిగే పిల్లలను టాకిల్ చెయ్యటం చాలా కష్టం అక్కడే దెబ్బతినే తల్లి తండ్రులే చాలామంది.

    సిద్దార్థ తండ్రి మాటను ఏనాడు జవదాటలేదు. తండ్రి అంటే యెనలేని గౌరవము.

    సంక్రాంతి సెలవులకు రమ్మని రాస్తే, తను ఎక్స్ కర్షన్ కు వెళ్ళాలని, ఫైనలియర్ అని రానన్నాడు.   

    ఆ వార్తకు యశోదమ్మ, రాధిక ఆశాభంగం పొందినా యెందుకో పురుషోత్తమరావు సంతోషించాడు.

    సంతోషానికి కారణం తెలిసింది. అతని ప్రియురాలు 'జమునాబాయి' దిగింది. ఆమెకు అఖండ స్వాగతం చెప్పాడు.

     భర్తకో ప్రియురాలు ఉన్నట్టు రాధిక పుట్టినప్పుడు తెలిసింది. ఏడ్చింది , మొత్తుకుంది. ఆమెపట్ల అంత ప్రేమ ఉండగా తనను వివాహం చేసుకోవటం అనవసరం అని వాదించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS